కేసు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వెంకటేశ్వరరావు
సాక్షి, హాలియా : హాలియా మున్సిపాలిటీ సమీపంలోని హజారుగూడెం స్టేజీ వద్ద ఇటీవల వెలుగు చూసిన యువకుడి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. తన భార్యతో చనువుగా ఉంటున్నాడన్న అనుమానం పెంచుకున్న భర్త ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇందులో భాగస్వాములైన ఆరుగురు నిందితులను గురువారం హాలియా సీఐ కార్యాలయంలో మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వరరావు మీడియా ఎదుట ప్రవేశ పెట్టి కేసు వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం హాలియా గ్రామానికి చెందిన సిరసనగండ్ల రేవంత్‌కుమార్(22) ప్రతి రోజూ తెల్లవారు జామున స్కూటీపై అనుముల మండలంలోని హజారుగూడెం గ్రామానికి వెళ్లి పాలను సేకరించి హాలియా పట్టణంలో పలు హోటళ్లకు విక్రయిస్తూ జీవనం సాగిస్తుండేవాడు.
హజారుగూడెం గ్రామంలోని పాల సేకరణకు వెళ్లిన సమయంలో అదే గ్రామానికి చెందిన జానపాటి హరికృష్ణ భార్యతో చనువు ఏర్పడింది. తన భార్యతో రేవంత్‌కుమార్ చనువుగా ఉండటంతో అనుమానం పెంచుకున్న హరికృష్ణ అతడి భార్యను నిలదీశాడు. దాంతో భార్యాభర్తల మధ్య ఘర్షణ ఏర్పడి ఆమె పుట్టింటికి వెళ్లింది. దాంతో రేవంత్‌కుమార్ వల్లనే తన సంసారం చెడిపోయిందని కక్ష పెంచుకున్న హరికృష్ణ అతడిని ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.
పథకం ప్రకారం..
రేవంత్‌కుమార్‌ను హత్య చేసే విషయంలో తన సోదరుడు రామాంజనేయులుతో చర్చించాడు హరికృష్ణ. కిరాయి అంతకులతో హత్య చేయించాలని నిర్ణయించుకొని ఇద్దరూ కలిసి నాగార్జునసాగర్‌లోని హిల్ కాలనీకి చెందిన చింతమల్ల కన్నయ్య, చింతమల్ల రాజేశ్‌తో లక్ష రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం చింతమల్ల రాజేష్ హిల్ కాలనీకి చెందిన దాసరి మహేష్‌తో తిరిగి ఒప్పందం చేసుకున్నాడు.
రేవంత్‌కుమార్ ప్రతి రోజూ తెల్లవారు జామున హజారిగూడెం గ్రామానికి పాల సేకరణ కోసం వెళ్తున్న సమయంలో హరికృష్ణ, చింతమల్ల రాజేష్, దాసరి మహేష్, జానపాటి రామాంజనేయులుతో పాటు ఓ మైనర్ (17 సంవత్సరాలు) కలిసి జనవరి 24వ తేదీ, జనవరి 29వ, ఫిబ్రవరి 4వ తేదీల్లో మూడుసార్లు హజారిగూడెం స్టేజీ వద్ద రెక్కీ నిర్వహించారు. ఫిబ్రవరి 5వ తేదీ తెల్లవారుజామున అందరూ కలిసి హజారిగూడెం స్టేజీ వద్ద చెట్టు చాటున మాటు వేసి స్కూటీపై వచ్చిన రేవంత్‌కుమార్‌ను హజారిగూడెం స్టేజీ మూలమలుపు వద్ద రేవంత్‌కుమార్‌పై ఒక్కసారిగా దాడి చేశారు. రాడ్లు, కొడవలితో అతని ముఖం, తలపై విచక్షణా రహితంగా నరికి హత్య చేశారు.
కేసు ఛేదించింది ఇలా..
హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలించారు. ఈనెల 13న తెల్ల వారుజామున మిర్యాలగూడ బైపాస్ వద్ద అనుమానంగా తిరుగుతున్న జానపాటి హరికృష్ణ, అ తని సోదరుడు జానపాటి రామాంజనేయులు ను పట్టుకుని విచారించగా నేరం చేసినట్లు ఒ ప్పుకున్నారు. రేవంత్‌కుమార్‌ను హత్య చేయడానికి సహకరించిన రాజేష్, మహేష్, కన్నయ్యతో పాటు మరో మైనర్‌ను పట్టుకున్నారు. నేరస్తుల వద్ద నుంచి రెండ్లు రాడ్లు, ఒక కొడవలి, ఐ దు సెల్‌ఫోన్లు, రెండు బైక్‌లు, రూ.22 వేల నగ దు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించి న హాలియా సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ వీర రాఘవులు, కానిస్టేబుళ్లు విజయ్, శేఖర్, రామారావు, హోంగార్డు శేఖర్‌ను డీఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment