తిర్మలగిరిలో సినిమా షూటింగ్‌ | film shooting in tirmalagiri | Sakshi
Sakshi News home page

తిర్మలగిరిలో సినిమా షూటింగ్‌

Published Sat, Oct 1 2016 8:48 PM | Last Updated on Tue, Oct 2 2018 2:44 PM

తిర్మలగిరిలో సినిమా షూటింగ్‌ - Sakshi

తిర్మలగిరిలో సినిమా షూటింగ్‌

హాలియా: హనుమాన్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న సినిమా షూటింగ్‌ శనివారం మండలంలోని తిర్మలగిరి, ఎల్లాపురం రాజవరం మేజర్‌ ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో, హీరోయిన్లపై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. అనంతరం దర్శకుడు లక్ష్మణ్‌ మాట్లాడుతూ పూర్తి స్థాయి గ్రామీణ వాతావరణంలో సినిమాను నిర్మిస్తున్నామని, మరో వారం రోజుల్లో షూటింగ్‌ పూర్తవుతుందన్నారు. ఇందులో హీరోగా హర్షవర్థన్‌రెడ్డి, హీరోయిన్‌లుగా రోహిణీ, దివ్యలు, కోడైరక్టర్‌గా నరేష్, కెమెరామెన్‌గా తౌర్యాలు వ్యవహరిస్తున్నారని తెలిపారు. సినిమాకు ఇంకా టైటిల్‌ ఖరారు చేయలేదని దర్శకుడు తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement