ప్రధాన రహదారులకు మరమ్మతులు
ప్రధాన రహదారులకు మరమ్మతులు
Published Fri, Aug 5 2016 8:23 PM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM
హాలియా : ఈ నెల 12 నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్న సందర్భంగా ప్రధాన రహదారులకు ఆర్‌అండ్‌బీ అధికారులు మరమ్మతులు చేపట్టారు. హాలియా–నాగార్జునసాగర్, హాలియా–మిర్యాలగూడ ప్రధాన రహదారులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు నిర్వహిస్తున్నారు. ప్యాచ్ వర్కులకు బీటీని వేసి తాత్కాలికంగా ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే హాలియా–పెద్దవూర, అలీనగర్–మిర్యాలగూడ తదితర రహదారులకు బీటీ వేశారు. పుష్కరాలు ప్రారంభమైతే సంబంధిత రహదారులు ట్రాఫిక్‌మయంగా మారే అవకాశం ఉంటుంది. వీటితో పాటు తిర్మలగిరి, రంగుండ్ల, గాత్‌తండా, అల్వాల, చింతపల్లి తదితర రహదారులకు పనులు పూర్తిచేశారు. గాత్‌తండా నుంచి కుంకుడుచెట్టుతండా వరకు నూతనంగా బీటీ రహదారి పనులు పూర్తికావచ్చాయి. అల్వాల అడ్డరోడ్డు నుంచి తిర్మలగిరి వరకు బీటీ రహదారి పనులు టెండర్ ప్రక్రియ పూరై్తనప్పటికీ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రధాన రహదారులపై ఉన్న రోడ్‌బండ్‌ల నిర్మాణ పనులు మాత్రం నత్తనడకన నడుస్తున్నాయి.
తాత్కాలిక పనులు పూర్తిచేస్తాం .. కాకునూరి వెంకటేశం, ఏఈ ఆర్‌అండ్‌బీ
పుష్కరాల సందర్భంగా పలుచోట్ల దెబ్బతిన్న ప్రధాన రహదారులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నాం. ట్యాంక్‌బండ్‌ల నిర్మాణ పనులు కూడా సకాలంలో పూర్తిచేస్తాం. అల్వాల అడ్డరోడ్డు–తిర్మలగిరి ప్రధాన రహదారి పనులు టెండర్ ప్రక్రియ పూర్తి అయినప్పటికీ పనులు పుష్కరాల అనంతరం చేస్తాం. రహదారి వెంట గుంతలను పూడ్చివేయిస్తున్నాం. రాకపోకలకు ఎటువంటి అంతరాయం ఉండదు.
Advertisement