
సాక్షి, విశాఖపట్నం: ‘‘జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తన పర్యటనతో ఏం సాధిస్తున్నారు?. మిడిమిడి జ్ఞానంతో ప్రభుత్వంపై ఇష్టానుసారం విమర్శలు చేయడం తప్పించి!’’ అనే విమర్శే వినిపిస్తోంది ప్రత్యర్థుల నుంచి. ఈ క్రమంలో.. స్థానికులు సైతం పవన్, జనసైనికుల తీరుతో ఇబ్బందులు పడుతున్నారు.
ఏదో ఒకటి మాట్లాడడం తప్పించి.. రూల్స్ ఫాలో అయ్యేది లేదు.. ఓ క్రమశిక్షణా లేదు.. జనసైనికులతో కలిసి తన పర్యటనతో పవన్ విశాఖ వాసులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా తాజాగా పవన్ కళ్యాణ్ ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లి హైవేకు ఇరువైపులా బైక్ ర్యాలీతో పవన్ దూసుకుపోగా.. ఆ ట్రాఫిక్ మధ్యలోనే ఆగిపోయి వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
మొన్న రుషికొండ పర్యటన సందర్భంగా హడావిడి చేసిన పవన్.. ముందస్తు సమాచారం ఇచ్చి భారీగా అభిమానులు గుమిగూడేందుకు కారణం అయ్యాడు. పైగా సాయంత్రం సమయం కావడంతో జనాలు ట్రాఫిక్ రద్దీతో బాగా ఇబ్బంది పడ్డారు.
ఇదీ చదవండి: గొడవలు చేయడానికే పవన్ రుషికొండ వెళ్లింది!
Comments
Please login to add a commentAdd a comment