అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య | women suicide | Sakshi
Sakshi News home page

అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

Published Thu, Aug 18 2016 11:05 PM | Last Updated on Tue, Nov 6 2018 8:04 PM

అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య - Sakshi

అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

హాలియా : అత్తింటివారి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని వీరబ్రహ్మేంద్రనగర్‌లో నివాసముంటున్న చినపాత రాజు భార్య చినపాత గీత(19) అత్తింటి వేధింపులకు గురై ఉదయం 9గంటల సమయంలో కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. డిండి మండలం బొగ్గులదోన గ్రామానికి చెందిన మొప్పళ్ల వెంకటయ్య కూతురు గీతను 2015 జనవరిలో హాలియాకు చెందిన రాజుకు ఇచ్చి వివాహం చేశారు. కాగా  కొన్ని నెలలుగా భర్త అనుమానంతో వేధించేవాడని అంతేకాకుండా అదనపు కట్నం కోసం అత్త, భర్త వేధింపులు చేసేవారు. ఇదే క్రమంలో బుధవారం గీత రాఖీ పండగ కోసం తమ తల్లిదండ్రులు ఉంటున్న హైదరాబాద్‌కు వెళ్తానని అడగగా వద్దని అత్త, భర్తలు వారించారు. దీంతో మనపస్తాపం చెందిన గీత గురువారం ఉదయం 9గంటల సమయంలో ఇంట్లో కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి మొప్పళ్ల వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకట్‌ తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement