ప్రతిపక్షాల విమర్శలు సరికాదు
ప్రతిపక్షాల విమర్శలు సరికాదు
Published Sat, Aug 6 2016 9:59 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM
హాలియా : టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణాల్లో డిజైన్ లోపం ఉందంటూ ప్రతిపక్షపార్టీలు నిర్వాసితులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నాయని టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నోముల నర్సింహయ్య ఆరోపించారు. శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బంగారు తెలంగాణ ఏర్పాటు దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ప్రాజెక్ట్‌ల నిర్మాణాల కోసం కృషి చేస్తుండగా ప్రతిపక్ష పార్టీలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. మల్లన్నసాగర్ ఆందోళనలో ఆంధ్రకుట్ర దాగివుందని సమైక్యవాదుల ముసుగులో ఆందోళనలు చేస్తున్నాయని నిర్వాసితులు నమ్మరని అన్నారు. సమావేశంలో ఎం.సీ కోటిరెడ్డి, మలిగిరెడ్డి లింగారెడ్డి, ఎంపీపీ అల్లి నాగమణి, మండలపార్టీ అధ్యక్షుడు ఎక్కలూరి శ్రీనివాసరెడ్డి, అల్లి పెద్దిరాజు, కూరాకుల వెంకటేశ్వర్లు, నల్లబోతు వెంకటయ్య, శేఖర్‌రాజు ఉన్నారు.
Advertisement
Advertisement