అనంతపురం అర్బన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రను కాంక్షిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన బైక్ ర్యాలీతో అనంతపురం దద్దరిల్లింది. వేలాది మంది కార్యకర్తలు జై సమైక్యాంధ్ర, జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. మార్కెట్ యార్డు నుంచి ప్రారంభమైన ర్యాలీ.. పాతవూరు, శ్రీకంఠం సర్కిల్ మీదుగా ఆర్‌ట్స కళాశాల, క్లాక్‌టవర్ మీదుగా సుభాష్‌రోడ్డులోని వైఎస్సార్ విగ్రహం వరకు సాగింది. అక్కడ పార్టీ ఎమ్మెల్యేలు బి.గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు బి.ఎర్రిస్వామిరెడ్డి, తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, రాప్తాడు, శింగనమల నియోజకవర్గ నేతలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఆలూరి సాంబశివారెడ్డి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు తీర్మాన బిల్లును ఓడించాలని డిమాండ్ చేశారు.
పజల మనోభావాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. 59 రోజుల నుంచి ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు స్వచ్ఛందంగా సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నారన్నారు. కాగా, టీడీపీ ఎటూ తేల్చుకోలేక వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ ఓర్వలేక నిందలు వేస్తోందన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ మాట్లాడుతూ టీడీపీ నీతిమాలిన రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోకుండా కాంగ్రెస్‌తో కుమ్మక్కైందని ఆరోపించారు. సమైక్యాంధ్రకు కట్టుబడిన ఏకైన పార్టీ వైఎస్సార్ సీపీనేనన్నారు.
సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు రిలాక్స్ నాగరాజు నేతృత్వంలో పాడిన పాటలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో నాయకులు కొర్రపాడు హుసేన్‌పీరా, మిద్దె భాస్కర్ రెడ్డి, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, లింగాల రమేష్, రంగంపేట గోపాల్ రెడ్డి, యోగీశ్వర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, చింతకుంట మధు, విద్యాసాగర్‌రెడ్డి, మారుతీనాయుడు, బలరాం, గౌస్, సత్తీష్, మారుతీ ప్రకాష్, రఫి, జయరాం నాయక్, మహానంద రెడ్డి, బోయ సుశీలమ్మ, ప్రమీలమ్మ, ఉషారాణి, శ్రీదేవి, కృష్ణవేణి, దేవి, అంకిరెడ్డి ప్రమీల, ప్రశాంతి, సావిత్రమ్మ, కే పార్వతి, పుష్పావతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
బైక్ ర్యాలీతో దద్దరిల్లిన అనంత
Published Sat, Sep 28 2013 2:28 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement