natikalu
-
తెనాలిలో నాటికల పోటీలు; ఉత్తమ ప్రదర్శన ‘వృద్ధోపనిషత్’
సాక్షి, తెనాలి: వైఎస్ రాజశేఖరరెడ్డి నాటక కళాపరిషత్ ప్రథమ జాతీయస్థాయి నాటికల పోటీల్లో గంగోత్రి, పెదకాకాని సమాజం ప్రదర్శించిన వృద్ధోపనిషత్ నాటికకు ఉత్తమ ప్రదర్శన బహుమతి లభించింది. దీంతోపాటు మరో నాలుగు బహుమతుల్ని ఈ నాటిక కైవసం చేసుకోవడం విశేషం. స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణకవి కళాక్షేత్రమ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి నాటక కళాపరిషత్ ప్రథమ జాతీయస్థాయి ఆహ్వాన నాటికల పోటీల్లో విజేతలకు బుధవారం రాత్రి బహుమతుల ప్రదానం జరిగింది. గంగోత్రి, పెదకాకాని సమాజం ప్రదర్శించిన ‘వృద్ధోపనిషత్’ నాటిక ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైంది. నటించి, దర్శకత్వం వహించిన ప్రసిద్ధ రంగస్థల/సినీ నటుడు నాయుడు గోపి ఉత్తమ సహాయ నటుడిగా, ఉత్తమ దర్శకుడిగా బహుమతులు అందుకున్నారు. సంగీతం అందించిన శ్రీరమణకూ బహుమతి లభించింది. నటుడు ఎన్.సూర్యకు జ్యూరీ బహుమతి వచ్చింది. ► అరవింద ఆర్ట్స్, తాడేపల్లి వారి ‘స్వర్గానికి వంతెన’ నాటిక కూడా పోటాపోటీగా బహుమతుల్ని కైవసం చేసుకుంది. ఉత్తమ ద్వితీయ ప్రదర్శన బహుమతితోపాటు నటించి, దర్శకత్వం వహించిన గంగోత్రి సాయి ఉత్తమ క్యారెక్టర్ నటుడు బహుమతిని గెలుచుకున్నారు. ఉత్తమ రచన బహుమతిని సుప్రసిద్ధ కథ, నాటక రచయిత వల్లూరు శివప్రసాద్‌కు బహూకరించారు. ఉత్తమ ఆహార్యం బహుమతి థామస్‌కు, జ్యూరీ బహుమతి సత్యనారాయణకు లభించాయి. ► కళాంజలి, హైదరాబాద్ వారి ‘మనిషి మంచోడే’ నాటిక ఉత్తమ తృతీయ ప్రదర్శనగా నిలిచింది. శర్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవాసంఘం, శ్రీకాకుళం, బొరివంక వారి ‘ది డెత్ ఆఫ్ మేనీటర్’ నాటికలో టైగర్ రాజు పాత్రధారి బెందాళం శోభన్‌బాబు ఉత్తమ నటుడు బహుమతిని గెలిచారు. ► హర్ష క్రియేషన్స్, విజయవాడ వారి ‘అగ్నిసాక్షి’ నాటికలో ఆమనిగా నటించిన అమృతవర్షిణి ఉత్తమ నటి బహుమతిని అందుకున్నారు. స్నేహ ఆర్ట్స్, వింజనంపాడు వారి ‘కొండంత అండ’ నాటికలో రాంబాబు పాత్రధారి నెమలకింటి వెంకటరమణ ఉత్తమ విలన్ బహుమతిని, ‘మనిషి మంచోడే’ నాటికలో టైగర్ బాలు పాత్రధారి గుంటూరు చలపతి ఉత్తమ హాస్యనటుడు బహుమతిని అందుకున్నారు. ‘ది డెత్ ఆఫ్ మేనీటర్’ నాటికకు ఉత్తమ రంగాలంకరణ బహుమతిని రమణ స్వీకరించారు. న్యాయనిర్ణేతలుగా ఎన్.రవీంద్రారెడ్డి, ఎం.రాంబాబు, ఎ.నర్సిరెడ్డి వ్యవహరించారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖలేదా నసీమ్, ఇతర అతిథులు బహుమతుల్ని ప్రదానం చేశారు. (చదవండి: జైహింద్ స్పెషల్: కోటప్పకొండ దొమ్మీ) -
AP: 25 నుంచి రాష్ట్రస్థాయి నాటక పోటీలు
విజయవాడ కల్చరల్: రాష్ట్రంలో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు తోరం రాజా చెప్పారు. ఈ నెల 25 నుంచి వారం రోజుల పాటు విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాలలో వైఎస్సార్ కళాపరిషత్ ద్వారా రాష్ట్ర స్థాయి నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కనీసం 20 శాతం చిత్రీకరణ జరపాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు నిర్మాతలు, దర్శకులు సహకరించాలని కోరారు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలోని 24 క్రాఫ్ట్స్‌కు చెందిన వారికి గుర్తింపు కార్డులు, ఇతర సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రంగస్థల కళాకారిణి రాజేశ్వరి మాట్లాడుతూ.. కళాకారులకు బస్‌పాస్ రాయితీ ఇవ్వాలని కోరారు. సినిమాలను ఏపీలో కూడా చిత్రీకరించి.. స్థానిక కళాకారులకు అవకాశమివ్వాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు, ఉపాధ్యక్షుడు సుఖమంచి కోటేశ్వరరావు, సభ్యులు కొప్పుల ఆనంద్, బొర్రా నరసయ్య పాల్గొన్నారు. (క్లిక్: త్యాగానికి బహుమతి.. పరిహారం మంజూరు) -
నాటకరంగ ఘనాపాఠి కొర్రపాటి
స్త్రీ పాత్రలు లేని ప్రదర్శన యోగ్యమైన నాటికల కోసం ఆంధ్రనాటక రంగం ఎదురు చూస్తున్న తరుణంలో ఆ లోటు పూడ్చిన ఘనత డాక్టర్ కొర్రపాటి గంగాధరరావుది. 1950–80 మధ్య దశాబ్దాల్లో తెలుగు నాటక రంగాన్ని ఆయన సుసంపన్నం చేశారు. 110కి పైగా నాటికలు, నాటకాలు రాసి ‘శతాధిక నాటక రచయిత’గా ఖ్యాతి గడించారు. వృత్తిరీత్యా వైద్యుడైన కొర్రపాటి 1922 మే 10న బందరులో జన్మించారు. అభ్యుదయ భావాలతో, సంస్కరణాభిలాషతో, సమసమాజ స్థాపనా ధ్యేయంతో ఆయన రాసిన నాటికలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ఆసక్తిదాయకంగా ప్రేక్షకుల హృదయాలలో పదికాలాల పాటు నిలిచిపోయే విధంగా పాత్రలను తీర్చిదిద్దడంలో ఆయన సిద్ధహస్తుడు. గంభీరమైన సన్నివేశాల మధ్య కూడా ఒక సునిశితమైన హాస్య సంఘటనను చొప్పించి నాటకాలను రంజింపజేయడంలో ఆయనది అందెవేసిన చేయి. ‘యథా ప్రజా తథా రాజా’, ‘పెండింగ్ ఫైలు’, ‘తెరలో తెర’, ‘కమల’, ‘ఆరని పారాణి’, ‘తారా బలం’, ‘తెలుగు కోపం’, ‘కొత్త చిగురు’, ‘లోక సంగ్రహం’ వంటివి వందలాది ప్రదర్శనలకు నోచుకున్నాయి. కొర్రపాటి గొప్ప నటుడు కూడా! చిన్నతనం నుండి నాటకాలు వేసేవారు. అందరూ ఆయన్ని ‘రంగబ్బాయి’ అని పిలిచేవారు. 14 ఏళ్ల వయసులోనే ‘హతవిధీ’ అనే నాటిక రాసి ఆడారు. ప్రధానంగా స్త్రీ పాత్రలు వేసేవారు. ‘విడాకులా’ అనే నాటికలో ఆయన స్త్రీ పాత్ర నటన పలువురి ప్రశంసలు పొందింది. స్వాతంత్రోద్యమ కాలంలో ‘నా దేశం’ నాటకంలో ‘కామ్రేడ్’ పాత్రను పోషించారు. తర్వాతి కాలంలో సినీరచయితగా, నవలా రచయితగా కూడా పేరు గడించారు కొర్రపాటి. ‘ఇద్దరు మిత్రులు’, ‘మాయని మమత’ వంటి చిత్రాలకు మాటలు రాశారు. ఇవిగాక షాడోరైటర్గా కూడా ఇంకా చాలా సినిమాలకు మాటలు రాశారు. కొర్రపాటి సుమారు పది నవలలు రాశారు. వాటిలో ‘లంబాడోళ్ళ రాందాసు’, ‘గృహ దహనం’, ‘ధంసా’ అధిక ప్రాచుర్యాన్ని పొందాయి. ఆంధ్ర నాటక కళా పరిషత్ నుండి అసంఖ్యాకంగా బహుమతులు పొందారు. ‘రంగరచనా ప్రవీణ’ అనే బిరుదాన్ని పొందారు. ఆంధ్ర సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీలలో సభ్యుడిగా నియమితులైనారు. ( చరిత్ర చెక్కిలిపై చెరగని సంతకం) ఔత్సాహికులకు శిక్షణ ఇవ్వడానికి కొర్రపాటి నాటక శిక్షణాలయాన్ని కూడా నడిపారు. ‘పద్మశ్రీ’ స్థానం నరసింహారావు, బందా కనకలింగేశ్వరరావు, గరికపాటి రాజారావు, పినిశెట్టి, రామచంద్ర కాశ్యప, పృథ్వీ రాజ్ కపూర్ వంటి వారితో కొర్రపాటికి సాన్నిహిత్యం ఉండేది. సినీనటులు పి.ఎల్.నారాయణ, చంద్రమోహన్, నూతన ప్రసాద్, కె.ఎస్.టి. సాయి వంటివారు ఆయన శిష్యవర్గంగా ఉండేవారు. కొర్రపాటి మద్రాస్ మెడికల్ కాలేజీలో వైద్యంలో సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసిన తర్వాత బాపట్లలో వైద్యుడిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. గొప్ప హస్తవాసి కలవారని పేరుండేది. ఆయన సౌమ్యులు, మితభాషి, అభ్యుదయవాది, హాస్యప్రియులు. 1986 జనవరి 27న బాపట్లలో తనువు చాలించారు. – డాక్టర్ పి.సి. సాయిబాబు, రీడర్ ఇన్ కామర్స్(విశ్రాంత) (మే 10న కొర్రపాటి గంగాధరరావు శతజయంతి) -
సమాజాన్ని మేల్కొలుపుతూ..
ఆలోచింపజేసిన నాటికలు సీఆర్సీ చేయూత అభినందనీయం : సినీనటుడు తనికెళ్ల భరణి రావులపాలెం (కొత్తపేట): భారతీయ సంస్కృతులను, సంప్రదాయాలను నేటి తరానికి అందించాలనే సంకల్పంతో కాస్మోపాలిట¯ŒS రిక్రియేష¯ŒS క్లబ్ (సీఆర్సీ) ఆధ్వర్యంలో ఏటా నిర్వహిస్తున్న నాటిక పోటీలు నాటక రంగానికి చేయూతనందిస్తున్నాయని సినీ నటుడు, సీఆర్సీ కాట¯ŒS కళాపరిషత్ గౌరవ అధ్యక్షుడు తనికెళ్ల భరణి అన్నారు. సీఆర్సీ రాçష్ట్రస్థాయి 19వ ఉగాది నాటిక పోటీల్లో ఆఖరి రోజైన శుక్రవారం పోటీలను తనికెళ్ల భరణి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా భరణి మాట్లాడుతూ నాటక రంగానికి జీవం పోసేలా 19 ఏళ్లుగా ఎంతగానో కృషి చేస్తున్న కళాపరిషత్ సేవలు అభినందనీయమన్నారు. ఈ పరిషత్‌కు తాను గౌరవ అధ్యక్షుడిగా ఉండటం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఈ ఏడాది సీఆర్సీ కాట¯ŒS కళాపురస్కారాన్ని నెల్లూరుకి చెందిన ప్రముఖ రంగస్థల నటుడు పొన్నాల రామసుబ్బారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు కృష్ణభగవాన్, గౌతమ్‌రాజు, కోట శంకరరావు, సీఆర్సీ రూపశిల్పి డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి, అధ్యక్షుడు మల్లిడి కనికిరెడ్డి, కార్యదర్శి కర్రి అశోక్‌రెడ్డి, నాటకపరిషత్ డైరెక్టర్ కుడుపూడి శ్రీనివాస్, డైరెక్టర్లు కర్రి సుబ్బారెడ్డి, చిర్ల కనికిరెడ్డి, నల్లమిల్లి వీర్రాఘవరెడ్డి, కొవ్వూరి నరేష్‌కుమార్‌రెడ్డి, తదితరులు ఉన్నారు. ఆకట్టుకున్న నాటికలు ఆఖరి రోజు ప్రదర్శించిన రెండు నాటికలు ప్రేక్షకులను ఆలోజింపజేశాయి. విజయవాడ యంగ్‌థియేటర్ ఆర్గనైజేష¯ŒS అనగనగా నాటిక ప్రదర్శించారు. ప్రభుత్వాలు మారినా ప్రజల కష్టాలు మారవని పాలక వర్గాల్లోనే మార్పురావాలని ప్రభోదిస్తూ నడిచిన ఈ నాటికను పి.మృత్యుంజయ రచించగా ఆర్.వాసు దర్శకత్వం వహించారు. అలాగే హైదరాబాద్ ఆర్ట్ ఫామ్ క్రియేష¯Œ్స ప్రదర్శించిన ఓ కాశీవాసీ రావయ్య నాటిక మానవతా విలువలను తెలియజేప్పింది. మానవత్వపు విలువలు లోపిస్తున్న సమాజంలో ఎవరి తలకు వాళ్లే కొరివి పెట్టుకునే రోజు వస్తుందనేది ఈ నాటిక ఇతివృత్తం. పీటీ మాధవ్ రచించిన ఈ నాటికకు నామాల మూర్తి దర్శకత్వం వహించారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా అదృష్టదీపక్, పి.గోవిందరావు, బొడ్డు రాజబాబు వ్యవహరించారు.