468 కిలోల గంజాయి స్వాధీనం
Published Fri, Feb 10 2017 11:17 PM | Last Updated on Tue, Sep 5 2017 3:23 AM
రాజానగరం :
జాతీయ రహదారి మీదుగా తరలిస్తున్న గంజాయిని రాజానగరం పోలీసులు పట్టుకుని, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తూర్పు మండల డీఎస్పీ రమేష్‌బాబు శుక్రవారం వివరాలు వెల్లడించారు. రాజమహేంద్రవరం అర్బ¯ŒS జిల్లా ఎస్పీ రాజకుమారి సూచనల మేరకు జాతీయ రహదారిపై రాజానగరం సీఐ శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీలో గంజాయి పట్టుబడిందన్నారు. జీఎస్‌ఎల్ పెట్రోలు బంకు వద్ద జాతీయ రహదారిపై విశాఖపట్నం వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళుతున్న వ్యా¯ŒSలో ఉన్న 468 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. దీని విలువ రూ. 23 లక్షల 40 వేలు ఉంటుందన్నారు. వ్యా¯ŒSతోపాటు ఆరు సెల్‌ఫోన్లు రూ.4550 నగదు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. తనిఖీల్లో ముగ్గురు నిందితులు పట్టుబడగా మరో ముగ్గురు పరారయ్యారు. విశాఖపట్నం జిల్లా రావికమాతం మండలం, దొండపూడికి చెందిన చందక రాము, పినపాల లోవరాజు, పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం, కాకిలేరుకు చెందిన ఇంటి శ్రీనివాసరావు పట్టుబడ్డారన్నారు. వీరిని రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. పరారైన వారు విశాఖపట్నం జిల్లా వజ్రగడకు చెందిన సూర్రెడ్డి గోవిందు, దొండపూడికి చెందిన గుడి దొరబాబు, మిరియాలకు చెందిన మస్తా¯ŒSబాషాలుగాపేర్కొన్నారు. వారి కోసం గాలిస్తున్నామని డీఎస్పీ వివరించారు.
Advertisement