గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్‌లో శుక్రవారం ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అడుగడుగునా ఘన స్వాగతం ..
⇒ గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన జగన్
⇒ కార్మికులకు అండగా ఉంటామని హామీ
⇒ సన్నిధి కల్యాణమండపంలో నూతన వధూవరులు సాయినివ్య, జగన్‌మోహన్‌లకు ఆశీర్వాదం
⇒ రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలోపార్టీ నేతలతో భేటీ
⇒ రానున్న నగరపాలక సంస్థ ఎన్నికలపై దిశా నిర్దేశం
సాక్షిప్రతినిధి, గుంటూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జిల్లా ప్రజలు నీరాజనం పలికారు. శుక్రవారం పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మనవరాలు, పార్టీ నాయకులు కిలారు రోశయ్య కుమార్తె సాయినివ్య, జగన్‌మోహన్‌ల వివాహానికి హాజరైన జగన్‌కు ప్రజలు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన గుంటూరు చేరుకున్న ఆయనకు రహదారికి ఇరువైపులా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు బారులు తీరి స్వాగతం పలికారు. జై జగన్ అంటూ నినదించారు.
గుంటూరు ఆటోనగర్ నుంచి యువత పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలతో జననేతకు ఘనస్వాగతం పలికింది. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ప్రసంగించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పేరులోనే కర్షకులు, కార్మికులు, యువజనులు ఉన్నారని, వారి అభ్యున్నతికి పార్టీ కట్టుబడి ఉందన్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆటో కార్మికుల సమస్యలను అధినేతకు వివరించారు. అలాగే నగరపాలక సంస్థకు చెందిన కాంట్రాక్టు, ఇంజనీరింగ్ కార్మికులు తమ సమస్యలను అధినేతకు వివరించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను టీడీపీ విస్మరించిందని పేర్కొనడంతో వాటి పరిష్కారానికి కృషి చేస్తామని జగన్ హమీ నిచ్చారు. అక్కడి నుంచి జీటీ రోడ్డు లోని సన్నిధి కల్యాణమండపానికి చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం ప్రభుత్వ అతిథి గృహానికి చేరుకున్న జగన్ పార్టీ నాయకులతో రానున్న నగరపాలక సంస్థ ఎన్నికలపై సమీక్షించారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, డివిజన్లలోని సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. టీడీపీ అనుసరిస్తున్న అక్రమ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, అభివృద్ధి పేరుతో జరుగుతున్న అక్రమాలను ప్రజలకు తెలియపరచాలని దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, పార్టీ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డి, మాజీ మంత్రులు కె.పార్ధసారథి, మోపిదేవి వెంకట రమణ, మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలు మొహ్మద్ ముస్తఫా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, పార్టీ నగర అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు, కేంద్ర పాలక మండలి సభ్యులు జంగా కృష్ణమూర్తి, ప్రోగ్రామ్స్ కమిటీ కన్వీనరు తలశిల రఘురామ్, నియోజకవర్గ ఇన్‌చార్జిలు రావి వెంకటరమణ.
అన్నాబత్తుని శివకుమార్, కత్తెర క్రిస్టినా, నన్నపనేని సుధ, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనే యులు, రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం రాము), లీగల్‌సెల్ జిల్లా కన్వీనర్ పోలూరి వెంకటరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బండారు సాయిబాబు, బీసీ సెల్ అధ్యక్షులు సునీల్‌కుమార్, సేవా దళ్ జిల్లా అధ్యక్షులు కొత్త చినపరెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు మొగిలి మధు, సేవాదళ్ జిల్లా కార్యదర్శి ఆర్. ముత్యాలరాజు, మైనార్టీ జిల్లా అధ్యక్షులు మాబు, తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహ మహోత్సవానికి ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
ప్రభుత్వ అతిథి గృహంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు, దుగ్గిరాల జెడ్‌పీటీసీ యేళ్ల జయలక్ష్మి , దేవళ్ల రేవతి, కొలకలూరి కోటేశ్వరరావు, ఎం.ప్రకాశ్‌రెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రేపాల శ్రీనివాసరావు, నూనె ఉమామహేశ్వరరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.శ్రీనివాసరెడ్డి, జిల్లా కార్యదర్శి అత్తోట జోసఫ్‌కుమార్, డైమండ్ బాబు, కత్తెర సురేష్, సి.హెచ్.రవికుమార్, కర్నుమా, పూనూరి నాగేశ్వరరావు, కొరిటి పాటి ప్రేమ్‌కుమార్, మండేపూడి పురుషోత్తం, ఉప్పుటూరి నర్సిరెడ్డి, మెహమూద్ తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 2.45 గంటలకు అతిథి గృహం నుంచి జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్ వెళ్లారు.