nomula
-
ప్రమాద భాదిత కుటుంబాలను ఆదుకుంటాం
గుర్రంపోడు : కాల్వపల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాధితుల కుటుంబాలను ఆదుకుంటామని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి నోముల నర్సింహయ్య అన్నారు. గురువారం ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం గుర్రంపోడులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రవాణ శాఖా మంత్రితో మాట్లాడి ప్రభుత్వ పరంగా అందాల్సిన సాయం అందిస్తామని అన్నారు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్‌తో మాట్లాడానని మృతులకు రెండు లక్షల చొప్పున పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ప్రమాద మృతులకు ఐదు లక్షలు, గాయపడిన వారికి రెండు లక్షల పరిహారం అందించాలని కోరుతానని అన్నారు. క్షతగాత్రులకు ఆరోగ్య శ్రీ పథకం కింద మెరుగైన వైద్యం అందిస్తామని అన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ గాలి రవికుమార్, నాయకులు బ్రహ్మచారి, మండలి లింగయ్య, రావుల సైదులు, నర్సింహరావు, యాదగిరిరెడ్డి, కిరణ్, ఉమర్, దాసరి యాదయ్యలు పాల్గొన్నారు. -
వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
హాలియా : పేదలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ నోముల నర్సింహ్మయ్య అన్నారు. యోగ బ్రహ్మ శ్రీరుషి ప్రభాకర్ గురూజీ జయంతి సందర్భంగా ఎస్ఎస్వై ధ్యాన మండలి ఆధ్వర్యంలో గురువారం హాలియాలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యోగ చేయడం ద్వారా మనిషి శారీరక రుగ్మతలు దూరమవుతాయన్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్ఐ వెంకట్, సైదులు, లింగారెడ్డి, రవికుమార్, విజయేందర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ముత్యాలు, లింగారెడ్డి, యాదగిరి, సక్రునాయక్, రాఘవేంద్ర, శంకర్, మాల్యాద్రి, శంకరయ్య, శేఖర్, శివయ్య, సామ్యేల్, బ్రహ్మానందరెడ్డి, రాంబాబు, లక్ష్మయ్య, బాలరాజు, శ్రీనివాస్, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. -
ప్రతిపక్షాల విమర్శలు సరికాదు
హాలియా : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణాల్లో డిజైన్ లోపం ఉందంటూ ప్రతిపక్షపార్టీలు నిర్వాసితులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నాయని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ నోముల నర్సింహయ్య ఆరోపించారు. శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బంగారు తెలంగాణ ఏర్పాటు దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ప్రాజెక్ట్‌ల నిర్మాణాల కోసం కృషి చేస్తుండగా ప్రతిపక్ష పార్టీలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. మల్లన్నసాగర్ ఆందోళనలో ఆంధ్రకుట్ర దాగివుందని సమైక్యవాదుల ముసుగులో ఆందోళనలు చేస్తున్నాయని నిర్వాసితులు నమ్మరని అన్నారు. సమావేశంలో ఎం.సీ కోటిరెడ్డి, మలిగిరెడ్డి లింగారెడ్డి, ఎంపీపీ అల్లి నాగమణి, మండలపార్టీ అధ్యక్షుడు ఎక్కలూరి శ్రీనివాసరెడ్డి, అల్లి పెద్దిరాజు, కూరాకుల వెంకటేశ్వర్లు, నల్లబోతు వెంకటయ్య, శేఖర్‌రాజు ఉన్నారు. -
వ్యభిచారం చేయమని తల్లి, భర్త ఒత్తిడి, సూసైడ్
వివాహిత బలవన్మరణం నాకు రూ. 20 లక్షలు ఇస్తేనే విడాకులిస్తా.. అంత డబ్బు ఇవ్వలేనంటే ఎట్లా.. అందంగానే ఉన్నావుగా.. ప్రస్తుతం మార్కెట్లో నీ లాంటి వారికి మంచి డిమాండ్ ఉంది.. దుకాణం పెడితే లక్షలు సంపాదించవచ్చు.. నేను చెప్పినట్టు వింటే సరేసరి..లేదంటే నిన్ను అమ్మేస్తా... లేకుంటే చంపేస్తా అని నా భర్త వేధిస్తున్నాడు. నా కన్నతల్లి కూడా అతడికే వత్తాసు.. అందుకే చనిపోతున్నా. నా భర్తపై చర్య తీసుకోండి. ఇవీ .. నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన ఝాన్సీరాణి తన భర్త విజేందర్రెడ్డిపై పోలీసు ఉన్నతాధికారులు, జడ్జి, మహిళా రక్షణ సెల్‌కు రిజిస్టర్ పోస్టులో పంపిన లేఖల్లో పేర్కొన్న అంశాలు. విడాకులివ్వాలని కోరితే నిరాకరణ ♦ అందుకు రూ. 20 లక్షలివ్వాలని డిమాండ్ ♦ అమ్మేస్తా లేదంటే చంపేస్తానని బెదిరింపు ♦ కన్నతల్లి కూడా భర్తకే వత్తాసు ♦ భరించలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నా.. ♦ పోలీస్ ఉన్నతాధికారులు, జడ్జి, ♦ మహిళా రక్షణ సెల్‌కు ఝాన్సీ లేఖలు కష్టమొస్తే కడుపున పెట్టుకుని చూసుకోవాల్సిన తల్లి ఓ వైపు.. కలకాలం కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భర్త ఇంకో వైపు డబ్బు కోసం నరక కూపంలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తుంటే తట్టుకోలేకపోయింది.. విడాకులిస్తే నా దారి నేను చూసుకుంటానని వేడుకున్నా కనికరించలేదు.. మృగాడి కబంధ హస్తాల కింద నలిగిపోయేకంటే చావే శరణ్యమనుకుందో.. ఏమో.. ఆ చిట్టితల్లి. తనకుతానే మరణశాసనం లిఖించుకుంది. నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన గూడూరు ఝాన్సీ ఆత్మహత్య విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాను చనిపోయే ముందు కారకులు, కారణాలను విశ్లేషిస్తూ తెలంగాణ డీజీపీ, ఎస్పీ, జడ్జి, మహిళా రక్షణ సెల్, నకిరేకల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు రిజిస్టర్ పోస్టులో పంపిన లేఖలు సోమవారం అందాయి. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. నకిరేకల్: ఆలస్యంగా వెలుగుచూసిన ఝాన్సీ ఆత్మహత్యపై రిజిస్టర్పోస్ట్లో అందిన సూసైడ్‌నోట్, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన గుర్రం పద్మ వెంకట్‌రెడ్డి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. పద్మ భర్త వెంకట్‌రెడ్డి 2013 లో చనిపోయారు. తల్లి పద్మ నకిరేకల్‌లోని మూసీరోడ్డులో ఇంట్లో అద్దెకు ఉంటూ కూలి పని చేస్తూ పిల్లలను పోషిస్తోంది. కుమార్తె ఝాన్సీ హైదరాబాద్‌లోని ఎంవీఎస్ఆర్ కళాశాలలో బీటెక్ చదువుతుండగా కుమారుడు శివ లారీడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆర్థిక స్థితిగతి బాగా లేకపోవడంతో పద్మ తన మేనల్లుడైన నల్లగొండ మండలం దీపకుంటకు చెందిన గూడూరు విజయేందర్‌రెడ్డి వద్ద రూ. 4 లక్షలు అప్పుగా తీసుకుంది. అప్పు కింద కూతురినివ్వు.. కొంత కాలానికి విజయేందర్‌రెడ్డి తన వద్ద తీసుకున్న అప్పు చెల్లించాలని పద్మపై ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. ఆ డబ్బు చెల్లించే స్థితిలో పద్మ కుటుంబం లేదు. అప్పు కింద కూతురు ఝాన్సీని తనకు ఇచ్చి వివాహం చేయాలని కోరాడు. అందుకు పద్మ సరేనంది. అతడి ప్రవర్తన సక్రమంగా లేదని ఝాన్ని తన తల్లి వద్ద మొరపెట్టుకున్నా వినిపించుకోలేదు. రెండు కుటుంబాల పెద్దలు 2014 ఆగ స్టు 22వ తేదీన విజయేందర్‌రెడ్డితో ఝాన్సీకి వివాహం జరిపిం చారు. వివాహం అనంతరం కూడా ఝాన్సి హైదరాబాద్‌లోని హాస్టల్లో ఉంటూ బిటెక్ చదువుతోంది. ఇటీవల ఫైనల్ ఇయర్ కూడా పూర్తి చేసింది. అది చూసి జీర్ణించుకోలేక పోయా.. తన భర్తతో కలిసి జీవించడం ఇష్టం లేదని ఎన్నో సార్లు తన తల్లికి చెప్పినా వినిపించుకోలేదు. అతడితోటే ఉండాలని పట్టుబట్టింది. తన తల్లి, భర్త ప్రవర్తన సక్రమంగా లేదని గుర్తించా.. ఓ రోజు వారిద్దరినీ పడకగదిలో చూసి జీర్నించుకోలేకపోయా. అప్పుడే నిర్ణయించుకున్నా ఇక భర్తతో కలిసి జీవించొద్దని. గుట్టుచప్పుడు కాకుండా.. ఈనెల 23వ తేదీన ఝాన్సీ హైదరాబాద్ నుంచి నకిరేకల్‌కు వచ్చింది. ఇంటికి వచ్చిన మరుసటి రోజు నివాసంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని పద్మ తన అల్లుడు విజయేందర్‌రెడ్డికి తెలపడంతో ఎలాంటి కేసు కూడా పెట్టకుండా వారు వచ్చి వారి స్వగ్రామమైన నల్లగొండ మండలం దీపకుంటకు తీసుకెళ్లి గుట్టు చప్పుడు కాకుండా దహన సంస్కారాలు నిర్వహించారు. కలకలం సృష్టించిన రిజిస్టర్ పోస్ట్ నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌కు సోమవారం వచ్చిన రిజిస్టర్ పోస్ట్ కలకలం సృష్టించింది. ఈ లేఖ ఆధారంగా నకిరేకల్ సీఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ నర్సింహారావు నేతృత్వంలో విచారణ చేపట్టారు. సదరు ఝాన్సీ తల్లిని, భర్త విజయేందర్‌రెడ్డిని విచారించారు. ఝాన్సీ ఆత్మహత్యకు ప్రేరేపించిన తల్లి పద్మ, భర్త విజయేందర్రెడ్డిలపై, సాక్ష్యాలు లేకుండా శవాన్ని దహనం చేసిన విషయంపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఝాన్సీ చదువుతున్న కళాశాలకు వెళ్లి కూడా విచారణ చేపడతామని, ఆమె వాడిన సెల్ డాటా వివరాలను కూడా సేకరిస్తామని, ఆమె దహనం చేసిన అస్తికలను కూడా సేకరించి ల్యాబ్‌కు పంపించి కేసును ఛేదిస్తామని పేర్కొన్నారు. అయితే ఈ లేఖ ఝాన్సీనే పంపించిందా అన్న కోణంలో కూడా విచారణ జరుపుతామన్నారు. వ్యభిచార కూపంలోకి నెట్టేస్తానంటే.. తనకు విడాకులు కావాలని భర్తను అడిగా. అందుకు రూ. 20 లక్షలు డిమాండ్ చేశాడు. అంత డబ్బు ఇచ్చే స్థితిలో లేనంటే వ్యభిచారం చేస్తే రూ. లక్షలు సంపాదించవచ్చని చెప్పాడు. చెప్పినట్టు వినాలని.. బతికి ఉండే వరకు వ్యభిచారం చేసి డబ్బు సంపాదించాలని ఆదేశించాడు. అమ్మేస్తా లేదా చంపేస్తానని బెదిరించాడు. ఇదే విషయం తల్లితో చెబితో భర్త చెప్పినట్టు నడుచుకోవాలని అతడికే వత్తాసు పలికిందని లేఖలో పేర్కొంది. నాకు సంబంధం లేదు నా కూతురు ఝాన్సీ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసిన లేఖని అంశాలపై నాకు ఏలాంటి సంబంధం లేదు. ఆమె ఆత్మహత్య చేసుకునేందుకు ఎవ్వరు ప్రేరేపించలేదు. బిటెక్ చదివేందుకు ఖర్చు కూడా నా అల్లుడు భరించాడు. ఈనెల 23న పరీక్షలు పూర్తి అయిన అనంతరం ఇంటికి చేరుకుంది. 24న సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు మాకు తెలపలేదు. నా కూతురు మృతి విషయాన్ని నల్లగొండ మండలం దీపకుంటలో ఉంటున్న నా అల్లుడు విజయేందర్‌రెడ్డికి సమాచారం ఇవ్వడంతో వారు మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఈ కేసు విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. - తల్లి పద్మ మా ఇద్దరి మధ్య గొడవలు లేవు పెళ్లై రెండు సంవత్సరాలు అయ్యింది. మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. పైళ్లి అయిన నాటి నుంచి ఆమె హాస్టల్లోనే ఉంటూ చదువుతోంది. చదువు ఖర్చులు కూడా నేనే భరించా. మా మద్య ఏలాంటి విభేదాలు లేవు. ఆమె ఆత్మహత్యకు నాకు సంబందం లేదు. ఆమె రాసిన లేఖలో కూడా అంశాలు వాస్తవం కాదు. - ఝాన్సీ భర్త గూడూరు విజేందర్‌రెడ్డి