జాహ్నవిలో సినిమా షూటింగ్
జాహ్నవిలో సినిమా షూటింగ్
Published Thu, Sep 29 2016 10:17 PM | Last Updated on Tue, Oct 2 2018 2:44 PM
సూర్యాపేట రూరల్: ఆర్‌ఎం మూవీ మ్యాకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న మరో దృశ్యం సినిమా షూటింగ్ గురువారం సూర్యాపేట మండలంలోని కేటీ అన్నారం రోడ్డులో గల జహ్నావి టౌన్‌షిప్‌లో నిర్వహించారు. ఈ సినిమాలో హీరోగా పచ్చిపాల గౌతమ్, హీరోయిన్‌గా శ్వేత నటిస్తున్నట్లు సినిమా నిర్వాహకులు తెలిపారు. సినిమా ఫోటోషాట్‌లో భాగంగా హీరో గౌతమ్, హీరోయిన్ శ్వేతలపై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమా హత్యలు, అత్యాచారాల నివారణకు తోడ్పడే విధంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ కట్ల రాజేంద్రప్రసాద్, కో డైరెక్టర్ కోల మధుబాబు, నటీనటులు బోళ్ల స్వామిరెడ్డి, దొంతగాని సత్యనారాయణ పాల్గొన్నారు.
Advertisement
Advertisement