
సాక్షి, సూర్యాపేట జిల్లా: నడిగూడెం మండలం రామాపురంలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను ఉరేసి, అనంతరం తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెప్తున్నారు. ఆమె భర్త శ్రీనాధ్ ఆర్‌ఎంపీ కావడంతో పేషేంట్ తీసుకొని ఖమ్మం వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే లోపు ఈ దారుణం జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment