Published
Sat, Sep 3 2016 9:26 PM
| Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
మాదిగల మహా పాదయాత్రను విజయవంతం చేయాలి
హాలియా : ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ ఈనెల 16 నుంచి 70 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న మాదిగల మహాపాద యాత్రను విజయవంతం చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (టీఎస్) రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు యాతాకుల భాస్కర్‌మాదిగ కోరారు. శనివారం హాలియాలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాపాద యాత్ర కొలనుపాక జాంభవంతుడి ఆలయం నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. చేతి వృత్తులు, చెప్పులు కుట్టే, డప్పు కొట్టే వారికి నెలకు రూ.2 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అధికార ప్రతినిధి బాకి యాదయ్య, జిల్లా ఇన్‌చార్జి చింతబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకమర్రి గణేష్, అనిల్‌కుమార్, తులసీదాస్, దైద రవి, పెరుమాళ్ల కుమారి, లింగాల పెద్దన్న, బొంగరాల Ðð ంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు తక్కెళ్లపల్లి శ్రీను, పోలె చక్రవర్తి, మారుపాక నరేందర్, మాతంగి దేవయ్య, బొజ్జ భిక్షం, జిల్లా విజయ్, విక్రం, యాదయ్య, రమణయ్య, దున్న శ్రీనివాస్ పాల్గొన్నారు.