ఐక్యతతో రిజర్వేషన్లు సాధించుకోవాలి
హాలియా : మాదిగలు ఐక్యంగా ఉండి 12 శాతం రిజర్వేషన్లు సాధించుకోవాలని రాష్ట్ర మాదిగ యూత్ జేఏసీ చైర్మన్ పెరిక కరణ్ జయరాజ్ కోరారు.
హాలియా : మాదిగలు ఐక్యంగా ఉండి 12 శాతం రిజర్వేషన్లు సాధించుకోవాలని రాష్ట్ర మాదిగ యూత్ జేఏసీ చైర్మన్ పెరిక కరణ్ జయరాజ్ కోరారు. శనివారం హాలియాలో ఢిల్లీపై మాదిగల దండయాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదిగల దామాషా ప్రకారం 12శాతం రిజర్వేషన్‌లు సాధించుకోవడం మాదిగల హక్కు అన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆగస్టు 8న మహాధర్నా, 9న మహార్యాలీ, 10న మాదిగల సదస్సుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలు ఢిల్లీకి తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ చైర్మన్ దండెం కాశయ్య, మండల అధ్యక్షుడు తుడుం ముత్తయ్య, టీఆర్‌ఎస్ ఎస్సీసెల్ అధ్యక్షుడు దోరెపల్లి వెంకటేశ్వర్లు, పగిడిమర్రి రవి, యడవల్లి రాములు, గురజాల సైదులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.