నిజామాబాద్ జిల్లా మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ విషయంలో ప్రతిపక్షాల వైఖరికి నిరసనగా అధికారపక్షం నాయకులు ఆందోళన బాటపట్టారు.
బీర్కూర్ : నిజామాబాద్ జిల్లా మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ విషయంలో ప్రతిపక్షాల వైఖరికి నిరసనగా అధికారపక్షం నాయకులు ఆందోళన బాటపట్టారు. తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో బొమ్మన్‌దేవ్‌పల్లి చౌరస్తా నుంచి నాచుపల్లి మీదుగా బీర్కూర్ వరకు భారీ ర్యాలీ తీశారు. అనంతరం ప్రతిపక్షాల దిష్టిబొమ్మను దహనం చేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టును అడ్డుకుంటే ప్రతిపక్షాలకు పుట్టుగతులు ఉండవని అధికార పక్ష నాయకులు విమర్శించారు.