![Girl Ends Her Life Over Family Issues Visakhapatnam - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/30/sdfh.jpg.webp?itok=9-rhDgiI)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,పెందుర్తి(విశాఖపట్నం): తన కంటే సోదరిని తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నారని మనస్థాపం చెంది సుజాతనగర్ గోపాలకృష్ణనగర్‌కు చెందిన కె.జీవిత(18) సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాలనీలో నివాసం ఉంటున్న కె.రాంబాబు, రజని దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రాంబాబు ఆర్‌ఎంపీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి పెద్ద అమ్మాయి జీవిత డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుంది.
తన కంటే చెల్లిని బాగా చూసుకుంటున్నారన్న కారణంతో జీవిత.. తల్లితో నిత్యం గొడవ పడేది. ఈ క్రమంలో సాయంత్రం కూడా గొడవ పడి గదిలోకి వెళ్లిన జీవిత బయటకు ఎంతకీ రాకపోవడంతో బలవంతంగా తలుపులు తెరిచేసరికి విగతజీవిగా కనిపించింది. పెందుర్తి పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సీఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: డబ్బు, నగలు తీసుకుని.. మాజీ ప్రియుడితో పారిపోయిన పారిశ్రామికవేత్త భార్య
Comments
Please login to add a commentAdd a comment