రావులపాలెం : తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం ఓబులంకలో పుష్కర స్నానానికి వెళ్లిన ఇద్దరు గుర్తుతెలియని యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటన గురువారం ఓబులంకలోని పుష్కర ఘాట్లో జరిగింది. వారి ఆచూకీ తెలుసుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.