
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,పెందుర్తి( విశాఖపట్నం): వేపగుంట నాయుడుతోట సమీపంలోని దుర్గానగర్‌లో ఓ వివాహిత శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్‌ఐ శ్రీను తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గానగర్‌లో నివాసం ఉంటున్న కర్రి మహేశ్వరరావు దంపతుల కుమార్తె గొల్లవిల్లి స్వర్ణగౌరీ(25)కి అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాస్‌తో ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల బాబు ఉన్నాడు. ఆమె తల్లి ఐదు రోజుల కిందట మరణించడంతో.. స్వర్ణగౌరీ పుట్టింటికి వచ్చి ఇక్కడే ఉంది. అప్పటి నుంచి తీవ్ర మనస్తాపానికి గురైంది.
శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్వర్ణ గౌరీ ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. కుటుంబ సభ్యులు వచ్చి గమనించి చూడగా అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రాథమిక విచారణ చేశారు. తల్లి మరణం జీర్ణించుకోలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సీఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ శ్రీను కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: డబ్బు సంపాదించాలని.. ఆ నీలి చిత్రాలను ఉపయోగించుకుని..
Comments
Please login to add a commentAdd a comment