గంజాయి స్వాధీనం
గంజాయి స్వాధీనం
Published Thu, Sep 29 2016 9:28 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM
రావులపాలెం :
మొక్కజొన్న పొత్తుల రవాణా ముసుగులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకోవడంతోపాటు గంజాయిని, ట్రాన్స్‌పోర్టుకు ఉపయోగించిన వ్యాన్, కారును రావులపాలెం పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటనకు సబంధించిన వివరాలను గురువారం రావులపాలెం పోలీస్‌స్టేçÙన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ పీవీ రమణ వెల్లడించారు. విశాఖ ఏజెన్సీ నుంచి రావులపాలెం మీదుగా ఇతర రాష్ట్రాలకు గంజాయిని అక్రమంగా తలిస్తున్నట్టు రావులపాలెం పోలీసులకు సమాచారం అందటంతో ఎస్సై పీవీ త్రినాథ్ సిబ్బందితో కలసి పట్టుకున్నారు. రావులపాలెం మండలం రావులపాడు మల్లాయిదొడ్డి బుధవారం తెల్లవారు జామున పోలీసులు కాపుగాశారు. ఈ సమయంలో వ్యాన్‌లో మొక్కజొన్న పొత్తులను పైకి కనిపించే విధంగా ఉంచి అడుగున గంజాయి బ్యాగులు పెట్టి రవాణాకు శ్రీకారం చుట్టారు.ఈ వాహనానికి ముందు కారులో ముందస్తు సమాచారం ఇస్తూ రవాణాకు సహకరిస్తున్న రావులపాలేనికి చెందిన వి.పెదిరాజు, గుడాల సుబ్రహ్మణ్యం, విశాఖ జిల్లా పోతురాజుగుమ్మల గ్రామానికి చెందిన బురిడి బాలరాజులను పోలీసులు అరెస్టు చేశారు. వ్యాన్‌ను తనిఖీ చేయగా దానిలో 23 బ్యాగుల్లో రూ. 23,52,000 విలువైన 784 కేజీ గంజాయిని పోలీసులు గుర్తించారు. అదుపులోకి తీసుకున్న వారిని విచారించగా తునికి చెందిన కొరుప్రోలు దుర్గాప్రసాద్ ద్వారా ఈ లోడు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. వ్యాన్‌లో డ్రైవర్ వి.నూకరాజు పరారవడంతో అతనితోపాటు దుర్గాప్రసాద్‌ను అరెస్టు చేయాల్సి ఉందని సీఐ రమణ తెలిపారు. గంజాయి తరలింపును చాకచక్యంగా పట్టుకున్న ఎస్సై పీవీ త్రినాథ్, ఏఎస్సై ఆర్‌వీ రెడ్డి, హెచ్‌సీ స్వామి, కానిస్టేబుళ్లు సతీష్, మూర్తి తదితరులను సీఐ అభినందించారు. నిందితులను కొత్తపేట కోర్టులో హజరుపరచనున్నట్టు తెలిపారు.
Advertisement
Advertisement