బియ్యం లారీ బోల్తా : ఇద్దరి మృతి
Published Tue, Aug 30 2016 8:47 AM | Last Updated on Sat, Aug 25 2018 6:06 PM
ముద్దనూరు : వైఎస్సార్ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. నంద్యాల నుంచి బియ్యం లోడుతో వెళుతున్న లారీ ముద్దనూరు మండలం పులికోన వద్ద అదుపు తప్పి బోల్తాపడింది.
ఈ ప్రమాదంలో నంద్యాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement