‘మామా..ఓ చందమామా’ షూటింగ్ సందడి
Published Sun, Nov 13 2016 10:03 PM | Last Updated on Tue, Oct 2 2018 2:44 PM
పసలపూడి(రాయవరం) :
ఈస్ట్ వెస్ట్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ’మామా..ఓ చందమామా’ సినిమా షూటింగ్ రాయవరం మండలం పసలపూడిలో జరుగుతోంది. హీరోగా సాయిరామ్ కార్తీక్, హీరోయి¯ŒSగా సనా మక్బుల్‌ఖాన్, ప్రతి నాయకుడిగా జీవా, ముఖ్యపాత్రల్లో నాగినీడు, దువ్వాసి మోహ¯ŒS తదితరులు నటిస్తున్నారు. ఈ సందర్భంగా సినిమా దర్శకుడు వెంకట్ మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంలో..ఆప్యాయతలు, అనుబంధాలు దూరమవుతున్న తరుణంలో వాటి విలువలను ఈ సినిమా తెలుపుతుందన్నారు. నేటి సమాజంలో జరిగే ఘటనలకు అద్దం పట్టే విధంగా సినిమా ఉంటుందన్నారు. జిల్లాలోని కోటిపల్లి, రామచంద్రపురం, కె.గంగవరం, దంగేరు తదితర ప్రాంతాల్లో రెండు షెడ్యూల్స్‌లో చిత్రీకరణ చేస్తామన్నారు. బొడ్డు శ్రీలక్ష్మి సమర్పణలో బొడ్డు వరప్రసాద్ నిర్మాతగా, మురళి సాధనాల సహ నిర్మాతగా నిర్మిస్తున్న సినిమాకు సంగీతాన్ని మున్నా కాశి అందిస్తున్నారని, ఆర్ట్ డైరెక్టర్‌గా ఉత్తరకుమార్ సూరిశెట్టి, కెమెరామ¯ŒSగా జి.ఎల్.బాబు, కో డైరెక్టరుగా నాగేంద్ర వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. సినిమాకు అవసరమైన సెట్టింగ్‌లను పసలపూడి శివాలయం, సత్తి అనసూయమ్మ నిలయంలో వేసి చిత్రీకరణ చేస్తున్నారు. జీవా, దువ్వాసి మోహ¯ŒSలపై ఆదివారం పలు సన్నివేశాలను చిత్రీకరించారు.
Advertisement
Advertisement