halia
-
Dalita Bandhu: రూ.లక్ష కోట్లయినా సరే
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లైనా, అనేక విజయాలు సాధించినా దళిత జాతి మాత్రం వెనుకబడే ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లోనే వారి కోసం అద్భుతమైన తెలంగాణ దళిత బంధు పథకం తీసుకొచ్చామని తెలిపారు. ‘రూ.లక్ష కోట్లయినా సరే ఖర్చు చేస్తాం. ఆరు నూరైనా దళిత బంధు అమలు చేసి తీరతాం. రాష్ట్రంలో సుమారు 16 – 17 లక్షల దళిత కుటుం బాలు ఉంటే అందులో అర్హత కలిగిన కుటుంబాలు దాదాపు 12 – 13 లక్షల వరకు ఉన్నాయి. వారం దరికీ ఇంటికి రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం అందజేస్తుంది. వచ్చే సంవత్సరం నుంచి పెద్దమొత్తంలో డబ్బులు మంజూరు చేసి అమలు చేస్తాం.’ అని స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా హాలియాలో సోమవారం నిర్వహించిన నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రగతి సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడారు. నల్లగొండ జిల్లా హాలియాలో జరిగిన నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రగతి సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వారివి ఎన్నడూ చేసిన ముఖాలు కావు ‘దళితబంధుపై కొంతమంది అపోహలతో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. అయితదా.. పోతదా.. అంటున్నారు. వారివి చేసిన ముఖాలు కావు కాబట్టి, ఎన్నడూ చేయలేదు కాబట్టే అలా మాట్లాడుతున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దళితులను వారి ఖర్మకు వారిని వదిలేశారు తప్ప.. ఎవరూ ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదు. పుట్టగతులుండవనే అవాకులు, చెవాకులు దళిత బంధు పథకం తీసుకురావడంతో కేసీఆర్ చెబితే మొండిగా చేస్తారని ఇప్పుడు అందరికీ గుండెదడ మొదలైంది. కొంతమందికి బ్లడ్ ప్రెషర్ వస్తోంది. దళిత బంధు అమలైతే రాజకీయంగా వారికి పుట్టగతులు ఉండవనే భయంతో అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. ఇప్పటికే గీత కార్మికులను, చేనేత కార్మికులను ఆదుకున్నాం. గీత కార్మికుల పన్ను మాఫీ చేశాం. ఇలా అనేక వర్గాల సంక్షేమం చేపడుతున్నాం. నేనే తెచ్చా .. నేనే పర్యవేక్షిస్తా ఇప్పుడు దళిత వర్గాల కోసం ఈ కార్యక్రమం తెచ్చాం. వాస్తవానికి ఈ పథకం పెట్టమని నాకు ఎవరూ దరఖాస్తు చేయలేదు. ఎవరూ డిమాండ్ చేయలేదు. తెలంగాణ తెచ్చిన వాడిగా, తెలంగాణ బిడ్డగా నేనే మేథోమథనం చేసి దీనికి రూపకల్పన చేశా. దీనిని నేనే స్వయంగా పర్యవేక్షిస్తా. తెలంగాణ దళితజాతి భారత దళిత జాతికే ఆదర్శంగా నిలిచేలా చేసి చూపిస్తా. చెప్పినవన్నీ చేసి చూపిస్తున్నాం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఊరికీ నీళ్లు ఇస్తామని చెప్పాం. 57 ఏళ్లకు పెన్షన్ ఇస్తామన్నాం. రేషన్ కార్డులు, 24 గంటల కరెంటు ఇస్తామని కూడా చెప్పాం. ఏయే మాటలు చెప్పామో అవన్నీ ఆచరించి చూపిస్తున్నాం. గతంలోనూ తెలంగాణ తెస్తామంటే ఎవరూ నమ్మలేదు. అంతా ఇంట్లో పడుకున్నారు. సమైక్య పాలకులు సంచులు మోశారు. కానీ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, నేను చావు అంచులవరకు వెళ్లి తెలంగాణ తెచ్చి చూపించాం..’ అని కేసీఆర్ చెప్పారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గురించి సీఎం కేసీఆర్‌కు వివరిస్తున్న ఎమ్మెల్యే నోముల భగత్. పక్కన మంత్రి జగదీశ్‌రెడ్డి కృష్ణా నీళ్లలో ఇబ్బంది జరగొచ్చు ‘రాబోయే రోజుల్లో కృష్ణా నీళ్లలో ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే పాలేరు రిజర్వాయర్ నుంచి పెద్దదేవులపల్లి చెరువు వరకు అనుసంధానం చేసి గోదావరి నీటిని తీసుకువచ్చే సర్వే జరుగుతోంది. అది పూర్తయితే రాష్ట్రంలో నాగార్జునసాగర్ ఆయకట్టు సేఫ్‌గా (సురక్షితంగా) ఉంటుంది. గతంలో నీళ్లను మధ్యలో చంద్రబాబు ప్రభుత్వం ఆపేస్తే, నేనే వచ్చి 50 వేల మంది ఆయకట్టు రైతాంగంతో కలిసి సాగర్ కట్టపై దండోరా మోగించా. ఏది ఏమైనా కృష్ణా నుంచి మన వాటా తీసుకొని ఖచ్చితంగా సాగర్ ఆయకట్టులో రెండు పంటలు పండించుకునే ఏర్పాటు చేస్తాం. అన్ని జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు ఆస్పత్రుల అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. 7 మెడికల్ కళాశాలలను ఇటీవల మంజూరు చేశాం. అన్ని జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలన్న ఉద్దేశంతో ముందుకు సాగుతున్నాం..’ అని సీఎం తెలిపారు. సాగర్ ప్రజలు నా మాట నమ్మారు ‘సాగర్ నియోజకవర్గ ప్రజలు ఎంతో చైతన్యవంతులు. ప్రతిపక్షాల కుక్కిడి పురాణాలు, చెప్పుడు మాటలు వినిపించుకోలేదు. ఎమ్మెల్యేగా భగత్‌ను గెలిపించాలని కోరా. ప్రజలు నా మాట నమ్మి అద్భుతమైన తీర్పును, ఫలితాన్ని ఇచ్చారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికీ తీసిపోని విధంగా నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. ప్రజల దీవెన ఉన్నంత కాలం అదే పద్ధతిలో ముందుకుపోతాం. జానారెడ్డికి గుణపాఠం చెప్పారు రాష్ట్రం ఏర్పడిన మొదట్లో అసెంబ్లీలో చర్చ సందర్భంగా.. రెండేళ్లలో 24 గంటల కరెంటు ఇస్తానంటే ప్రతిపక్ష నేతగా ఉన్న జానారెడ్డి ఎగతాళి చేశారు. రెండేళ్లు కాదు 20 ఏళ్లయినా చేయలేరన్నారు. రెండేళ్లలో చేస్తే తాను గులాబీ కండువా కప్పుకొని టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తానన్నారు. మొన్నటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కండువా కప్పుకుని పోటీచేస్తే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. హాలియా పట్టణం ఉండాల్సినంత గొప్పగా లేదు. రోడ్లు, డ్రైనేజీలు సరిగ్గా లేవు. సాగర్ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేయాలన్న దానిపై మంత్రి, కలెక్టర్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులతో చర్చించి నిర్ణయిస్తారు. నేను హైదరాబాద్‌లో సమీక్షిస్తా. అవసరమైతే మరోసారి సాగర్‌కు వస్తా..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. జిల్లాలో అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ‘జిల్లాలో దాదాపు 15 ఎత్తిపోతల పథకాలను వచ్చే సంవత్సరంన్నర కాలంలో పూర్తి చేస్తా. నెల్లికల్లు లిఫ్ట్‌తో పాటు కుంకుడు చెట్టుతండా లిఫ్ట్ మంజూరు చేశాం. నెల్లికల్లు ద్వారా గరిష్ట స్థాయిలో ఆయకట్టుకు నీరిస్తాం. అలాగే గుర్రంపోడు తండా లిఫ్ట్‌ను సర్వే చేసి మంజూరు చేస్తాం. జిల్లాలో ఎత్తిపోతల పథకాలు ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో విద్యుత్తు అవసరాలు తీర్చేందుకు దేశంలోనే నంబర్ వన్ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ జిల్లాలో ఏర్పాటు చేస్తున్నాం. 4 వేల మెగావాట్ల విద్యుత్తు ప్లాంటు దామరచర్లలో రావడం జిల్లా ప్రజలకు గర్వకారణం. పోడు భూముల సమస్య పరిష్కారానికి సిద్ధం భగత్‌ను గెలిపిస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానని మాట ఇచ్చా. అందులో భాగంగానే ఇప్పుడు నియోజకవర్గానికి వచ్చా. ఎన్నికల సమయంలో పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చా. అందుకు మేము సిద్ధంగా ఉన్నాం. 2005 కటాఫ్ మేరకు సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతాం. నందికొండలో ఎన్ఎస్పీ క్వార్టర్లలో నివాసం ఉంటున్న వారికి, ఖాళీ స్థలాల్లో సొంతగా ఇళ్లు కట్టుకున్నవారికి రెగ్యులరైజేషన్ చేసి హక్కు పత్రాలు ఇస్తాం. నందికొండలో డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. హాలియాలో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తాం. రెడ్డి కళ్యాణ మండపానికి భూమిని కేటాయిస్తాం. బంజారా భవనం నిర్మిస్తాం..’ అని సీఎం హామీ ఇచ్చారు. నల్లగొండలో పెద్ద ఎత్తున హరితహారం చేపట్టాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి జి.జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు, శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీఎం ప్రసంగానికి అడ్డుతగిలిన మహిళ తిరుమలగిరి (నాగార్జునసాగర్): సమావేశంలో సీఎం ప్రసంగిస్తుండగా సమ్మక్క సారక్కల వన దేవతల పూజారి నాగపురి లక్ష్మీ అడ్డుతగిలారు. పెద్దవూర మండలం పొట్టిచెల్మ క్రాస్‌రోడ్డు సమ్మక్క సారక్క దేవస్థానం వద్ద తాము గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నామని తెలిపారు. అయితే అటవీ అధికారులు తమ గుడిసెలను కూల్చివేసి, కరెంట్ సరఫరా రాకుండా అడ్డుకుంటున్నారంటూ ముఖ్యమంత్రికి చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఆమెను స్టేజీ మీదకు తీసుకురావాలని సీఎం ఆదేశించినా.. పోలీసులు ఆమెను అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. అలాగే.. కుంకుడుచెట్టు తండాకు చెందిన ఓ గిరిజన రైతు కుంకుడుచెట్టు తండా లిప్టును ప్రారంభించాలని కోరారు. నిధులు మంజూరు చేశామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని కేసీఆర్ చెప్పారు. ఒక్కసారి చెప్పానంటే 100% అమలు కేసీఆర్ ఒక్కసారి చెప్పారంటే వంద శాతం దానిని అమలు చేసి తీరుతారని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నేను చెప్పిన పనులన్నీ జరిగాయి. అవి ప్రజల ముందున్నాయి. దళిత బంధు పథకాన్ని కూడా ఆరునూరైనా అమలు చేస్తాం. వచ్చే బడ్జెట్లో మరిన్ని నిధులు ఈ ఏడాది ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలకు వచ్చేలా బడ్జెట్లో పెట్టిన రూ.1,000 కోట్లకు మరో రూ.200 కోట్లు కలిపి అమలు చేస్తాం. వచ్చే బడ్జెట్లో అధిక నిధులను కేటాయించి ప్రతి ఏటా దశల వారీగా అమలు చేస్తాం. సాగర్ అభివృద్ధికి రూ.150 కోట్లు నాగార్జునసాగర్, హాలియా అభివృద్ధికి ఒక్కో దానికి రూ.15 కోట్ల చొప్పున ఇస్తున్నాం. వాటికి అదనంగా రూ.120 కోట్లు ఇస్తాం. మొత్తంగా రూ.150 కోట్లతో సాగర్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. కేంద్రానిది వ్యతిరేక వైఖరి.. ఆంధ్రా దాదాగిరీ కేంద్ర ప్రభుత్వం అవలంబించే తెలంగాణ వ్యతిరేక వైఖరి కావచ్చు. ఆంధ్రావాళ్లు చేస్తున్న దాదాగిరీ కావచ్చు. కృష్ణా నీళ్లపై వారు అక్రమ ప్రాజెక్టులు ఎలా కడుతున్నారో ప్రజలంతా చూస్తున్నారు. -
హాలియాలో సభ: నాగార్జున సాగర్‌పై సీఎం కేసీఆర్ వరాల జల్లు
సాక్షి, నల్గొండ: కోవిడ్ కారణంగా జిల్లా పర్యటన ఆలస్యమైందని సీఎం కే.చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) అన్నారు. సోమవారం ఆయన హలీయాలో పర్యటించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ, ఉపఎన్నికల్లో గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో చాలా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, హాలియాను అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. హాలియా, నందికొండ మున్సిపాలిటీలకు రూ.15 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య కేంద్రాలను, ఆస్పత్రులను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. నెల రోజుల్లో హక్కు పట్టాలు ఇస్తామన్నారు. గుర్రంపోడు లిఫ్ట్ సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించామని సీఎం కేసీఆర్ తెలిపారు. నందికొండ మున్సిపాలిటీలో ఇళ్లను రెగ్యులరైజ్ చేస్తామన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. హాలియాలో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘‘నాగార్జునసాగర్ నియోజకవర్గానికి అభివృద్ధి రుచి చూపిస్తాం. దేశానికే ఆదర్శంగా 24 గంటల విద్యుత్ ఇచ్చాం. జానారెడ్డి మాట తప్పి సాగర్‌లో పోటీ చేశారు. దళితబంధు పథకంపై ఎన్నో విమర్శలు చేస్తున్నారు. 12లక్షల దళిత కుటుంబాలకు పథకాన్ని అందిస్తాం. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల ఆర్ధిక సాయం తప్పకుండా చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో వంద కుటుంబాలకు ఈ ఏడాది దళితబంధు అమలు చేస్తాం. దళితబంధు పథకంతో విపక్షాలకు బీపీ మొదలైందని’’ సీఎం కేసీఆర్ అన్నారు. -
హాలియా చేరుకున్న సీఎం కేసీఆర్
సాక్షి, నల్గొండ: బేంగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు హాలియాకు చేరుకున్నారు. సీఎం రాకతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో సభాస్థలికి చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం పాల్గొంటారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధికి తాను ఇచ్చిన హామీల అమలును సీఎం సమీక్షించనున్నారు. ఉప ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ను గెలిపించాలని, ఆయన గెలిచాక వచ్చి అధికారులతో సమీక్షించి అభివృద్ధి పనులు చేపడతానని హామీ ఇచ్చారు. ఫిబ్రవరి 10వ తేదీన జరిగిన సభలో సీఎం ఇచ్చిన హామీల అమలుకు ఇప్పటికే కొన్నింటికి నిధులు మంజూరు చేశారు. వాటిని సమీక్షించడంతోపాటు చేపట్టాల్సిన మిగతా అభివృద్ధి కార్యక్రమాలపై కార్యాచరణ ప్రకటించనున్నారు. సీఎం కేసీఆరే స్వయంగా హాలియాలో నియోజకవర్గ ప్రగతి సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలో పెద్ద సంఖ్యలో పోలీస్ బలగాలు మోహరించాయి. నలుగురు ఐపీఎస్ అధికారులు, ఎనిమిది మంది అడిషనల్ ఎస్పీలు, 12 మంది డీఎస్పీలు, 75 మంది సీఐలు, 300 మంది ఎస్ఐలు, 1,680 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఎస్పీ రంగనాథ్ బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. -
హామీల అమలుపైనే..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని హాలియా పట్టణానికి రానున్నారు. ఉదయం 10 గంటలకు ప్రగతిభవన్ నుంచి బయలుదేరనున్న ఆయన హెలికాప్టర్లో 10:40 గంటలకు హాలియా చేరుకుంటారు స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో జరగనున్న సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు. నియోజకవర్గ అభివృద్ధి, సాగర్ ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పురోగతే ప్రధాన ఎజెండాగా ఈ సమీక్ష జరగనుంది. స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్ నివాసంలో భోజనానంతరం మధ్యాహ్నం 2.10 గంటల సమయంలో తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి మొత్తం మీద మూడున్నర గంటల పాటు హాలియాలో గడపనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎత్తిపోతల పథకాలపై ప్రధాన చర్చ సాగర్ ఉప ఎన్నికల సమయంలో తాను ఇచ్చినnal హామీల అమలు, వాటి పురోగతితో పాటు ఇంకా ప్రారంభించాల్సిన పనులకు సంబంధించిన కార్యాచరణపై జిల్లా యంత్రాంగానికి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా నియోజకవర్గంలో ఇప్పటికే శంకుస్థాపన చేసిన నెల్లికల్లు ఎత్తిపోతల పథకంతో పాటు ఉమ్మడి జిల్లాలోని మరో 15 ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పనులను కూడా ఆయన సమీక్షించనున్నారు. ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు ద్వారా పాలేరు రిజర్వాయర్ నుంచి గోదావరి నీటిని దిగువన ఉన్న త్రిపురారం మండలంలోని పెద్దదేవులపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు అనుసంధానం చేసే అంశంపైనా సీఎం సమీక్షిస్తారని తెలుస్తోంది. అలాగే ఉమ్మడి జిల్లాలోని గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్) కింద మంజూరు చేసిన రూ.199 కోట్లతో చేపట్టాల్సిన పనుల గురించి కూడా సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉందని జిల్లా అధికార వర్గాలు వెల్లడించాయి. -
రేపు హాలియాలో సీఎం కేసీఆర్ పర్యటన
సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లా హాలియాలో రేపు(సోమవారం) ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్ నుంచి బయల్దేరనున్న కేసీఆర్.. హెలికాప్టర్లో ఉదయం 10.40కి హాలియా చేరుకోనున్నారు. అక్కడ నుంచి ఉదయం 10.55కి సభాస్థలి వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌కు చేరుకుని మధ్యాహ్నం ఒంటిగంట వరకు సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.10కి ఎమ్మెల్యే భగత్ నివాసంలో భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి సీఎం కేసీఆర్ హైదరాబాద్ బయల్దేరనున్నారు. -
వీడిన యువకుడి హత్య కేసు మిస్టరీ
సాక్షి, హాలియా : హాలియా మున్సిపాలిటీ సమీపంలోని హజారుగూడెం స్టేజీ వద్ద ఇటీవల వెలుగు చూసిన యువకుడి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తన భార్యతో చనువుగా ఉంటున్నాడన్న అనుమానం పెంచుకున్న భర్త ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇందులో భాగస్వాములైన ఆరుగురు నిందితులను గురువారం హాలియా సీఐ కార్యాలయంలో మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వరరావు మీడియా ఎదుట ప్రవేశ పెట్టి కేసు వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం హాలియా గ్రామానికి చెందిన సిరసనగండ్ల రేవంత్‌కుమార్(22) ప్రతి రోజూ తెల్లవారు జామున స్కూటీపై అనుముల మండలంలోని హజారుగూడెం గ్రామానికి వెళ్లి పాలను సేకరించి హాలియా పట్టణంలో పలు హోటళ్లకు విక్రయిస్తూ జీవనం సాగిస్తుండేవాడు. హజారుగూడెం గ్రామంలోని పాల సేకరణకు వెళ్లిన సమయంలో అదే గ్రామానికి చెందిన జానపాటి హరికృష్ణ భార్యతో చనువు ఏర్పడింది. తన భార్యతో రేవంత్‌కుమార్ చనువుగా ఉండటంతో అనుమానం పెంచుకున్న హరికృష్ణ అతడి భార్యను నిలదీశాడు. దాంతో భార్యాభర్తల మధ్య ఘర్షణ ఏర్పడి ఆమె పుట్టింటికి వెళ్లింది. దాంతో రేవంత్‌కుమార్ వల్లనే తన సంసారం చెడిపోయిందని కక్ష పెంచుకున్న హరికృష్ణ అతడిని ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం.. రేవంత్‌కుమార్‌ను హత్య చేసే విషయంలో తన సోదరుడు రామాంజనేయులుతో చర్చించాడు హరికృష్ణ. కిరాయి అంతకులతో హత్య చేయించాలని నిర్ణయించుకొని ఇద్దరూ కలిసి నాగార్జునసాగర్‌లోని హిల్ కాలనీకి చెందిన చింతమల్ల కన్నయ్య, చింతమల్ల రాజేశ్‌తో లక్ష రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం చింతమల్ల రాజేష్ హిల్ కాలనీకి చెందిన దాసరి మహేష్‌తో తిరిగి ఒప్పందం చేసుకున్నాడు. రేవంత్‌కుమార్ ప్రతి రోజూ తెల్లవారు జామున హజారిగూడెం గ్రామానికి పాల సేకరణ కోసం వెళ్తున్న సమయంలో హరికృష్ణ, చింతమల్ల రాజేష్, దాసరి మహేష్, జానపాటి రామాంజనేయులుతో పాటు ఓ మైనర్ (17 సంవత్సరాలు) కలిసి జనవరి 24వ తేదీ, జనవరి 29వ, ఫిబ్రవరి 4వ తేదీల్లో మూడుసార్లు హజారిగూడెం స్టేజీ వద్ద రెక్కీ నిర్వహించారు. ఫిబ్రవరి 5వ తేదీ తెల్లవారుజామున అందరూ కలిసి హజారిగూడెం స్టేజీ వద్ద చెట్టు చాటున మాటు వేసి స్కూటీపై వచ్చిన రేవంత్‌కుమార్‌ను హజారిగూడెం స్టేజీ మూలమలుపు వద్ద రేవంత్‌కుమార్‌పై ఒక్కసారిగా దాడి చేశారు. రాడ్లు, కొడవలితో అతని ముఖం, తలపై విచక్షణా రహితంగా నరికి హత్య చేశారు. కేసు ఛేదించింది ఇలా.. హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలించారు. ఈనెల 13న తెల్ల వారుజామున మిర్యాలగూడ బైపాస్ వద్ద అనుమానంగా తిరుగుతున్న జానపాటి హరికృష్ణ, అ తని సోదరుడు జానపాటి రామాంజనేయులు ను పట్టుకుని విచారించగా నేరం చేసినట్లు ఒ ప్పుకున్నారు. రేవంత్‌కుమార్‌ను హత్య చేయడానికి సహకరించిన రాజేష్, మహేష్, కన్నయ్యతో పాటు మరో మైనర్‌ను పట్టుకున్నారు. నేరస్తుల వద్ద నుంచి రెండ్లు రాడ్లు, ఒక కొడవలి, ఐ దు సెల్ఫోన్లు, రెండు బైక్‌లు, రూ.22 వేల నగ దు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించి న హాలియా సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ వీర రాఘవులు, కానిస్టేబుళ్లు విజయ్, శేఖర్, రామారావు, హోంగార్డు శేఖర్‌ను డీఎస్పీ అభినందించారు. -
రెండో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టడంతో..
సాక్షి, తిరుమలగిరి(నాగార్జునసాగర్) : గిరిజన దంపతులు రెండో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టడంతో ఇతరులకు విక్రయించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం సుంకిశాలతండాలో శనివారం వెలుగులోకి వచ్చింది. తండాకు చెందిన రమావత్ బాలు, సునిత దంపతులకు మొదటి కాన్పులో ఆడబిడ్డ జన్మించింది. వారసుడి కోసం రెండో దఫా గర్భం దాల్చింది. అక్టోబర్ 17వ తేదీన హాలియాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో రెండో కాన్పులోనూ ఆడబిడ్డకు జన్మనివ్వడంతో పాపను తాము సాకలేమని ఇతరులకు అమ్మేశారు. కొన్ని రోజులనుంచి సునిత వద్ద పాప కని పించకపోవడంతో అంగన్వాడీ కార్యకర్తకు అనుమానం వచ్చి డిసెంబర్ 27న సూపర్వైజర్ నాగమణికి సమాచారం చేరవేసింది. నాగమణి తండా కు చేరుకొని ఆరా తీయగా పసికందును అమ్మిన ట్లు తెలిసింది. అమ్మిన పసికందును ఐదు రోజు ల్లో తీసుకురావాలని, లేని పక్షంలో కేసు నమోదు చేస్తామని హెచ్చరించింది. అయినా శిశువు తల్లి ఒడికి చేరకపోవడంతో శనివారం నాగమణి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బాలు, సునిత దంపతులపై ఫిర్యా దు చేసింది. ఏఎస్ఐ, సూపర్ వైజర్ తండాకు చేరుకున్నారు. బాలు సునిత దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పాప ఎక్కడున్నా మరో ఐదు రోజుల్లో తండాకు తీసుకురావాలని, లేనిపక్షంలో కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. పాపను సాకే ఆర్థిక స్థోమత, ఇష్టం లేకపోతే ఆరు నెలల వరకు సాకి తరువాత శిశుగృహకు అప్పగించవచ్చని తెలిపారు. అవగాహన కల్పించినా.. మారని తీరు ప్రభుత్వ పథకాలపై అధికారులు తండాల్లో అవగాహన కల్పిస్తున్నా అది మూణ్నాళ్లముచ్చటగానే మిగిలిపోతోంది. గడిచిన రెండేళ్ల కాలంలో 13మంది దంపతులు ఆడపిలల్లను వదిలించుకున్న ఘటనలే దీనికి నిదర్శనం.గిరిజనులకు ఆడపిల్ల భారం కాకుడదనే ఉద్దేశంతో ప్రభుత్వం నూతనంగా గిరిపుత్రిక పేరుతో గిరిజన బాలికలకు రూ. లక్ష డిపాజిట్ చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం బాలికల సంక్షేమానికి సుకన్యయోజన, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల చదువుతో పాటు సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం అందిస్తుందని అవగాహన కల్పించినా గిరిజనుల్లో మార్పు రాకపోవడం గమనార్హం. -
విద్యాశాఖ కార్యాలయ పరిశీలన
హాలియా : మండలాల పునర్విభజనలో భాగంగా జిల్లాలో ఏర్పాటు చేస్తున్న కార్యాయాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ ప్రత్యేక అవసరాల అధికారి రవినాయక్ అన్నారు. ఆదివారం మండలంలోని తిర్మలగిరిలో ఏర్పాటు చేసిన విద్యాశాఖ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. నూతన మండలంలో కార్యకలాపాలు నిబంధనల మేరకే జరుగుతాయని, తాత్కాలిక అధికారులను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఆయన వెంట అకడమిక్ మానటరింగ్ అ«ధికారి శ్రీనివాస్‌గౌడ్, మండల విద్యాధికారి తరి రాము తదితరులు ఉన్నారు. -
ప్రపంచ దేశాల్లో బతుకమ్మకు గుర్తింపు
హాలియా: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నెలవైన బతుకమ్మకు నేడు ప్రపంచ దేశాల్లో గుర్తింపు లభించిందని టీఆర్ఎస్ నియాజకవర్గ ఇన్చార్జ్ నోముల నర్సింహ్మయ్య అన్నారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా శనివారం హాలియా రామాలయంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జాగృతి అధ్యక్షురాలు కవిత నేడు బతుకమ్మను పలు దేశాల్లో నిర్వహించడమే కాకుండా బతుకమ్మకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తుందని కొనియాడారు. బతుకమ్మకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ గుర్తింపు రావడం హర్షణీయమన్నారు. అనంతరం పలువురు విజేతలకు బహుమతులు అందజేశారు. అంతకుముందు ఆడపడుచులు బతుకమ్మలతో రామాలయానికి చేరుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు ఎం.సి కోటిరెడ్డి, మండలాధ్యక్షుడు ఎక్కలూరి శ్రీనివాసరెడ్డి, అల్లి పెద్దిరాజు, ఆలయ కమిటీ ఛైర్మన్ కాకునూరి నారాయణ, జాగృతి నియోజకవర్గ కన్వీనర్ జానపాటి నాగరాజు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంపటి శ్రీనివాస్, ఉపసర్పంచ్ పాంపాటి శ్రీనివాస్ మండలాధ్యక్షుడు రవినాయక్, తిరుమలయ్య, లలిత, కల్యాణి నాయకులు వర్రా వెంకట్‌రెడ్డి, కోనాల శివయ్య, సురభి రాంబాబు, పోషం శ్రీనివాస్‌గౌడ్, ఎన్నమల్ల సత్యం, అంజియాదవ్, గుర్రం సత్యనారాయణరెడ్డి, యడవల్లి రాములు, కంచుకొమ్ముల నర్సింహ, మధుచారి పాల్గొన్నారు. -
బావిలో పడి పదేళ్ల చిన్నారి మృతి
హాలియా : తాగునీరు తెచ్చుకునేందుకు వెళ్లిన చిన్నారి బావిలో పడి మృతి చెందిన సంఘటన బుధవారం మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మండలంలోని రంగుండ్ల గ్రామానికి చెందిన ఆంగోతు హరి రెండో కుమార్తె రోజా(10) బుధవారం తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ పొలానికి వెళ్లింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో దప్పిక అవుతుందని బాటిల్ తీసుకుని పక్కనే ఉన్న బావి వద్దకు వెళ్లింది. బావిలో దిగి నీళ్లు తీసుకొచ్చే క్రమంలో కాలు జారి బావిలో పడిపోయిది. వెంటనే తల్లిదండ్రులు పరుగెత్తిళ్లిన వారికి ఈత రాకపోవడంతో పరిసర ప్రాంతాల రైతులు వచ్చే సరికి ఆ చిన్నారి నీళ్లు తాగి మృతి చెందింది. హరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. -
తిర్మలగిరిలో సినిమా షూటింగ్
హాలియా: హనుమాన్ బ్యానర్‌పై నిర్మిస్తున్న సినిమా షూటింగ్ శనివారం మండలంలోని తిర్మలగిరి, ఎల్లాపురం రాజవరం మేజర్ ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో, హీరోయిన్లపై పలు సన్నివేశాలను చిత్రీకరించారు. అనంతరం దర్శకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ పూర్తి స్థాయి గ్రామీణ వాతావరణంలో సినిమాను నిర్మిస్తున్నామని, మరో వారం రోజుల్లో షూటింగ్ పూర్తవుతుందన్నారు. ఇందులో హీరోగా హర్షవర్థన్‌రెడ్డి, హీరోయిన్లుగా రోహిణీ, దివ్యలు, కోడైరక్టర్గా నరేష్, కెమెరామెన్‌గా తౌర్యాలు వ్యవహరిస్తున్నారని తెలిపారు. సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదని దర్శకుడు తెలిపారు. -
దసరా నుంచే నూతన మండలాల పరిపాలన
హాలియా : వచ్చే దసరా నుంచే నూతన మండలాల పరిపాలనా కార్యక్రమాలు ప్రారంభం కానున్నట్లు మిర్యాలగూడ ఆర్డీఓ కిషన్రావ్ అన్నారు. శుక్రవారం తిర్మలగిరిలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాల విభజనలో భాగంగా తిర్మలగిరి గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయడం ద్వారా పరిపాలనా సౌలభ్యం కలుగుతుందని ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతాయని పేర్కొన్నారు. కొత్త మండలంలో ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన వెంట తహసీల్దార్ వేణుమాధవరావు, కార్యదర్శులు నాగిరెడ్డి, సత్యనారాయణ, స్థానిక సర్పంచ్ పిడిగం నాగయ్య ఉన్నారు. -
అప్పుల బాధ తాళలేక కౌలురైతు ఆత్మహత్య
హాలియా : అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండల పరిధిలోని అనుములవారిగూడెంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని అనుముల వారిగూడెం గ్రామానికి చెందిన శీలం వెంకటయ్య(55) కొన్ని సంవత్సరాలుగా ఐదు ఎకరాల వ్యవసాయ భూమి కౌలుకు తీసుకుని చేస్తున్నాడు. కాగా ప్రస్తుత ఖరీఫ్‌లో ఐదు ఎకరాలు పత్తి సాగు చేయగా వర్షాభావంతో ఎండిపోయింది. తనకున్న ఎకరం పొలం తన కూతురుకు వరకట్నం కింద ఇచ్చాడు. చేసిన సుమారు రూ.6లక్షల అప్పు తీరే మార్గం లేకపోవడంతో కలత చెంది ఆదివారం వ్యవసాయ పొలంలోనే పురుగుల మందును సేవించాడు. కాగా పొలంలో కొట్టుకుంటుండగా పక్క రైతు వచ్చి బంధువులకు సమాచారం అందించాడు. దీంతో వెంటనే సాగర్ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నల్లగొండకు తరలించారు. చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసికుని దర్యాప్తు చేస్తున్నట్లు హాలియా ఎస్ఐ వెంకట్ తెలిపారు. మృతునికి భార్య, ఒక్కతే కూతురు ఉన్నారు. -
మాదిగల మహా పాదయాత్రను విజయవంతం చేయాలి
హాలియా : ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఈనెల 16 నుంచి 70 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న మాదిగల మహాపాద యాత్రను విజయవంతం చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (టీఎస్) రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు యాతాకుల భాస్కర్‌మాదిగ కోరారు. శనివారం హాలియాలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాపాద యాత్ర కొలనుపాక జాంభవంతుడి ఆలయం నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. చేతి వృత్తులు, చెప్పులు కుట్టే, డప్పు కొట్టే వారికి నెలకు రూ.2 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అధికార ప్రతినిధి బాకి యాదయ్య, జిల్లా ఇన్చార్జి చింతబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకమర్రి గణేష్, అనిల్‌కుమార్, తులసీదాస్, దైద రవి, పెరుమాళ్ల కుమారి, లింగాల పెద్దన్న, బొంగరాల Ðð ంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు తక్కెళ్లపల్లి శ్రీను, పోలె చక్రవర్తి, మారుపాక నరేందర్, మాతంగి దేవయ్య, బొజ్జ భిక్షం, జిల్లా విజయ్, విక్రం, యాదయ్య, రమణయ్య, దున్న శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల క్రీడలు ప్రారంభం
హాలియా : క్రీడలనే మానసికోల్లాసం కలుగుతుందని జిల్లా విద్యా«ధికారి చంద్రమోహన్ అన్నారు. ఈ నెల 5న గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హాలియా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్వహించిన క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిత్యం విద్యార్థుల చదువుల పట్ల శ్రద్ధ తీసుకునే ఉపాధ్యాయులు ఇలాంటి సందర్భాల్లో క్రీడల ద్వారా ఉల్లాసంతో పాటు ఇతర ఉపాధ్యాయులతో కలిసే అవకాశం వుంటుందన్నారు. క్రీడల పట్ల బాలికలు శ్రద్ధ వహించే విధంగా వ్యాయామ ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాల న్నారు. మండలాల విభజన జరిగే ప్రాంతాల్లో ఉపాధ్యాయులు తమ సర్వీస్ పుస్తకాలను సంబంధిత మండల విద్యాధికారులకు అప్పగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అల్లి నాగమణిపెద్దిరాజు, ఎంఈఓ తరి రాము, ఉపాధ్యాయ సంఘాల నాయకులు గుండా కృష్ణమూర్తి, పెరుమాళ్ల వెంకటేశం, నెమలి వెంకట్‌రెడ్డి, నరేష్ ఫౌండేషన్ చైర్మన్ గొట్టిముక్కల నరేష్, చంద్రుడునాయక్, రాపోలు పరమేష్ పాల్గొన్నారు. -
విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ
హాలియా : మండలంలోని ఎల్లాపురం ప్రాథమిక పాఠశాల అభివృద్ధి కోసం సోమవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో దాతల పలు వస్తువులను అందజేశారు. పాఠశాలకు రూ.4500 ల విలువ గల బీరువాను సర్పంచ్ కె.లలిత, రూ.2300ల విలువ గల టేబుల్‌ను ఎంపీటీసీ గుండెబోయిన కాశమ్మ, రూ.1500ల విలువ గల ప్లేట్లు రావులపాటి సైదులు, రూ.1200 ల విలువ గల ఛైర్‌ను మారెపాక జానీ, రూ.1000ల విలువ గల వాటర్ ప్యూరిఫైర్‌ను రావులపాటి రాజు, రూ500ల విలువ గల పలకలు గుర్నాథంలు అందజేశారు. అనంతరం మండల విద్యాధికారి తరి రాము మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం దాతలు సహకరించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు రవికుమార్, గుండెబోయిన అంజి యాదవ్ ప్రధానోపాధ్యాయులు బాణావత్ వెంకన్న, పరశురామ్, నెమలి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. -
వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
హాలియా : పేదలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ నోముల నర్సింహ్మయ్య అన్నారు. యోగ బ్రహ్మ శ్రీరుషి ప్రభాకర్ గురూజీ జయంతి సందర్భంగా ఎస్ఎస్వై ధ్యాన మండలి ఆధ్వర్యంలో గురువారం హాలియాలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యోగ చేయడం ద్వారా మనిషి శారీరక రుగ్మతలు దూరమవుతాయన్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్ఐ వెంకట్, సైదులు, లింగారెడ్డి, రవికుమార్, విజయేందర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ముత్యాలు, లింగారెడ్డి, యాదగిరి, సక్రునాయక్, రాఘవేంద్ర, శంకర్, మాల్యాద్రి, శంకరయ్య, శేఖర్, శివయ్య, సామ్యేల్, బ్రహ్మానందరెడ్డి, రాంబాబు, లక్ష్మయ్య, బాలరాజు, శ్రీనివాస్, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. -
బీఎస్ఎన్ఎల్ మెగా రోడ్‌షో
హాలియా : బీఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో బుధవారం హాలియాలో మెగా రోడ్‌షోను జిల్లా టెలికాం బోర్డు సభ్యులు చెన్ను వెంకటనారాయణరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మనదేశం–మన బీఎస్ఎన్ఎల్ అనే నినాదంతో ఫ్రీ సిమ్ ఆఫర్‌తో పాటు రూ.49లకే ల్యాండ్‌లైన్ కనెక్షన్, 2ఎంబీపీఎస్ ఇంటర్నెట్ రూ.479లకే అందిస్తుందని తెలిపారు. భారత ప్రభుత్వ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో జెఈ సంతోష్, జñ టీఓ కిరణ్, లైన్మెన్స్ శబి, నారాయణ, గురువయ్య, వెంకటేశ్, నర్సింహ, వీరయ్య పాల్గొన్నారు. -
108 సేవలు అమోఘం
హాలియా : ఆపదలో ఉన్న వారిని ఆసుపత్రులకు తీసుకెళ్లి వారి ప్రాణాలను కాపాడుతున్న అపరసంజీవని (108అంబులెన్స్ వాహనం) కృష్ణాపుష్కర భక్తులకు అందించిన సేవలు అమోఘమనే చెప్పవచ్చు. భక్తుల సౌకర్యార్థం నాగార్జునసాగర్ శివాలయం ఘాట్ వద్ద ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలానికి చెందిన 108 అంబులెన్స్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఈ 12 రోజులుగా ఈ వాహనం ద్వారా దాదాపు 200లకుపైగా భక్తులు సేవలందించారు. అత్యవసర చికిత్స నిమిత్తం సాగర్ కమలానెహ్రూ ఆసుపత్రితోపాటు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి భక్తుల ప్రాణాలు కాపాడి శభాష్ 108 అనిపించుకుంది. వాహనసిబ్బంది కూడా మానవతా దృక్పథంలో సేవలందించి ఆత్మసంతృప్తిని పొందుతున్నారు. పుష్కర భక్తులకు సేవలందించడం అదృష్టం– తుమ్మ జగదీశ్, 108 ఉద్యోగి, కొణిజెర్ల ఖమ్మం జిల్లా కృష్ణాపుష్కరాలకు వచ్చే భక్తులకు వైద్య సేవలందించడం అదృష్టంగా భావిస్తున్నా. 12ఏళ్లకు ఒకసారి వచ్చే పండుగ సందర్భంగా భక్తులకు సేవలు చేయడం ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంది. భక్తులతోపాటు ఉద్యోగులకు కూడా అత్యవసర సేవలు అందించాం. ఇదో మధుర జ్ఞాపకం – ఎం.వెంకటేశ్వర్రావు, 108 పైలట్ పుష్కరభక్తులకు సేవలందించడం ఓ మధుర జ్ఞాపకంలా మిగిలిపోతుంది. పన్నెండేళ్ల పండగను గుర్తుంచుకునేలా భక్తులకు సేవలందించే బాధ్యత అప్పగించడం సంతోషంగా ఉంది. ఖమ్మం జిల్లా నుంచి ఇక్కడకు వచ్చి సేవలందించడం మహాభాగ్యమే. -
అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
హాలియా : అత్తింటివారి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని వీరబ్రహ్మేంద్రనగర్లో నివాసముంటున్న చినపాత రాజు భార్య చినపాత గీత(19) అత్తింటి వేధింపులకు గురై ఉదయం 9గంటల సమయంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. డిండి మండలం బొగ్గులదోన గ్రామానికి చెందిన మొప్పళ్ల వెంకటయ్య కూతురు గీతను 2015 జనవరిలో హాలియాకు చెందిన రాజుకు ఇచ్చి వివాహం చేశారు. కాగా కొన్ని నెలలుగా భర్త అనుమానంతో వేధించేవాడని అంతేకాకుండా అదనపు కట్నం కోసం అత్త, భర్త వేధింపులు చేసేవారు. ఇదే క్రమంలో బుధవారం గీత రాఖీ పండగ కోసం తమ తల్లిదండ్రులు ఉంటున్న హైదరాబాద్‌కు వెళ్తానని అడగగా వద్దని అత్త, భర్తలు వారించారు. దీంతో మనపస్తాపం చెందిన గీత గురువారం ఉదయం 9గంటల సమయంలో ఇంట్లో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి మొప్పళ్ల వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకట్ తెలిపారు. -
ఆదాయం నిల్
హాలియా : కృష్ణాపుష్కరాలతో ఆలయాల ఆదాయం పెరుగుతుందన్న ఆశతో ఎదురుచూసిన దేవాదాయ శాఖ అధికారులకు నిరాశే ఎదురైంది. నాగార్జునసాగర్ భక్తజన సందోహం కారణంగా ఆలయ అధికారులు ఎంతో ఆశించినప్పటికీ పోలీసుల ఆంక్షలతో ఆల యాలు బోసిబోయాయి. ప్రధానంగా శివాలయం ఘాట్ వద్ద ఉన్న శివాలయానికి వచ్చే భక్తులు కూడా ఒక్కరు లేకపోవడం గమనార్హం. వీఐపీలకు మాత్రమే దర్శనభాగ్యం కలగడంతో సాధారణ భక్తులకు దేవుని దర్శనం కావడం లేదు. ఆలయ ప్రధాన గేట్ వద్ద బారీ కేడ్లు ఏర్పాటు చేసి తాము రాకుండా చేశారని సాధారణ భక్తులు మండిపడితున్నారు. వీటితోపాటు పైలాన్‌కాలనీలో ఉన్న మార్కండేయస్వామి, హిల్‌కాలనీలోని ఏలేశ్వరస్వామి, సత్యనారాయణస్వామి ఆలయాలు బోసిబోతున్నాయి. వన్‌వే ట్రాఫిక్ కారణంగా ఆలయాలకు భక్తులు వెళ్లే అవకాశం లేదు. ఇప్పటికే ఆరు రోజులు గడిచింది. మరో ఆరు రోజులే ఉన్నాయి. ఇకనైనా పోలీసు అధికారులు సాధారణ భక్తులకు దేవుని దర్శన భాగ్యం కలిగించాలని భక్తులు, అర్చకులు కోరుకుంటున్నారు. సాధారణ భక్తులకు దర్శనభాగ్యం కల్పించాలి – సుధాకరశాస్త్రి శివాలయ అర్చకులు 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాల సందర్భంగా భక్తులు ప్రతిఒక్కరూ పుణ్యస్నాం అనంతరం దేవుని దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. పోలీసులు ఆంక్షల తొలగించి శివాలయంలో దర్శనభాగ్యం కల్పించాలి. మాకు కూడా పని దొరుకుతుంది. దేవుని దర్శనం పెద్దోళ్లక్కేనా..? – రామలింగయ్య నిడమనూరు భక్తుడు నదిలో స్నానం చేశాక మొదట శివుడిని దర్శించుకుంటే పాపాలు తొలుగుతాయి. కాని నదిపక్కన గుడి ఉన్నా దేవుని దర్శనం చేసుకోకుండా ఆపుతున్నారు. దేవున్ని పెద్దోళ్లే దర్శనం చేసుకోవాలా. మాలాంటి సాధారణ భక్తులు చేసుకోకూడదా..? -
సాగర్‌లో మంత్రుల ఘోరావ్
హాలియా : కృష్ణాపుష్కరాల సందర్భంగా నాగార్జునసాగర్‌లో మీడియా ప్రతినిధులపై పోలీసులు పెడుతున్న ఆంక్షలకు నిరసనగా మంగళవారం శివాలయం ఘాట్ వద్ద మీడియా ప్రతినిధులు రాష్ట్ర మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిల ఘఘోరావ్ చేశారు. ఈసందర్భంగా మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ తమపై పోలీసులు ఆంక్షలు విధించడమే కాకుండా గుర్తింపు పాస్‌లు ఉన్నప్పటికీ ప్రతి చెకింగ్ పాయింట్ వద్ద ఆపి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన మంత్రులు మీడియా ప్రతినిధులను అన్ని ఘాట్లకు అనుమతించాలని ఆదేశించారు. -
ప్రతిపక్షాల విమర్శలు సరికాదు
హాలియా : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణాల్లో డిజైన్ లోపం ఉందంటూ ప్రతిపక్షపార్టీలు నిర్వాసితులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నాయని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ నోముల నర్సింహయ్య ఆరోపించారు. శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బంగారు తెలంగాణ ఏర్పాటు దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ప్రాజెక్ట్‌ల నిర్మాణాల కోసం కృషి చేస్తుండగా ప్రతిపక్ష పార్టీలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. మల్లన్నసాగర్ ఆందోళనలో ఆంధ్రకుట్ర దాగివుందని సమైక్యవాదుల ముసుగులో ఆందోళనలు చేస్తున్నాయని నిర్వాసితులు నమ్మరని అన్నారు. సమావేశంలో ఎం.సీ కోటిరెడ్డి, మలిగిరెడ్డి లింగారెడ్డి, ఎంపీపీ అల్లి నాగమణి, మండలపార్టీ అధ్యక్షుడు ఎక్కలూరి శ్రీనివాసరెడ్డి, అల్లి పెద్దిరాజు, కూరాకుల వెంకటేశ్వర్లు, నల్లబోతు వెంకటయ్య, శేఖర్‌రాజు ఉన్నారు. -
అపరాల పంటలను ప్రోత్సహించాలి : యడవల్లి
హాలియా : నాగార్జునసాగర్ ఆయకట్టుతో పాటు నాన్‌ఆయకట్టు ప్రాంతాల్లో అపరాల సాగును ప్రోత్సహించడం ద్వారా రైతులను లాభాల బాటలో నడిపించవచ్చని మాజీ ఆప్కాబ్ చైర్మన్ యడవల్లి విజయేందర్‌రెడ్డి అన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో మండలంలోని ఆయకట్టు ప్రాంతంలో సుమారు 600 ఎకరాల్లో పీయూ31 రకం మినుము పంటను సాగు చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం వ్యవసాయాధికారులతో కలిసి పంటలను పరిశీలించారు. గత ఖరీఫ్‌లో ప్రయోగాత్మకంగా మండలంలో 20ఎకరాలు సాగు చేయగా ప్రస్తుతం 600 ఎకరాలు సాగు చేయడం గర్వనీయమన్నారు. పీయూ31 రకం చీడపీడలను తట్టుకోవడమే కాకుండా దిగుబడి కూడా అదనంగా పొందవచ్చని వ్యవసాశాఖ అధికారులు తెలిపారు. ఎల్లోమెజాయిక్ వైరస్‌ను తట్టుకుంటుందని అధికారులు పేర్కొన్నారు. దీని పంటకాలం 70రోజులేన న్నారు. కందిలో అంతర్పంటగా వేసుకోవచ్చన్నారు. ఆయనతో పాటు మండల వ్యవసాయాధికారి తిప్పన విజయేందర్‌రెడ్డి, చింతల చంద్రారెడ్డి, గిరిధర్‌రెడ్డి, మిట్టపల్లి వాసులు ఉన్నారు. -
ప్రధాన రహదారులకు మరమ్మతులు
హాలియా : ఈ నెల 12 నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్న సందర్భంగా ప్రధాన రహదారులకు ఆర్అండ్బీ అధికారులు మరమ్మతులు చేపట్టారు. హాలియా–నాగార్జునసాగర్, హాలియా–మిర్యాలగూడ ప్రధాన రహదారులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు నిర్వహిస్తున్నారు. ప్యాచ్ వర్కులకు బీటీని వేసి తాత్కాలికంగా ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే హాలియా–పెద్దవూర, అలీనగర్–మిర్యాలగూడ తదితర రహదారులకు బీటీ వేశారు. పుష్కరాలు ప్రారంభమైతే సంబంధిత రహదారులు ట్రాఫిక్‌మయంగా మారే అవకాశం ఉంటుంది. వీటితో పాటు తిర్మలగిరి, రంగుండ్ల, గాత్తండా, అల్వాల, చింతపల్లి తదితర రహదారులకు పనులు పూర్తిచేశారు. గాత్తండా నుంచి కుంకుడుచెట్టుతండా వరకు నూతనంగా బీటీ రహదారి పనులు పూర్తికావచ్చాయి. అల్వాల అడ్డరోడ్డు నుంచి తిర్మలగిరి వరకు బీటీ రహదారి పనులు టెండర్ ప్రక్రియ పూరై్తనప్పటికీ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రధాన రహదారులపై ఉన్న రోడ్బండ్ల నిర్మాణ పనులు మాత్రం నత్తనడకన నడుస్తున్నాయి. తాత్కాలిక పనులు పూర్తిచేస్తాం .. కాకునూరి వెంకటేశం, ఏఈ ఆర్అండ్బీ పుష్కరాల సందర్భంగా పలుచోట్ల దెబ్బతిన్న ప్రధాన రహదారులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నాం. ట్యాంక్బండ్ల నిర్మాణ పనులు కూడా సకాలంలో పూర్తిచేస్తాం. అల్వాల అడ్డరోడ్డు–తిర్మలగిరి ప్రధాన రహదారి పనులు టెండర్ ప్రక్రియ పూర్తి అయినప్పటికీ పనులు పుష్కరాల అనంతరం చేస్తాం. రహదారి వెంట గుంతలను పూడ్చివేయిస్తున్నాం. రాకపోకలకు ఎటువంటి అంతరాయం ఉండదు.