ప్రమాద భాదిత కుటుంబాలను ఆదుకుంటాం
ప్రమాద భాదిత కుటుంబాలను ఆదుకుంటాం
Published Thu, Sep 29 2016 10:45 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM
గుర్రంపోడు : కాల్వపల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాధితుల కుటుంబాలను ఆదుకుంటామని టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి నోముల నర్సింహయ్య అన్నారు. గురువారం ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన అనంతరం గుర్రంపోడులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రవాణ శాఖా మంత్రితో మాట్లాడి ప్రభుత్వ పరంగా అందాల్సిన సాయం అందిస్తామని అన్నారు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్‌తో మాట్లాడానని మృతులకు రెండు లక్షల చొప్పున పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ప్రమాద మృతులకు ఐదు లక్షలు, గాయపడిన వారికి రెండు లక్షల పరిహారం అందించాలని కోరుతానని అన్నారు. క్షతగాత్రులకు ఆరోగ్య శ్రీ పథకం కింద మెరుగైన వైద్యం అందిస్తామని అన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ గాలి రవికుమార్, నాయకులు బ్రహ్మచారి, మండలి లింగయ్య, రావుల సైదులు, నర్సింహరావు, యాదగిరిరెడ్డి, కిరణ్, ఉమర్, దాసరి యాదయ్యలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement