బైక్ ర్యాలీలతో సమైక్య హోరు | bike rally for samaikyandhra under the YSRCP | Sakshi
Sakshi News home page

బైక్ ర్యాలీలతో సమైక్య హోరు

Published Sun, Jan 5 2014 12:25 AM | Last Updated on Tue, May 29 2018 4:09 PM

bike rally for samaikyandhra under the YSRCP

 సాక్షి, కాకినాడ : సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా బైక్ ర్యాలీలతో పార్టీ శ్రేణులు హోరెత్తించారు. పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో అమలాపురం హైస్కూల్ సెంటర్ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ పట్టణ పురవీధుల మీదుగా సాగింది. బస్టాండ్ సెంటర్, నల్ల వంతెన, ఎర్ర వంతెనల మీదుగా గడియార స్తంభం సెంటర్ వరకూ ఈ ర్యాలీ సాగింది. జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు ఆధ్వర్యంలో  కాకినాడ గొడారిగుంట నుంచి ప్రారంభమైన బైక్‌ర్యాలీ ఎన్‌ఎఫ్‌సీఎల్ రోడ్, ఎస్. అచ్యుతాపురం, ప్రతాప్‌నగర్, స్వామినగర్, ఇంద్రపాలెం, చీడిగ మీదుగా కొవ్వాడ వరకూ సాగింది.

 అక్కడ నుంచి గంగనాపల్లి, స్వామినగర్‌లలో వేణు ఆధ్వర్యంలో గడపగడపకూ వైఎస్సార్ సీపీ సమైక్య నినాదం పాదయాత్ర చేపట్టారు. రిటైర్డు డీఐజీ నాగేశ్వరరావు, పార్టీ నాయకులు కర్రి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలం లింగంపర్తి నుంచి ప్రారంభమైన బైక్‌ర్యాలీ ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాల పరిధిలోని గ్రామాల మీదుగా సాగింది. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో పిఠాపురం పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ పిఠాపురం పట్టణ పురవీధులు, మండల పరిధిలోని గ్రామాల మీదుగా సాగింది.

కేంద్ర కమిటీ సభ్యుడు గంపల వెంకట రమణతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ తనయుడు జ్యోతుల నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో కిర్లంపూడి మండలం బూరుగుపూడి నుంచి బైక్‌లపై పార్టీ శ్రేణులు మండల పరిధిలోని గ్రామాల మీదుగా ర్యాలీ నిర్వహించారు. రాజమండ్రి నగర కో- ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో కోటగుమ్మం సెంటర్ నుంచి బైక్ ర్యాలీ ప్రారంభించారు. అక్కడ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా కోటిపల్లి బస్టాండ్ వరకూ ర్యాలీ సాగింది. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ నాయకులు బొడ్డు వెంకట రమణ చౌదరి, ట్రేడ్ యూనియన్ కార్యదర్శి టీకే విశ్వేశ్వరరెడ్డి, సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని తదితరులు పాల్గొన్నారు.

    పార్టీ కో-ఆర్డినేటర్ గుత్తుల సాయి ఆధ్వర్యంలో ముమ్మిడివరం కాసివాని తూము నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ అనాతవరం వరకు సాగింది. పార్టీ కార్యాలయం ఎదుట 216 జాతీయ రహదారిపై గంగిరెద్దులతో ఊరేగింపు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. పార్టీ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు ఆధ్వర్యంలో పెద్దాపురం నుంచి సామర్లకోట వరకూ బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్దాపురం, సామర్లకోట పట్టణ కన్వీనర్లు పేర్నిడి ఈశ్వరరావు, గుణ్ణం రాజబ్బాయిలు పాల్గొన్నారు. కో-ఆర్డినేటర్ రెడ్డి వీర వెంకట సత్య ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన బైక్ ర్యాలీ మండపేట నుంచి మండలంలోని పలు గ్రామాల మీదుగా సాగింది. ద్వారపూడి వంతెనపై రాస్తారోకో నిర్వహించారు. కిసాన్‌సెల్ జిల్లా కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో తుని పార్టీ కార్యాలయం నుంచి  ప్రారంభమైన ర్యాలీ పట్టణ పురవీధుల మీదుగా సాగింది. పార్టీ జిల్లా వైద్య విభాగం కన్వీనర్ డాక్టర్ యనమదల మురళీకృష్ణ ఆధ్వర్యంలో కాజులూరు మండలం కుయ్యేరు నుంచి గొల్లపాలెం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.

 జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి డేవిడ్ రాజు ఆధ్వర్యంలో కొత్తపేట నుంచి ఏనుగుల మహల్ వరకూ జరిగిన బైక్ ర్యాలీలో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు రెడ్డి చంటి, ముసునూరి వేంకటేశ్వరరావులతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలో బొమ్మూరు నుంచి బైకు ర్యాలీ ప్రారంభించిన పార్టీ శ్రేణులు మోరంపూడి, హుకుంపేట, శాటిలైట్ సిటీ డీ-బ్లాక్ మీదుగా సాగింది. శివకోడు నుంచి రాజోలు సెంటర్ వరకు  పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement