- ఆలోచింపజేసిన నాటికలు
- సీఆర్‌సీ చేయూత అభినందనీయం :
- సినీనటుడు తనికెళ్ల భరణి
సమాజాన్ని మేల్కొలుపుతూ..
Published Sat, Apr 1 2017 12:06 AM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM
రావులపాలెం (కొత్తపేట):
భారతీయ సంస్కృతులను, సంప్రదాయాలను నేటి తరానికి అందించాలనే సంకల్పంతో కాస్మోపాలిట¯ŒS రిక్రియేష¯ŒS క్లబ్ (సీఆర్‌సీ) ఆధ్వర్యంలో ఏటా నిర్వహిస్తున్న నాటిక పోటీలు నాటక రంగానికి చేయూతనందిస్తున్నాయని సినీ నటుడు, సీఆర్‌సీ కాట¯ŒS కళాపరిషత్ గౌరవ అధ్యక్షుడు తనికెళ్ల భరణి అన్నారు. సీఆర్‌సీ రాçష్ట్రస్థాయి 19వ ఉగాది నాటిక పోటీల్లో ఆఖరి రోజైన శుక్రవారం పోటీలను తనికెళ్ల భరణి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా భరణి మాట్లాడుతూ నాటక రంగానికి జీవం పోసేలా 19 ఏళ్లుగా ఎంతగానో కృషి చేస్తున్న కళాపరిషత్ సేవలు అభినందనీయమన్నారు. ఈ పరిషత్‌కు తాను గౌరవ అధ్యక్షుడిగా ఉండటం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఈ ఏడాది సీఆర్‌సీ కాట¯ŒS కళాపురస్కారాన్ని నెల్లూరుకి చెందిన ప్రముఖ రంగస్థల నటుడు పొన్నాల రామసుబ్బారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు కృష్ణభగవాన్, గౌతమ్‌రాజు, కోట శంకరరావు, సీఆర్‌సీ రూపశిల్పి డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి, అధ్యక్షుడు మల్లిడి కనికిరెడ్డి, కార్యదర్శి కర్రి అశోక్‌రెడ్డి, నాటకపరిషత్ డైరెక్టర్ కుడుపూడి శ్రీనివాస్, డైరెక్టర్లు కర్రి సుబ్బారెడ్డి, చిర్ల కనికిరెడ్డి, నల్లమిల్లి వీర్రాఘవరెడ్డి, కొవ్వూరి నరేష్‌కుమార్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.
ఆకట్టుకున్న నాటికలు
ఆఖరి రోజు ప్రదర్శించిన రెండు నాటికలు ప్రేక్షకులను ఆలోజింపజేశాయి. విజయవాడ యంగ్‌థియేటర్ ఆర్గనైజేష¯ŒS అనగనగా నాటిక ప్రదర్శించారు. ప్రభుత్వాలు మారినా ప్రజల కష్టాలు మారవని పాలక వర్గాల్లోనే మార్పురావాలని ప్రభోదిస్తూ నడిచిన ఈ నాటికను పి.మృత్యుంజయ రచించగా ఆర్.వాసు దర్శకత్వం వహించారు. అలాగే హైదరాబాద్ ఆర్ట్ ఫామ్ క్రియేష¯Œ్స ప్రదర్శించిన ఓ కాశీవాసీ రావయ్య నాటిక మానవతా విలువలను తెలియజేప్పింది. మానవత్వపు విలువలు లోపిస్తున్న సమాజంలో ఎవరి తలకు వాళ్లే కొరివి పెట్టుకునే రోజు వస్తుందనేది ఈ నాటిక ఇతివృత్తం. పీటీ మాధవ్ రచించిన ఈ నాటికకు నామాల మూర్తి దర్శకత్వం వహించారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా అదృష్టదీపక్, పి.గోవిందరావు, బొడ్డు రాజబాబు వ్యవహరించారు.
Advertisement