lorry Roll over
-
బీరు లారీ బోల్తా.. బాటిళ్లను ఎత్తుకెళ్లిన ప్రజలు
సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల పరిధిలో కలికవాయ ఫ్లైఓవర్ సమీపంలో బీరు బాటిళ్లతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో మద్యం ప్రియులు ఎగబడి బీరు బాటిళ్లను ఎత్తుకెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలోని యునైటెడ్ బ్రేవరేజెస్ లిమిటెడ్ ఫ్యాక్టరీ నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లిలోని మద్యం డిపోకు కింగ్‌ఫిషర్, ఎన్జి బ్రాండు బీరు బాటిళ్ల లోడుతో లారీ బయలుదేరింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల పరిధిలో కలికవాయ ఫ్లైఓవర్ సమీపంలోని విమానాల రన్‌వేపైకి రాగానే డ్రైవర్ నిద్రమత్తు కారణంగా.. రోడ్డు మధ్యలో ఉన్న సిమెంటు దిమ్మెను బలంగా ఢీ కొట్టి లారీ బోల్తా పడింది. ఆదివారం వేకువజామున 3 గంటల సమయంలో ఘటన జరిగింది. అదే సమయంలో చెన్నై నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న ట్యాంకర్ లారీ మద్యం లారీ ట్రక్కు భాగాన్ని బలంగా ఢీ కొట్టడంతో బీరు బాటిళ్లు రోడ్డుపై పడ్డాయి. బీరు బాటిళ్ల విలువ అధికారికంగా రూ.5.50 లక్షలు కాగా మార్కెట్ ధర ప్రకారం సుమారు రూ.30 లక్షలు ఉంటుంది. బీర్ బాటిళ్ల లారీ బోల్తా పడిందని తెలుసుకున్న మద్యం ప్రియులు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని దొరికినవి దొరికినట్లు బీరు బాటిళ్లను ఎత్తుకెళ్లారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు, టంగుటూరు హైవే పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ సమస్య పరిష్కరించారు. తరువాత క్రేన్ సహాయంతో లారీని రోడ్డు పక్కకు చేర్చి మిగిలిన బాటిళ్లను ఎత్తుకెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుని ఎక్సైజ్, సెబ్ అధికారులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎల్.సంపత్‌కుమార్ తెలిపారు. -
చేపల లారీ బోల్తా తృటిలో తప్పిన ప్రమాదం
పశ్చిమగోదావరి, భీమవరం టౌన్: భీమవరం పట్టణం రామ లక్ష్మణ్ నగర్ వంతెన మలుపులో గురువారం చేపల లోడు లారీ పంట కాలువలో బోల్తా పడింది. అదృష్టవశాత్తూ లారీలో ఉన్న వ్యక్తులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. గూట్లపాడు గ్రామం నుంచి లారీ నారాయణపురం వెళుతుండగా ఈ ప్రమాదం జరి గింది. టూ టౌన్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. -
అదుపుతప్పిన లారీ; ఒకరి మృతి
సాక్షి, తూర్పు గోదావరి : రావులపాలెం మండలం రావులపాడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అరటి లోడుతో వేగంగా వస్తున్న లారీ రావులపాడు వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపు తప్పి సర్వీస్ రోడ్లో నిలబడి ఉన్న భార్యభర్తలపై బోల్తా కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా, ఈ ఘటనలో ఉప్పలపాటి సూర్యకుమారి మృతి చెందగా ఆమె భర్త పరిస్థితి విషమంగా మారడంతో దగ్గర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. -
మృత్యు లారీ
విశాఖపట్నం, తగరపువలస(భీమిలి): సంగివలస–పాండ్రంగి రహదారిలో భీమిలి మండలం తాటితూరు పంచాయితీ కళ్లాల వద్ద ఆదివారం సాయంత్రం ఇటుకల లారీ బోల్తా పడి న ప్రమాదంలో పాదచారి కర్రోతు పైడయ్య(48) దుర్మరణం పాలయ్యాడు. అదే ప్రమాదంలో డైవ ర్ సహా మరో ఇద్దరు కూలీలు తీవ్ర గాయాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రత్యక్ష సా క్షులు తెలిపిన వివరాల ప్రకారం... పద్మనాభం మండలం పాండ్రంగి పంచాయితీ సామియ్యవలస నుంచి ఇటుకల లోడుతో సంగివలస వైపు వస్తున్న క్వారీ లారీ తాటితూరు కళ్లాల సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. అ సమయంలో సామియ్యవలసకే చెందిన కర్రోతు పైడయ్య తగరపువలస సంత నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. లారీ బోల్తా పడడంతో వెనుక చక్రాల కింద ఇరుక్కుని అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడని స్థానికులు తెలిపారు. అయితే మరో కథ నం ప్రకారం... అదే లారీలో ఇటుకలపై కూర్చు న్న పైడయ్య లారీ అదుపు తప్పిన వెంటనే రక్షిం చుకునేందుకు గెంతే ప్రయత్నంలో వెనుక టైర్ల కిం ద చిక్కుకుపోయినట్టు తెలిపారు. ఇదే ప్రమాదంలో భోగాపురం మండలం ఉప్పాడపేటకు చెందిన లారీ కూలీ లు పట్నాల రమణ, సాడి కృష్ణ, డ్రైవ ర్ రామారావు తీవ్రంగా గాయపడడంతో చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలిం చారు. ఇటుకల లోడుపై కూర్చున్న నలుగురు కూలీలు సమయస్ఫూర్తితో వ్యవహరించి తప్పుకోవడం వల్లే గాయాలతో బయట పడ్డారని... లేదంటే ఇటుకల మధ్య సజీవ సమాధి అయ్యేవారని స్థానికులు తెలిపారు. ఈ లారీ ఆనందపురానికి చెందిన దొంతల నాగరాజుదని తెలిపా రు. వ్యవసాయకూలీ అయిన పైడయ్యకు భార్య ఆదిలక్ష్మి, కుమారుడు అప్పలరాజు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారిలో చిన్న కుమార్తె శాంతి కి ఇంకా వివాహం కావాల్సి ఉండగా కుమారుడు అప్పలరాజు కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నట్టు తెలిపారు. పైడయ్య మృతితో సామియ్యవలసకు చెందిన పలువురు సంఘటన స్థలానికి చేరుకోవడంతో గోస్తనీ నదీ తీరం దుఃఖసాగరమయింది. కుటుంబ సభ్యుల రోదనలు చూపరులను కలిచివేశాయి. సంఘటనా స్థలానికి భీమిలి లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, రోడ్ సేఫ్టీ విభాగం సిబ్బంది చేరుకుని టైర్ల కింద చిక్కుకున్న మృతదేహాన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేశారు. -
బియ్యం లారీ బోల్తా : ఇద్దరి మృతి
ముద్దనూరు : వైఎస్సార్ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. నంద్యాల నుంచి బియ్యం లోడుతో వెళుతున్న లారీ ముద్దనూరు మండలం పులికోన వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నంద్యాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.