
సిటీలో ‘గాలిపటం’ సందడి
దర్శకుడు సంపత్ నిర్మించిన ‘గాలి పటం’ చిత్ర యూనిట్ శనివారం నగరంలో సందడి చేసింది.
కరీంనగర్ కల్చరల్ : దర్శకుడు సంపత్ నిర్మించిన ‘గాలి పటం’ చిత్ర యూనిట్ శనివారం నగరంలో సందడి చేసింది. దర్శకుడు సంపత్ నంది, హీరో ఆది, హిరోరుున్ క్రిసీన అఖినా, సంగీత దర్శకుడు బీమ్స్ సెసీ రోలియో కరీం‘నగరం’లోని వేంకటేశ్వర థియేటర్ ప్రేక్షకులను కలిశారు. సినిమాను ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆధరాభిమానాలు ఎప్పటికీ ఉండాలన్నారు. అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చి ఫొటోలకు ఫోజులిచ్చారు. అంతకు ముందు చిత్ర యూనిట్ న గరానికి చేరుకోవడంతో వివిధ సినిమా అభిమానులు ఎన్టీఆర్ విగ్రహం నుంచి బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు.
చిత్రాన్ని ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు..
మిత్రుల సహకారంతో లాస్‌ఏంజిల్స్ టాకీస్ బ్యానర్‌పై నవీన్‌గాంధీ దర్శకత్వంలో తాను నిర్మించిన గాలిపటం చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలని దర్శకుడు సంపత్ నంది అన్నారు. హీరో, నటుడు సాయికుమార్ తనయుడు ఆది మాట్లాడుతూ తమ కుటుంబం సినిమా పరిశ్రమతో పెనవేసుకుందని తెలిపారు. నటి క్రిసీనా అఖినా మాట్లాడుతూ సంపత్ నంది దర్శకత్వంలో నిర్మించిన ‘గాలిపటం’ చిత్రంలో నటించడం తన అదృష్టమన్నారు.
నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ యూనిట్ సభ్యులను అభినందిస్తూ జిల్లాకు చెందిన సంపత్ నిర్మించిన చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించడం హర్షనీయమన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మహ్మద్ ఆరీఫ్, నలువాల రవీందర్, మాజీ కార్పొరేటర్ ఎడ్ల అశోక్, థియేటర్ లీజుదారుడు కన్న కృష్ణ, వివిధ నటుల అభిమాన సంఘాల బాధ్యులు మిడిదొడ్డి నవీన్‌కుమార్, తూము నారాయణ, అంజియాదవ్, గుమ్మడి శ్రీనివాస్, గోసిక అజయ్, నామాల శ్రీనివాస్, సినిమా డిస్ట్రిబ్యూటర్ వెల్పుల సంపత్, చిర ంజీవి, వెంకట్, శ్రీనివాస్, కట్ట స్వామి తదితరులు పాల్గొన్నారు.