ఏడేళ్లుగా.. ఎదురుచూపులే..! | since seven years they are waiting for canal water | Sakshi
Sakshi News home page

ఏడేళ్లుగా.. ఎదురుచూపులే..!

Published Sun, Jul 19 2015 9:00 AM | Last Updated on Fri, Oct 19 2018 7:19 PM

ఏడేళ్లుగా.. ఎదురుచూపులే..! - Sakshi

ఏడేళ్లుగా.. ఎదురుచూపులే..!

 'చెంతనే కృష్ణమ్మ పరుగులెడుతున్నా.. ఆ గ్రామానికి చుక్క సాగునీరు అందని పరి(దు)స్థితి. 600 ఎకరాల టెలాండ్ భూములకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో ఏడేళ్ల క్రితం చేపట్టిన సప్లమెంటరీ కాల్వ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఈ కాల్వ పనులకు నిధుల లేమి ప్రధాన అడ్డంకిగా మారింది. దీంతో కాల్వ చివరి భూములకు సాగునీరు అందడం లేదని రైతులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు'  - హాలియా


 నాగార్జున సాగర్‌కు కేవలం 20 కి.మీ దూరంలో ఉన్న రాజవరం గ్రామానికి సాగునీరు అందించాన్న ఉద్దేశంతో ఏడేళ్ల క్రితం   సప్లమెంటరీ కాల్వ నిర్మాణం చేపట్టారు. మొదట నిడమనూరు మండలం సూరేపల్లి గ్రామం వద్ద హాలియా వాగుపై ఏర్పాటు చేసిన కత్వ నుంచి రాజవరం గ్రామం వరకు రూ.10 లక్షలతో కాల్వ నిర్మించారు. ఆ నిధులు సరిపోకపోవడంతో మరో రూ.15 లక్షలు మంజూరు చేశారు. ఫలితం లేకపోవడంతో మళ్లీ రూ.35 లక్షల వ్యయంతో నూతనంగా మరో కాల్వను నిర్మించారు. దానికి సప్లమెంటరి కాల్వగా నామకరణం చేశారు. నిధుల లేమితో ఈ కాల్వ కూడా పూర్తి కాలేదు.  దీంతో రాజవరం  గ్రామ టేలాండ్ భూమి  రైతులు సాగునీరు అందక పత్తి, కంది, మినుముల, జోన్న తదితర మెట్టపంటలను సాగు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది.

 ప్రతిపాదనలకే పరిమితమా..?
 రాజవరం గ్రామంలో సాగునీరు అందించేందుకు చేపట్టిన సప్లమెంటరీ కాల్వ పూర్తికి అదనపు నిధులు అవసరమని రెండేళ్ల క్రితం ఎన్‌ఎస్‌పీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. నేటికీ పైసా కూడా విడుదల కాలేదు. ఏడేళ్లుగా అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు సప్లమెంటరీ కాల్వ వద్దకు రావడం, కాల్వ నిర్మాణ పూర్తికి కావాల్సిన నిధులను అంచనా వేసి ప్రతిపాదనలు రూపొందించి పంపడం తంతుగా మారింది. కానీ ఇప్పటి వరకు పైసా కూడా విడుదల కాకపోవడంతో సప్లమెంటరీ కాల్వ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అధికారులు, ప్రజాప్రతినిధు లు మారుతున్నారే గానీ కాల్వ పరిస్థితి మారడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.

 ఇలా చేస్తే ..
 మండలంలోని రాజవరం గ్రామ పరిధిలో ఉన్న 600 ఎకరాలకు సాగునీరు అందించాలంటే మొదటి నిడమనూరు మండలం సూరేపల్లి వద్ద హాలియా వాగుపై ఎర్పాటు చేసిన కత్వ ఎత్తును పెంచాలి. దీంతో పాటు రాజవరం చెరువును విస్తరించి ఆధునికీకరించాలి. అలా చేయడం వలన సూరేపల్లి కత్వ నుంచి నీటిని కాల్వ ద్వార రాజవరం చెరువు కు సరఫరా చేయొచ్చు. అక్కడ నుంచి సప్లమెంటరీ కాల్వ ద్వార సా గునీరు సరఫరా చేస్తే టెలాండ్ భూములకు సాగునీరు అందుతుంది. అందుకు గానూ రూ.కోటీ  నుంచి రెండు కోట్ల వరకు ఖర్చవుతుంది. ప్రభుత్వం రూ.కోటి  నుంచి రెండు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయగల్గితే 600 ఎకరాలకు సాగులోకి వచ్చే అవకాశం ఉంది.
 కాల్వ నిర్మాణం పూర్తి చేయాలి
 గ్రామంలో 600 ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో చేపట్టిన సప్లమెంటరీ కాల్వకు అదనపు నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేయాలి. కాల్వ నిర్మాణం పూర్తయితే గ్రామానికి సాగునీరుతో పాటు తాగునీరు అందుతుంది.  
                                                                                                     -బి.రమణరాజు,మాజీసర్పంచ్, రాజవరం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement