సమైక్యమే ఊపిరి..!
Published Sun, Jan 5 2014 3:54 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సమైక్యాంధ్రే ఊపిరిగా..వైఎస్‌ఆర్‌సీపీ ఉద్యమించింది. బైక్ ర్యాలీలు, మానవహారాలతో నియోజకవర్గ కేంద్రాలు దద్దరిల్లాయి. పార్టీ జెం డాలు పట్టుకుని ఎక్కువగా వయుకులు పాల్గొనడంతో కొత్తదనం ఉట్టిపడింది. శ్రీకాకుళంలోసమైక్యాంధ్రకు మద్దతుగా శనివారం చేపట్టిన బైకు ర్యాలీ విజయవంతమైంది. పార్టీ శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్త వరుదు కళ్యాణి డీసీసీబీ వద్ద ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అక్కడి నుంచి ప్రారం భమైన బైక్ ర్యాలీ వైఎస్‌ఆర్ కూడలి మీదుగా డే అండ్‌నైట్‌కు చేరుకుంది. అక్కడ బైక్‌లతో హారంలా ఏర్పడ్డా రు. సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరో సమన్వయకర్త వైవీ సూర్యనారాయణ, ఎన్ని ధనుంజయ్, పీస శ్రీహరి, అంధవరపు సూరి బాబు తదితరులు పాల్గొన్నారు.
పాలకొండలో పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పాల వలస రాజశేఖరం ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాలైన పాలకొండ, భామిని, సీతంపేట, వీరఘట్టం వైఎస్సార్‌సీపీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించి, నినాదాలు చేశారు. నాలుగు మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజాంలో పార్టీ కార్యాలయం వద్ద పాలకొండ నియోజకవర్గ సమన్వయకర్త పాలవలస విక్రాంత్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం రాజాం నియోజకవర్గ సమన్వయకర్త పీఎంజే బాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమాను ర్యాలీ ని ర్వ హించారు. మాజీ ఎమ్మెల్యే జోగులు, జిల్లా ట్రేడ్ యూనియన్ కన్వీనర్ జీటీ నాయుడు పాల్గొన్నారు.టెక్కలిలో నియోజకవర్గ స మన్వయ కర్త దువ్వాడ శ్రీ నివాస్ ఆధ్వర్యంలో టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, కోటబొమ్మాళి మండలాలకు చెందిన పార్టీ నా యకులు పెద్ద ఎత్తున బైక్ ర్యా లీ నిర్వహించారు. దువ్వాడ వాణి, సంపతిరావు రాఘవరావు, బాడా న మురళీ, తమ్మన్నగారి కిరణ్, దేవాది గోపి, శిమ్మ సోమేశ్వరరావు, తిర్లంగి జానకిరామయ్య, చింతాడ ధర్మారావు పాల్గొన్నారు.
ఆమదాలవలస క్రిష్ణాపురం జంక్షన్ నుంచి పట్టణ శివార్లలోని ఓవర్‌బ్రిడ్జి వరకు రెండు సార్లు ర్యాలీ నిర్వహిం చారు. నినాదాలతో హోరెత్తించారు. నియోజకవర్గ సమన్వయకర్తలు కిల్లి రామ్మోహన్‌రావు, బొడ్డేపల్లి మాధురి, పార్టీ నాయకులు తమ్మినేని సీతారాం, పైడి కృష్ణప్ర ాద్, దవల అప్పలనాయుడు, ఎస్ రాజు పాల్గొన్నారు.ఇచ్ఛాపురంలో బస్టాండ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఏఎస్‌పేట, పురుషోత్తపురం గ్రామాల వరకు ర్యాలీ సా గింది. అనంతరం బస్టాండ్‌లో బైక్‌లతో మానవహారం నిర్వహించారు. ఇచ్ఛాపురం, సోంపేట మండలాల కన్వీనర్లు పి.పోలారావు, కె.మోహనరావు, పి.ఈశ్వరరావు, వివిధ విభాగాల కన్వీనర్లు ఆనంద్, ఎస్.చత్రపతి, కోటి,టి.రామారావు,తులసీ, సుగ్గు చత్రపతిరెడ్డిలు పాల్గొన్నారు.
నరసన్నపేటలో ఎమ్మెల్యే కృష్ణదాస్ కార్యాలయం నుంచి మెయిన్‌రోడ్డు, మార్కెట్ మీదుగా పలు వీధుల్లో ర్యాలీ సాగింది. ధర్మాన రామలింగన్నాయుడు, ఆరంగి మురళీధర్, కేసీహెచ్‌బీ గుప్త, ఎస్.కృష్ణబాబు, పి.గిరీశ్వరరావుపాల్గొన్నారు. సుమారు 100 మోటారు సైకిల్లు ర్యాలీలో పాల్గొన్నాయి. పలాసలో పలాస ఇందిరాచౌక్ నుంచి కాశీబుగ్గ మూడు రోడ్ల కూడలి వరకు ర్యాలీ సాగింది. మూడు రోడ్ల కూ డలి వద్ద యూపీఏ ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. నియోజకవర్గ సమన్వయకర్త వజ్జ బాబూరావు,బళ్ల గిరిబాబు, డబ్బీరు భవానీ శంకర్, యవ్వారి మోహన్‌రావు, నర్తు ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.
పాతపట్నం: నియోజక వర్గ సమన్వయకర్త కలమట వెంకటరమణ ఆధ్వర్యంలో పాతపట్నం నుంచి, పార్టీ బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు కొమరాపు తిరు బైక్ ర్యాలీలు నిర్వహించారు. పార్టీ నాయకులు పి.కృష్ణారావు, మాత ల తిరుమలరావు, షణ్ముఖరావు పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం పైడి భీమవరం నుంచి లావేరు జంక్షన్ వరకు సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలో ైబెకు ర్యాలీ నిర్వహించారు. పిన్నింటి సాయికుమార్, గొర్లె అప్పలనర్సునాయుడు, కరిమజ్జి భాస్కరరావు పాల్గొన్నారు.
Advertisement