సంగారెడ్డి క్రైం : మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో భాగంగా జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో శనివారం బీజేపీ, టీడీపీ సమైక్యంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించాయి. పట్టణ శివారులోని వైకుంఠపురం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణ ప్రధాన వీధుల గుండా పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, కలెక్టరేట్, పోతిరెడ్డిపల్లి వరకు కొనసాగింది. యువత పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు.
మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తూర్పు జయప్రకాష్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకుడు పెద్దిరెడ్డి, జిల్లా నాయకుడు మాణిక్యం తదితరులు ఓపెన్‌టా ప్ జీప్‌లో నిల్చుని ప్రజలకు అభివాదం చేశా రు. పోతిరెడ్డిపల్లి నుంచి కంది, చేర్యాల్, ఇస్మాయిల్‌ఖాన్‌పేట తదితర గ్రామాల్లో ఈ బైక్ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడు తూ బీజేపీని గెలిపిస్తే మెతుకుసీమ అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్రం నుంచి అధిక ని దులు జిల్లాకు మంజూరయ్యే అవకాశముం దని చెప్పారు.
కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే ఉపయోగమేమీ ఉండదన్నారు. బీజేపీని గెలిపిస్తే మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రోరైల్ రప్పిస్తానని, ఇంటింటికీ మంజీరా నీరు అందించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కె.జగన్, వాసు, విష్ణువర్దన్ పాల్గొన్నారు.
బీజేపీ భారీ బైక్ ర్యాలీ
Published Sat, Sep 6 2014 11:39 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement