రావులపాలెంలో సినీ సందడి
Published Tue, Oct 18 2016 11:58 PM | Last Updated on Tue, Oct 2 2018 2:44 PM
రావులపాలెం :
మండల పరిధిలోని వెదిరేశ్వరం శివారు కోసూరు నగర్ పంట చేల మధ్య మంగళవారం ప్రముఖ హీరో హీరోయిన్‌లు శర్వానంద్, లావణ్య త్రిపాఠీ నటిస్తున్న చిత్రం షూటింగ్ జరిగింది. వరి చేల మధ్య పల్లెటూరి వాతావరణంలో హాస్య సన్నివేశాలు చిత్రీకరించారు. హీరో శర్వానంద్‌తో పాటు కమెడీయన్లు షకలక శంకర్ తదితరులు ఈ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొన్నారు. సాయంత్రం వరకూ ఈ ఘాటింగ్ జరిగింది. సమీప ప్రాంతాలకు చెందిన అక్కడికి రావడంతో సినీ సందడి నెలకొంది.
కాప్స్, ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి హిట్ చిత్రాలు నిర్మించిన బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ చిత్రంలో శర్వానంద్, లావణ్య త్రిపాఠీలు హీరో హీరోయిన్లు కాగా కోట శ్రీనివాసరావు, రవికిషన్, సప్తగిరి, షకలక శంకర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారన్నారు. ‘‘దర్శకుడిగా నాకు ఇది మొదటి చిత్రం. రచయితగా పలు చిత్రాలకు పని చేస్తున్నాను’ అని దర్శకుడు చింతాడ చంద్రమోహన్ తెలిపారు. ‘‘కోనసీమ అందాలు ఇక్కడి పంట చేలు కొబ్బరి తోటలు, గలగల పారే కాలువలు ఎంతో బాగున్నాయని హీరో శర్వానంద్ అన్నారు. ‘సినిమా ఘాటింగ్‌లకు తూర్పు గోదావరి జిల్లా నంబర్ వన్ ప్రాంతమని, జబర్దస్త్ షో ద్వారా నాకు మంచి గుర్తింపు వచ్చింది’’ కమెడీయన్ అని షకలక శంకర్ తెలిపారు.
Advertisement
Advertisement