టీడీపీ నేత పల్లె రఘునాథరెడ్డి
సాక్షి, అనంతపురం: టీడీపీ బైక్ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. ర్యాలీలో ఏపీ మాజీ మంత్రి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి నడుపుతున్న బైక్‌ను మరో బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో పల్లె రఘునాథరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించినట్లు సమాచారం. జిల్లాలోని నల్లమడ మండలం దొన్నికోట వద్ద ఈ ప్రమాదం జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, ఇటీవల ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేపట్టిన సైకిల్ ర్యాలీలోనూ అపశ్రుతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గుంటూరు జిల్లాలోని యలమందల వద్ద సైకిల్ తొక్కుతూ కోడెల కిందపడిపోగా.. ఆయన తలకు స్పల్పగాయమైంది. ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన సైకిల్ యాత్రను పూర్తిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment