- ప్రజాప్రతినిధుల కితాబు
- కబడ్డీ పోటీలు ప్రారంభం
రాష్ట్రస్థాయిలో పేరొందిన సీఆర్‌సీ క్రీడా పోటీలు
Published Fri, Jan 13 2017 10:38 PM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM
రావులపాలెం(కొత్తపేట):
సంక్రాంతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ రావులపాలెంలో ఏటా సీఆర్‌సీ నిర్వహిస్తున్న క్రీడా పోటీలు రాష్ట్ర స్థాయిలో ఖ్యాతి పొందాయని కొత్తపేట, రాజోలు ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, గొల్లపల్లి సూర్యారావు, ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సీఆర్‌సీ సంక్రాంతి సంబరాలు–2017 పేరుతో రాష్ట్ర స్థాయి పురుషులు, మహిళల కబడ్డీ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. పోటీలను ఎమ్మెల్యేలు జగ్గిరెడ్డి, సూర్యారావు, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. డాక్టర్ చిర్ల సోమసుందరరెడ్డి ఓపె¯ŒS ఆడిటోరియంలో జరిగిన ప్రారంభ సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ సంక్రాంతికే కాక ఎన్నో క్రీడా పోటీలు నిర్వహిస్తూ క్రీడాభివృద్ధికి సీఆర్‌సీ అందిస్తున్న చేయూత ప్రశంసనీయం అన్నారు. ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ క్రీడలతో మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. ఎమ్మెల్యే సూర్యారావు మాట్లాడుతూ సంక్రాంతి క్రీడల్లో కోనసీమకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. కబడ్డీ కోర్టులను ఎమ్మెల్యేలు జగ్గిరెడ్డి, సూర్యారావు, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యంలు ప్రారంభించారు. పురుషుల విభాగంలో చిత్తూరు, ప్రకాశం జట్ల మధ్య, మహిళల విభాగంలో తూర్పుగోదావరి, గుంటూరు జట్ల మధ్య మ్యాచులతో పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలు తిలకించేందుకు రావులపాలెం పరిసర ప్రాంతాల నుంచి వందలాది మంది తరలివచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ కోట చెల్లయ్య, జెడ్పీటీసీ సాకా ప్రసన్నకుమార్, ఏఎంసీ చైర్మ¯ŒS బండారు వెంకటసత్తిబాబు, వైస్ ఎంపీపీ దండు వెంకట సుబ్రహ్మణ్యవర్మ, ఎంపీటీసీలు కొండేపూడి రామకృష్ణ, కుడుపూడి శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నా గిరెడ్డి, సీఆర్‌సీ రూపశిల్పి డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి, అధ్యక్ష కార్యదర్శులు మల్లిడి కనికిరెడ్డి, కర్రి ఆశోక్‌రెడ్డి, సత్తి రామకృష్ణారెడ్డి, చెక్కల సూరి బా బు, నల్లమిల్లి సూర్యనారాయణరెడ్డి, నల్లమిల్లి వీ రరాఘవరెడ్డి, కర్రి సుబ్బారెడ్డి, కొవ్వూ రి నరేష్‌కుమార్, సెక్రటరీ వి.వీరలంకయ్య పాల్గొన్నారు.
Advertisement
Advertisement