ఉపాధ్యాయుల క్రీడలు ప్రారంభం
ఉపాధ్యాయుల క్రీడలు ప్రారంభం
Published Fri, Sep 2 2016 6:52 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM
హాలియా : క్రీడలనే మానసికోల్లాసం కలుగుతుందని జిల్లా విద్యా«ధికారి చంద్రమోహన్ అన్నారు. ఈ నెల 5న గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హాలియా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్వహించిన క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిత్యం విద్యార్థుల చదువుల పట్ల శ్రద్ధ తీసుకునే ఉపాధ్యాయులు ఇలాంటి సందర్భాల్లో క్రీడల ద్వారా ఉల్లాసంతో పాటు ఇతర ఉపాధ్యాయులతో కలిసే అవకాశం వుంటుందన్నారు. క్రీడల పట్ల బాలికలు శ్రద్ధ వహించే విధంగా వ్యాయామ ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాల న్నారు. మండలాల విభజన జరిగే ప్రాంతాల్లో ఉపాధ్యాయులు తమ సర్వీస్ పుస్తకాలను సంబంధిత మండల విద్యాధికారులకు అప్పగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అల్లి నాగమణిపెద్దిరాజు, ఎంఈఓ తరి రాము, ఉపాధ్యాయ సంఘాల నాయకులు గుండా కృష్ణమూర్తి, పెరుమాళ్ల వెంకటేశం, నెమలి వెంకట్‌రెడ్డి, నరేష్ ఫౌండేషన్ చైర్మన్ గొట్టిముక్కల నరేష్, చంద్రుడునాయక్, రాపోలు పరమేష్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement