సందేశాత్మకంగా సీఆర్సీ నాటికల పోటీలు
Published Thu, Mar 30 2017 11:35 PM | Last Updated on Tue, Sep 5 2017 7:30 AM
రెండో రోజు నాటికలను ప్రారంభించిన సినీ నటుడు తనికెళ్ల భరణి
రావులపాలెం (కొత్తపేట):
ఉగాది పండుగను పురస్కరించుకుని రావులపాలెంలోని కాస్మోపాలిట¯ŒS రిక్రియేష¯ŒS క్లబ్ (సీఆర్సీ) కాట¯ŒS కళాపరిషత్ ఆధ్వర్యంలో సీఆర్సీ కళావేదికలో నిర్వహిస్తున్న 19వ రాష్ట్ర స్థాయి ఉగాది ఆహ్వాన నాటిక పోటీలు సందేశాత్మకంగా సాగుతున్నాయి. రెండో రోజు గురువారం రాత్రి పోటీలను సీఆర్సీ కాట¯ŒS కళాపరిషత్ గౌరవ అధ్యక్షుడు, సినీ నటుడు తనికెళ్ల భరణి ప్రారంభించారు. రెండోరోజు మూడు నాటికలను ప్రదర్శించారు. సినీ నటులు గౌతంరాజు, కోట శంకరరావు ఈ నాటికలను తిలకించారు. మొదటిగా తాడేపల్లి అరవింద ఆర్ట్స్ వారి ‘స్వర్గానికి వంతెన’ నాటిక దేహదానం విలువను తెలియజేసింది. మరణించిన తరువాత దేహం మట్టికో కట్టెకో అర్పించడం సరైంది కాదని రచయిత వల్లూరి శివప్రసాద్, దర్శకుడు గంగోత్రి సాయి ఈ నాటికలో సందేశమిచ్చారు. అనంతరం కొలకలూరి శ్రీ సాయిఆర్ట్స్ వారు ‘చాలు..ఇక చాలు’ నాటికను ప్రదర్శించారు. పీవీ భవానీప్రసాద్ రచించిన ఈ నాటికకు దర్శకుడు గోపురాజు విజయ్.
ఆఖరిగా విశాఖపట్నం శిరీషా ఆర్ట్స్‌వారు ప్రదర్శించిన ‘ఒక రాజకీయ కథ’ నాటిక ఆలోచన రేకెత్తించింది. స్త్రీని ఆకాశంలో సగం అంటూ చెప్పడం కాదని, ఆచరణలో ఎంత వరకూ వారికి న్యాయం జరుగుతోందని దర్శకుడు, రచయిత దండు నాగేశ్వరరావు ఈ నాటిక ద్వారా ప్రశ్నించారు. ఈ నాటికల పోటీలకు న్యాయనిర్ణేతలుగా అదృష్టదీపక్, పి. గోవిందరావు, బొడ్డు రాజబాబు వ్యవహరించారు. సీఆర్సీ రూపశిల్పి డాక్టర్ గొలుగూరి వెంకటరెడ్డి, అధ్యక్షుడు మల్లిడి కనికిరెడ్డి, కార్యదర్శి కర్రి అశోక్‌రెడ్డి, నాటక కళాపరిషత్ డైరెక్టర్ కుడుపూడి శ్రీనివాస్, డైరెక్టర్లు కర్రి సుబ్బారెడ్డి, చిర్ల కనికిరెడ్డి, నల్లమిల్లి వీర్రాఘవరెడ్డి, కొవ్వూరి నరేష్‌కుమార్‌రెడ్డి, కళాపరిషత్ నిర్వాహకుడు పలివెల త్రిమూర్తులు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Advertisement
Advertisement