కేంద్ర ప్రభుత్వం తలపెడుతున్న రాయల తెలంగాణ ప్రతిపాదనకు నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. దీంతో వర్సిటీలోని ఎన్సీసీ గేటు వద్ద బుధవారం మధ్యాహ్నం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏరప్డింది. విద్యార్థులు భారీ సంఖ్యలో చేరుకోవడంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే విద్యార్థులు జెండాలు పట్టుకుని నినాదాలు చేసుకుంటూ బారికేడ్ల మీద నుంచి దూకి బయటకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. అలాగే విద్యార్థులు ప్రారంభించిన బైకు ర్యాలీని కూడా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోట చేసుకుంది.
దీంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఓయూ వద్ద భారీగా మోహరించారు. రాయల తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం సుముఖంగా ఉన్నట్లు వార్తలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విద్యార్థులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు గురువారం తెలంగాణ బంద్కు కూడా టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఇది ఇంకెంత ఉద్రిక్తంగా మారుతుందోనని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఓయూలో ఆందోళన సందర్భంగా విద్యార్థులు కొన్ని డ్రమ్ములకు నిప్పంటించి వాటిని కూడా విసిరేసిన ఘటనలు కనిపించాయి.
రాయల తెలంగాణపై ఓయూలో ఉద్రిక్తత
Published Wed, Dec 4 2013 12:39 PM | Last Updated on Sat, Sep 2 2017 1:15 AM
Advertisement
Advertisement