హరితహారం ప్రజలకు ఓవరం లాంటిది
హరితహారం ప్రజలకు ఓవరం లాంటిది
Published Sun, Jul 24 2016 8:58 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
హాలియా: హరితహారం తెలంగాణ ప్రజలకు ఓ వరం లాంటిదని ప్రజలందరూ ఐక్యమత్యంగా మొక్కలు నాటాలని టీఆర్‌ఎస్ నాగార్జునసాగర్ ఇన్‌చార్జ్ నోముల నర్సింహ్మయ్య అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఇబ్రాహింపేట పరిధిలోని సంతోష్‌నగర్‌లో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక హారితహారం కార్యక్రమని మొక్కలు నాటడంతో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని తద్వారా బంగారు తెలంగాణకు బాటలు వేసినట్లేనన్నారు. మొక్కలు నాటడంతో పాటు సంరక్షణ భాధ్యతపై అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కోరారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి సంరక్షణ చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఆప్కాబ్ ఛైర్మన్ యడవల్లి విజయేందర్‌రెడ్డి, ఎం.సి కోటిరెడ్డి, మలిగిరెడ్డి లింగారెడ్డి, యడవల్లి మహేందర్‌రెడ్డి, ఎక్కలూరి శ్రీనివాసరెడ్డి, కూరాకుల వెంకటేశ్వర్లు, చవ్వా బ్రహ్మానందరెడ్డి, నల్లబోతు వెంకటయ్య, చాపల సైదులు, రుద్రాక్షి మహేశ్, పోషం శ్రీనివాస్‌గౌడ్, ఎన్నమల్ల సత్యం, సురభి రాంబాబు, అబ్దుల్ హలీం పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement