- ఇద్దరి అరెస్టు, లారీ సీజ్
400 కిలోల గంజాయి స్వాధీనం
Published Fri, May 5 2017 11:57 PM | Last Updated on Tue, Sep 5 2017 10:28 AM
చింతూరు (రంపచోడవరం) :
జిల్లాలో ని డొంకరాయి ప్రాం తం నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న 400 కిలోల గంజా యిని శుక్రవారం చింతూ రు పోలీసులు స్వాధీ నం చేసుకున్నా రు. చింతూరు మండలం రత్నాపురం జంక్ష¯ŒS వద్ద ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయడంతో పాటు లారీని సీజ్ చేసినట్లు సీఐ కె.దుర్గాప్రసాద్ తెలిపారు. ఒడిశా సరిహద్దుల నుంచి గంజాయి రవాణా అవుతోందనే సమాచారం మేరకు ఎస్‌ఐ శ్రీని వాస్‌కుమార్ సిబ్బందితో కలసి రత్నాపురం జంక్ష¯ŒS వద్ద వాహనాల తనిఖీ చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఓ లారీని తనిఖీ చేయగా 20 కిలోల చొప్పున 20 ప్లాస్టిక్ మూటల్లో రవాణా చేస్తున్న గంజాయిని గుర్తిం చామని తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.12 లక్షలు వుం టుం దని, ఈ రవాణాకు పాల్పడుతున్న వై.రామవరం మండలం డొంకరాయిలో నివాసముంటున్న ఒడిశాకు చెందిన పంగి మాణిక్యం, హైదరాబాద్‌కు చెంది న మేకల మనోహర్ అలియాస్ వందనంలను అరెస్టు చేసినట్టు తెలిపా రు. స్వాధీనం చేసుకున్న గంజాయికి ఇ¯ŒSచార్జి తహసీల్దార్ ప్రసాద్ సమక్షంలో పంచనామా నిర్వహించినట్లు సీఐ పేర్కొన్నారు.
గంజాయి తరలిస్తున్న ఆటో స్వాధీనం
గొల్లప్రోలు : గంజాయి తరలిస్తున్న ఆటోను గొల్లప్రోలు పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. కత్తిపూడి వైపు నుంచి పిఠాపురం వైపు వెళ్తున్న ఆటోను తనిఖీ చేయగా గంజాయిను పోలీసులు గుర్తించారు. ఆటో లోపల పైభాగంలో ప్రత్యేకంగా తయారు చేసిన బాక్స్‌లో గంజాయి ప్యాకెట్లను అమర్చారు. ఆటోను, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చిత్రాడకు చెందిన ఆటో డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్‌ను విచారించి కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement