రోడ్‌షో, బైక్ ర్యాలీలకు విశేష స్పందన | heavy response to ysrcp roadshow , bike rally | Sakshi
Sakshi News home page

రోడ్‌షో, బైక్ ర్యాలీలకు విశేష స్పందన

Published Mon, Apr 28 2014 2:17 AM | Last Updated on Thu, Aug 30 2018 4:51 PM

heavy response to ysrcp roadshow , bike rally

 చర్ల, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్‌సీపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ చర్ల మండలంలో ఆదివారం నిర్వహించిన రోడ్‌షో, బైక్ ర్యాలీలకు విశేష స్పందన లభించింది. ఉదయం సుబ్బంపేట వద్ద ప్రారంభమైన ర్యాలీ కొయ్యూరు, ఉప్పరిగూడెం, సీ కత్తిగూడెం, జీపీపల్లి. వీరీపురం, మొగళ్లపల్లి, గొంపల్లి, దండుపేట, చర్లకు చేరింది.

మధ్యాహ్నం చర్ల నుంచి భయలు దేరిన ఈ రోడ్‌షో, బైక్‌ర్యాలీలు దోశిళ్లపల్లి, పెదమిడిసిలేరు, తేగడ, ఆర్ కొత్తగూడెం, దేవరాపల్లి మీదుగా రాళ్లగూడెం వరకూ సాగింది. వైఎస్‌ఆర్ సీపీ మద్దతుతో భద్రాచలం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సీపీఎం అభ్యర్థి సున్నం రాజయ్య, వైఎస్‌ఆర్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర కమిటీసభ్యుడు కడెం రామాచారి, జిల్లా మహిళా నాయకురాలు దామర్ల రేవతి పాల్గొని ప్రసంగించారు. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి సీపీఎం మద్దతుతో బరిలో ఉన్న డాక్టర్ తెల్లం వెంకట్రావు, భద్రాచలం ఎమ్మెల్యే అభ్యర్థి సున్నం రాజయ్యలను గెలిపించాలని కోరారు.

 ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ కూటమి నాయకులు కొప్పినీడి నానిబాబు, రామగిరి యాకయ్య, పొడుపుగంటి సమ్మక్క, కలిదిండి సోమరాజు, తెల్లం సమ్మయ్య,  చీమలమర్రి మురళీకృష్ణ, మేరెడ్డి చలపతిరెడ్డి, లంకా వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement