బైక్‌పై నుంచి పడిపోయిన తెలంగాణ స్పీకర్‌ | Speaker Madhusudanachari fall down in bike rally | Sakshi
Sakshi News home page

బైక్‌పై నుంచి పడిపోయిన తెలంగాణ స్పీకర్‌

Published Wed, Aug 15 2018 2:34 AM | Last Updated on Mon, Aug 20 2018 6:47 PM

Speaker Madhusudanachari fall down in bike rally - Sakshi

బైక్‌ మీద నుంచి పడిపోయిన స్పీకర్‌

శాయంపేట: బైక్‌ అదుపుతప్పి స్పీకర్‌ మధుసూదనాచారి కిందపడి పోయారు. ఈ ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండల కేంద్రం శివారులో మంగళవారం జరిగింది. ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. పల్లె ప్రగతి నిద్ర కార్యక్రమంలో భాగంగా స్పీకర్‌ సోమవారం రాత్రి శాయంపేట మండల కేంద్రంలో నిద్రించారు.

మంగళవారం ఆరెపల్లి గ్రామానికి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. తిరుగు ప్రయాణంలో శాయంపేట శివారుకు చేరుకోగానే మూలమలుపు వద్ద ఎదురుగా ఎడ్లబండి రావడంతో బైక్‌ను రోడ్డు కిందికి దించారు. మళ్లీ రోడ్డెక్కే క్రమంలో టైర్‌ స్కిడ్‌ అయి అదుపుతప్పి బైక్‌ పై నుంచి కిందపడిపోయారు. సెక్యూరిటీ సిబ్బంది స్పీకర్‌ను పైకి లేపారు. మళ్లీ యథావిధిగా స్పీకర్‌ బైక్‌పై ర్యాలీ కొనసాగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement