
కోవెలకుంట్ల: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రను బనగానపల్లె నియోజకవర్గంలో విజయవంతం చేయాలని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రజా సంకల్పయాత్ర నియోజకవర్గంలో శనివారం నుంచి ప్రారంభం కానుండటంతో శుక్రవారం పట్టణంలోని జీసీఆర్ పెట్రోల్ బంకు నుంచి బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ పాదయాత్ర కోవెలకుంట్ల మండలం కంపమల్ల మెట్ట వద్ద నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందన్నారు. అక్కడి నుంచి మొదటి రోజు మండలంలోని భీమునిపాడు మీదుగా కోవెలకుంట్ల పట్టణానికి చేరుకుంటుందన్నారు
పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రా హర్షవర్దన్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సిద్ధంరెడ్డి రాంమోహన్‌రెడ్డి, మండల ఇన్‌చార్జ్ శింగిరెడ్డి రామేశ్వరరెడ్డి, వెలగటూరు, కలుగొట్ల సర్పంచ్‌లు ఎల్వీ సుధాకర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, బిజనవేముల, కోవెలకుంట్ల ఎంపీటీసీలు భీంరెడ్డి ప్రతాప్‌రెడ్డి, దిల్క్‌బాషా, కలుగొట్ల, లింగాల, చిన్నకొప్పెర్ల, వెలగటూరు, పెద్దకొప్పెర్ల మాజీ సర్పంచ్‌లు ప్రభాకర్‌రెడ్డి, శేషిరెడ్డి, రఘునాథరెడ్డి, మాధవరెడ్డి, సూర్యశేఖర్‌రెడ్డి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శులు అమడాల భాస్కర్‌రెడ్డి, జోళదరాశి రాంమోహన్‌రెడ్డి, చిక్కేపల్లి రామకృష్ణారెడ్డి నాయకులు ఎల్‌ఐసీ రామసుబ్బారెడ్డి, చిన్నకొప్పెర్ల మోహన్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, మధుసుధాకర్, శేషిరెడ్డి, మహేశ్వరరెడ్డి, ఉసేనయ్య, ఎర్రం ఈశ్వరరెడ్డి, రేవనూరు తులసిరెడ్డి పాల్గొన్నారు.