Published
Wed, Oct 5 2016 9:59 PM
| Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
బావిలో పడి పదేళ్ల చిన్నారి మృతి
హాలియా : తాగునీరు తెచ్చుకునేందుకు వెళ్లిన చిన్నారి బావిలో పడి మృతి చెందిన సంఘటన బుధవారం మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మండలంలోని రంగుండ్ల గ్రామానికి చెందిన ఆంగోతు హరి రెండో కుమార్తె రోజా(10) బుధవారం తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ పొలానికి వెళ్లింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో దప్పిక అవుతుందని బాటిల్ తీసుకుని పక్కనే ఉన్న బావి వద్దకు వెళ్లింది. బావిలో దిగి నీళ్లు తీసుకొచ్చే క్రమంలో కాలు జారి బావిలో పడిపోయిది. వెంటనే తల్లిదండ్రులు పరుగెత్తిళ్లిన వారికి ఈత రాకపోవడంతో పరిసర ప్రాంతాల రైతులు వచ్చే సరికి ఆ చిన్నారి నీళ్లు తాగి మృతి చెందింది. హరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు.