బైక్ను ఢీకొన్న లారీ : ఒకరు మృతి | One killed, one injured in Road accident in west Godavari District | Sakshi
Sakshi News home page

బైక్ను ఢీకొన్న లారీ : ఒకరు మృతి

Published Wed, Jul 22 2015 3:17 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

One killed, one injured in Road accident in west Godavari District

రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలోని పుష్కరఘాట్ వద్ద బుధవారం బైక్ను వెనుక నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న బొక్కా నాగమణి (35)  అక్కడికక్కడే మరణించింది. ఆమె భర్త సుబ్రహ్మణ్యం స్వలంగా గాయపడ్డారు. దాంతో స్థానికులు వెంటనే స్పందించి అతడిని ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే నాగమణి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని... పోస్ట్మార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  నాగమణి, ఆమె భర్త సుబ్రహ్మణ్యం రావులపాలెంలో పుష్కర స్నానం ఆచరించి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement