ప్రపంచ దేశాల్లో బతుకమ్మకు గుర్తింపు
ప్రపంచ దేశాల్లో బతుకమ్మకు గుర్తింపు
Published Sat, Oct 8 2016 11:22 PM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM
హాలియా: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నెలవైన బతుకమ్మకు నేడు ప్రపంచ దేశాల్లో గుర్తింపు లభించిందని టీఆర్‌ఎస్ నియాజకవర్గ ఇన్‌చార్జ్ నోముల నర్సింహ్మయ్య అన్నారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా శనివారం హాలియా రామాలయంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జాగృతి అధ్యక్షురాలు కవిత నేడు బతుకమ్మను పలు దేశాల్లో నిర్వహించడమే కాకుండా బతుకమ్మకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తుందని కొనియాడారు. బతుకమ్మకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ గుర్తింపు రావడం హర్షణీయమన్నారు. అనంతరం పలువురు విజేతలకు బహుమతులు అందజేశారు. అంతకుముందు ఆడపడుచులు బతుకమ్మలతో రామాలయానికి చేరుకున్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు ఎం.సి కోటిరెడ్డి, మండలాధ్యక్షుడు ఎక్కలూరి శ్రీనివాసరెడ్డి, అల్లి పెద్దిరాజు, ఆలయ కమిటీ ఛైర్మన్ కాకునూరి నారాయణ, జాగృతి నియోజకవర్గ కన్వీనర్ జానపాటి నాగరాజు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంపటి శ్రీనివాస్, ఉపసర్పంచ్ పాంపాటి శ్రీనివాస్ మండలాధ్యక్షుడు రవినాయక్, తిరుమలయ్య, లలిత, కల్యాణి నాయకులు వర్రా వెంకట్‌రెడ్డి, కోనాల శివయ్య, సురభి రాంబాబు, పోషం శ్రీనివాస్‌గౌడ్, ఎన్నమల్ల సత్యం, అంజియాదవ్, గుర్రం సత్యనారాయణరెడ్డి, యడవల్లి రాములు, కంచుకొమ్ముల నర్సింహ, మధుచారి పాల్గొన్నారు.
Advertisement