రావులపాలెం : తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఊబలంక గ్రామంలో రెండు దుకాణాల్లో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి 9 గంటల సమయంలో భారీగా మంటలు ఎగసిపడడంతో స్థానికులు అగ్ని మాపక విభాగానికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికే షాపులు పూర్తిగా దగ్ధం అయ్యాయి. సుమారు రూ.3 లక్షల మేర ఆస్తినష్టం జరిగి ఉంటుందని సమాచారం.