రాజాపేటలో సినిమాషూటింగ్‌ | Film shooting in rajapeta | Sakshi
Sakshi News home page

రాజాపేటలో సినిమాషూటింగ్‌

Published Wed, Aug 24 2016 6:52 PM | Last Updated on Tue, Oct 2 2018 2:44 PM

రాజాపేటలో సినిమాషూటింగ్‌ - Sakshi

రాజాపేటలో సినిమాషూటింగ్‌

రాజాపేట: మండలంలోని హరిష్‌రావ్‌ ఫామ్‌హౌజ్‌లో బుధవారం బీ ఫామ్‌హౌజ్‌ సినిమా షూటింగ్‌ నిర్వహించారు. ఎంఅండ్‌ఎస్‌ క్రియేషన్స్, లక్ష్మీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రజెంట్స్‌ వారి బీ ఫామ్‌హౌజ్‌ సినిమాలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ ఎస్‌ పాల్‌ వివరాలను తెలిపారు. కథ, డైరక్టర్, నిర్మాత ఎస్‌ పాల్, కెమెరామెన్, స్క్రీన్‌ప్లే వీఎన్‌ రాజు, రణదీప్‌రెడ్డి, హీరో రిషి, అక్షయ్, హీరోయిన్‌ రమ్యారెడ్డిలు నటిస్తున్నట్లు తెలిపారు.  వారం రోజులు క్రితం సినిమా షూటింగ్‌ ప్రారంభించినట్లు, ఈ సినిమా షూటింగ్‌ సన్నివేశాలను హైదరాబాద్‌లోని అమీర్‌పేట, చర్లపల్లి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ నినిమా మొత్తం హర్రర్, సెంటిమెంట్, క్రైం సన్నివేశాలల్లో మొత్తం 15 మంది పాత్రలు పోషిస్తున్నట్లు తెలిపారు. తనకు ఈ సినిమా మొదటిదని దీపావళి వరకు బీ ఫామ్‌హౌజ్‌ సినిమా రిలీజ్‌ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement