varupula subbarao
-
వైఎస్సార్సీపీ ప్రత్తిపాడు అభ్యర్థికి త్రుటిలో తప్పిన ప్రమాదం
పిఠాపురం/ఏలేశ్వరం: కాకినాడ జిల్లా పిఠాపురం రాపర్తి సెంటర్ వద్ద 216 జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. బెండపూడి నుంచి వస్తున్న ఒక కారు రాపర్తి సెంటర్ వద్దకు వచ్చేసరికి గేదెలు అడ్డంగా వచ్చాయి. దీంతో ఆ కారు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న వరుపుల సుబ్బారావు కారు ముందున్న కారును బలంగా ఢీకొంది. రెండు కార్లూ దెబ్బతిన్నాయి. ఘటన జరిగిన వెంటనే వరుపుల సుబ్బారావు ఉన్న కారులో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నాయి. దీంతో ఆయన సురక్షితంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు. అనంతరం సుబ్బారావు మరో కారులో కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి నుంచి స్వగ్రామమైన ఏలేశ్వరం మండలం, లింగంపర్తి చేరుకున్నారు. కాగా, ఈ ప్రమాదంలో ముందున్న కారులో ఉన్న వారికి కూడా ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు చెప్పారు. -
ప్రత్తిపాడు వైఎస్సార్ సీపీ ఇంఛార్జ్ గా వరుపుల సుబ్బారావు
-
సీఎం జగన్ నమ్మకానికి అనుగుణంగా పని చేస్తా : వరుపుల సుబ్బారావు
-
తాతకే వెన్నుపోటు పొడిచి సీటు లాక్కున్నాదు
-
‘అందుకే మళ్లీ వైఎస్సార్సీపీలోకి వచ్చా’
సాక్షి, కాకినాడ: తన తోడల్లుడు జ్యోతుల నెహ్రూకు మంత్రి పదవి ఇస్తారని చెబితే టీడీపీలో చేరానని తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు వెల్లడించారు. సోమవారం సాక్షి టీవీతో మాట్లాడుతూ.. తనకు చంద్రబాబు చేసిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. మూడు సార్లు వైఎస్ఆర్, గత ఎన్నికల్లో ఆయన తనయుడు వైఎస్ జగన్ తనను గుర్తించి ఎమ్మెల్యే సీటు ఇచ్చారని.. వారి వల్లే రెండు సార్లు ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా గెలిచానని తెలిపారు. అలాంటి వ్యక్తుల గుర్తింపు మరిచిపోయి పార్టీ ఫిరాయించి పొరపాటు చేశానని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. మనవడే కదా అని వరుపుల రాజాను తన వెంట తిప్పుకుని స్వేచ్ఛ ఇస్తే తాతకే వెన్నుపోటు పొడిచి సీటు లాక్కున్నాడని వాపోయారు. తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని టీడీపీ అధిష్టానం చెప్పినా తిరస్కరించి మళ్లీ వైఎస్సార్సీపీలోకి వచ్చినట్టు వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తనకు ఎటువంటి పదవులు వద్దని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు పార్టీలో కష్టపడి పనిచేస్తాని వరుపుల సుబ్బారావు అన్నారు. -
టీడీపీకి ఫిరాయింపు ఎమ్మెల్యే రాజీనామా
-
టీడీపీకి గుడ్‌బై చెప్పిన సిట్టింగ్ ఎమ్మెల్యే
-
టీడీపీకి ఫిరాయింపు ఎమ్మెల్యే రాజీనామా
సాక్షి, కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. ప్రత్తిపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే వరుపులు సుబ్బారావు టీడీపీకి గుడ్ బై చెప్పారు. అయితే సుబ్బారావు 2014 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి.. ఆ తర్వాత టీడీపీలోకి చేరారు. అయితే అధికార పార్టీలో చేరిన సుబ్బారావు అక్కడ తగిన ప్రాధాన్యం దక్కలేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. గురువారం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన సుబ్బారావు.. టీడీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ తనకు చేసిన అన్యాయాన్ని చెబుతూ కంటతడి పెట్టుకున్నారు. అయితే సుబ్బారావు వైఎస్సార్ సీపీలో చేరాలని పలువురు కార్యకర్తలు ఆయనపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇప్పటికే ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ కుటుంబం కూడా టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తాజా పరిణామాలు గమనిస్తే ప్రత్తిపాడులో టీడీపీకి ఎదురుదెబ్బ తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
చంద్రబాబు వద్ద ప్రత్తిపాడు టీడీపీ ‘పంచాయితీ’
తూర్పుగోదావరి, ఏలేశ్వరం: గత కొంతకాలంగా ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీలో జరుగుతున్న కుమ్ములాటలపై మంగళవారం చంద్రబాబు వద్ద ప్రత్తిపాడు టీడీపీ నేతల పంచాయితీ సాగింది. టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, డీసీసీబీ ఛైర్మన్ వరుపుల రాజా, దివంగత మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు వర్గం టీడీపీ టిక్కెట్టు కోసం పావులు కదుపుతున్న విషయం విదితమే. ముఖ్యంగా తాతా మనవళ్లయిన వరుపుల సుబ్బారావు, వరుపుల రాజాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇద్దరూ ఎవరికి వారే గ్రూపులు కట్టి పార్టీలో పట్టుకోసం పోటీ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడటంతో దీనిపై అధిష్టానం దృష్టి సారించింది. దీనిలో భాగంగా తాతా, మనవళ్లతోపాటు పర్వత కుటుంబ సభ్యులను చర్చలకు చంద్రబాబు ఆహ్వానించారు. భేటీలో డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా వైపు చంద్రబాబు మొగ్గు చూపించినట్లు తెలిసింది. దీనిపై ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాజకీయంలో అనుభవం ఉన్న వ్యక్తినని, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తనకే సీటు ఇవ్వాలని పట్టుబట్టారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ సర్వేలు ఆశాజనకంగా లేవని ఎమ్మెల్యేకు వివరించారు. సర్వేల వివరాలు చూపించాలని ఎమ్మెల్యే కోరగా పక్కనే ఉన్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రును ఉద్ధేశించి ‘నీ తోడల్లుడు సర్వే రిపోర్టులు అడుగుతున్నాడని ... పార్టీ సర్వేలు బహిర్గతం చేస్తారా’ అని ప్ర«శ్నించినట్లు తెలిసింది. దీనిపై జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల సమయంలో టికెట్ ఇస్తానని హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు. సర్వేలు అనుకూలంగా లేనప్పుడు మాట నిలబెట్టుకోలేమని చంద్రబాబు అన్నట్లు తెలిసింది. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ కష్టించి పనిచేసి పార్టీని గెలిపించాలని చంద్రబాబు కోరారు. దీనిపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేయగా వచ్చే నెల 1వ తేదీన మళ్లీ సమావేశం అవుదామని చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది. దీంతో వరుపుల నిరాశతో వెనుదిరిగారు. ఒకటి రెండు రోజుల్లో తన అనుచరులతో ఎమ్మెల్యే సమావేశం కానున్నట్లు తెలిసింది. భేటీలో తాతా మనవళ్లతోపాటు మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ, చిట్టిబాబు సోదరుడు పర్వత రాజుబాబు, పర్వత జానకీదేవి పాల్గొన్నారు. -
టీడీపీలో ఇంటిపోరు
సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి, కాకినాడ : ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీలో ఆసక్తికర పోరు నడుస్తోంది. తాతామనవడి మధ్య అంతర్యుద్ధం సాగుతోంది. తాత వరుసైన ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, మనవడి వరుసైన డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా మధ్య ప్రస్తుతం నువ్వానేనా అన్నట్టుగా వివాదం రాజుకుంటోంది. పార్టీ టిక్కెట్ విషయంలో కుమ్మలాటలకు దారితీస్తోంది. రాజకీయ భిక్ష పెట్టిన తనకు వెన్నుపోటు పొడుస్తున్నారని రాజాపై సుబ్బారావు మండిపడుతుండగా, ఎదిగేందుకు ఇదే మంచి అవకాశంగా సుబ్బారావుకు దీటుగా రాజా పావులు కదుపుతున్నారు. వీరి మధ్య కొనసాగుతున్న ఆధిపత్యపోరులో టీడీపీ శ్రేణులు నలిగిపోతున్నాయి. ‘ముందుకెళితే గొయ్యి – వెనక్కి వెళితే’ నుయ్యి అన్నచందంగా తయారైంది. తాతా, మనవళ్ల గంతులాట... ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా తాతా, మనవళ్లుగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో రాజకీయాలు నెరుపుతున్నారు. సుబ్బారావు సోదరుడు మాజీ ఎమ్మెల్యే వరుపుల జోగిరాజు మనువడిగా రాజా రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. ఈయన తండ్రి తమ్మారావు రాజకీయాలకు కాస్త దూరంగా ఉండేవారు. మాజీ ఎమ్మెల్యే జోగిరాజు తర్వాత ఆ కుటుంబం నుంచి వరుపుల సుబ్బారావే రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. వారి నీడలో రాజా మెలుగుతూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అదే పార్టీ తరఫున డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇక, ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు కాంగ్రెస్ నుంచి వైఎస్సార్సీపీలోకి వచ్చి 2014 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున విజయం సాధించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ తరఫున డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న వరుపుల రాజా ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఈయన టీడీపీలో చేరిన కొన్నాళ్ల తర్వాత వరుపుల సుబ్బారావు వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించారు. మొత్తానికి తాతా,మనవళ్లు ఇద్దరు ఫిరాయింపు నేతలుగానే నియోజకవర్గంలో కొనసాగుతున్నారు. ఈ సారి తనకే టిక్కెట్టంటూ... ఎన్నాళ్లీ ద్వితీయ శ్రేణి నాయకుడిగా కొనసాగుతామని... ఎదగడానికి ఇంతకన్నా మంచి సమయం దొరకదని భావించారో ఏమో తెలియదు గాని తాత సుబ్బారావుకు దీటుగా రాజా నియోజకవర్గంలో రాజకీయాలు చేయడం ప్రారంభించారు. మంత్రి యనమల రామకృష్ణుడి అనుచరుడిగా ఎదిగేందుకు ఆరాటపడుతున్నారు. ఆయన అశీస్సులతో రానున్న ఎన్నికల్లో టిక్కెట్ సాధించాలన్న యోచనతో ముందుకెళ్తున్నారు. ఇదే క్రమంలో పార్టీలో కీలక నేతగా ఉన్న మంత్రి లోకేష్‌తో కూడా సన్నిహిత సంబంధాలు మెరుగుపర్చుకున్నారు. ఈ విధంగా పార్టీలో పట్టు సాధించడంతో ఈసారి ఎలాగైనా తనకే టిక్కెట్ వస్తుందని, రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానని పార్టీ శ్రేణులకు సంకేతాలు పంపిస్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఈ రకంగా ఎమ్మెల్యే సుబ్బారావుకు సెగ పెట్టడమే కాకుండా ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీలో ప్రత్యామ్నాయంగా తయారయ్యారు. ఆత్మరక్షణలో ఎమ్మెల్యే ... చాపకింద నీరులా మనువడైన రాజా ప్రత్యామ్నాయ రాజకీయాలు చేస్తుండటమే కాకుండా ఎమ్మెల్యే సీటుకే ఎసరుపెట్టేలా ఉన్నారని సుబ్బారావు గ్రహించి అప్రమత్తమయ్యారు. జరుగుతున్న పరిణామాలు జీర్ణించుకోలేని విధంగా ఉండటంతో రాజాను టార్గెట్ చేయడం ప్రారంభించారు. రాజకీయ బిక్ష పెట్టిన తనకు వెన్నుపోటు పొడుస్తున్నారని, ఈసారి తనకే టిక్కెట్ అంటూ చెప్పుకుని తిరుగుతున్నారని, రాజకీయ ఓనమాలు దిద్దిన తనకే ఎసరు పెడుతున్నారని రాజాపై ఒంటికాలిపై లేవడం మొదలుపెట్టారు. అసలు రాజాకు టిక్కెట్ వచ్చేది లేదని, ఆయన వద్దకు ఎవ్వరూ వెళ్లొద్దని హుకుం జారీ చేస్తున్నారు. రాజా దగ్గరకు వెళితే తన వద్దకు రానవసరం లేదని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. గత కొన్ని రోజులగా రాజాను లక్ష్యంగా చేసుకుని తన నివాసంలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తనకు అన్యాయం చేసేందుకు రాజా యత్నిస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇప్పటికే ప్రతికూలత – ఆపై రాజా సెగ... ఇప్పటికే నియోజకవర్గంలో అంతర్గత పోరు ఉండటం...ఇప్పుడు కొత్తగా రాజా ప్రతికూలంగా తయారవడంతో సుబ్బారావు తట్టుకోలేకపోతున్నారు. ఫిరాయింపు నేతగా నియోజకవర్గంలో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది. టీడీపీకి అమ్ముడుపోయి గెలిపించిన పార్టీకి వెన్నుపోటు పొడిచారని చెడ్డపేరును మూట గట్టుకున్నారు. గత ఎన్నికల్లో తన వెనుకున్న వారిలో చాలా మంది వైఎస్సార్సీపీలో ఉండటంతో పరిస్థితి ప్రతికూలంగా ఉంది. దీనికితోడు టీడీపీ పాత నాయకులుగా ఉన్న దివంగత పర్వత చిట్టిబాబు వర్గీయులతో ఏమాత్రం పొసగడం లేదు. అభివృద్ధి, సంక్షేమ పనుల్లో చిట్టిబాబు వర్గీయులుగా ఉన్న పర్వత రాజబాబు అనుచరులకు మొండి చేయి చూపించడంతో వారంతా లోలోపల రగిలిపోతున్నారు. అంతేకాకుండా పార్టీలో అణగదొక్కే విధంగా వ్యవహరించడంతో ఎప్పటికప్పుడు పర్వత రాజబాబు వర్గీయులు తిరగబడుతున్నారు. వీరంతా సీఎం చంద్రబాబుకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ విధంగా ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, టీడీపీ పాత నేత పర్వత రాజబాబు వర్గీయుల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సీటు ఫైటు మొదలవడంతో సుబ్బారావుకు కంటి మీద కునుకు ఉండటం లేదు. అయోమయంలో తమ్ముళ్లు... ఒకవైపు టిక్కెట్ తనకే వస్తుందని వరుపుల రాజా చెప్పుకుంటుండగా, మరోవైపు రాజాకు ఛాన్సే లేదని..టిక్కెట్ నాకే దక్కుతుందని...రాజా వద్దకు వెళితే నా దగ్గరకు రావొద్దని...అక్కడికి వెళ్లిన వారికి ప్రాధాన్యత ఇవ్వనంటూ సుబ్బారావు హెచ్చరించడంతో టీడీపీ శ్రేణులు ఇరకాటంలో పడ్డాయి. ఎవరి వద్దకు వెళితే ఏం జరుగుతుందోనని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ‘కరవమంటే కప్పకు కోపం–విడవమంటే పాముకు కోపం’ అన్న చందంగా టీడీపీ శ్రేణుల పరిస్థితి తయారైంది. వీరి మధ్య నడుస్తున్న అంతర్గత పోరులో నలిగిపోతున్నామని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రత్తిపాడు టీడీపీలో కుమ్ములాట
సాక్షి ప్రతినిధి, కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు టీడీపీలో విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ‘నువ్వెంత అంటే నువ్వెంత’ అనే స్థాయికి వెళ్లిపోయాయి. పార్టీలోకి వచ్చి తమను అణగదొక్కుతున్నారని ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుపై టీడీపీలో తొలినుంచీ ఉంటూ వస్తున్నవారు భగ్గుమంటున్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే తమపై పెత్తనం చెలాయించడమేంటని పర్వత చిట్టిబాబు వర్గీయులు తిరుగుబాటుకు దిగారు. వారందరూ ఇప్పుడు రోడ్డెక్కారు. ఎమ్మెల్యే తీరును బాహాటంగానే దుయ్యబడుతున్నారు. జోక్యం చేసుకుంటున్న అధికారులను సైతం నిలదీస్తున్నారు. ఇదెక్కడికి వెళ్తుందో తెలియదు గాని ప్రత్తిపాడు టీడీపీలో మాత్రం ప్రస్తుతం కలహాల కాపురం నడుస్తోంది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీకి పర్వత చిట్టిబాబు వర్గమే నాయకత్వం వహిస్తూ వస్తోంది. కానీ, ఎన్నికల అనంతరం ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వచ్చారు. దీంతో టీడీపీలో కుమ్మలాట మొదలయింది. పార్టీలోకి రావడమే తరువాయి పాత కాపులైన పర్వత చిట్టిబాబు వర్గీయులను అణగదొక్కడమే పనిగా ఎమ్మెల్యే వరుపుల పెట్టుకున్నారు. ఇప్పటికే పలుమార్లు పర్వత చిట్టిబాబు వర్గీయులు బయటపడ్డారు. ఎమ్మెల్యేపై ఫిర్యాదుకు సైతం దిగారు. పరిస్థితిలో మార్పు రాలేదు. పర్వత వర్గీయులకు అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయి. తాజాగా ఫ్లెక్సీల గొడవ... టీడీపీ అట్టహాసంగా చేపడతున్న పింఛన్ల పంపిణీలో తాజాగా అసమ్మతి బుసకొట్టింది. ఈ నెల 9న రౌతులపూడిలోను, 10న శంఖవరంలో జరిగిన కొత్త పింఛన్లు పంపిణీ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లోపాలు టీడీపీలో మరింత అగ్గి రాజేశాయి. కొత్త పింఛన్లు పంఫిణీ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, దివంగత మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు ఫొటోలను వేశారు. కానీ, అది ఎమ్మెల్యే వర్గీయులకు రుచించలేదు. వెనకుండి ఎన్టీఆర్, చిట్టిబాబు ఫొటోలపై స్టిక్కర్లను అంటించేలా చేయించారని దివంగత ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు వర్గానికి చెందిన పలువురు తెలుగు తమ్ముళ్లు తిరగబడ్డారు. ఇదంతా ఎమ్మెల్యే పనేనని, ఆయన చెబితేనే అధికారులు తొలగించారని తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తమ్ముళ్ల ఆందోళన ఎమ్మెల్యే తీరుతో విభేదిస్తున్న పర్వత చిట్టిబాబు వర్గీయుల తమ నాయకులకు జరిగిన అన్యాయాన్ని నిలదీసేందుకు బుధవారం రోడ్డెక్కారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. జరిగిన అవమానికి బాధ్యులెవరని ఎంపీడీఓ ఎం.శ్రీనును నిలదీశారు. దీనికి సమాధానం చెప్పడానికి ఎంపీడీఓ మీనమేషాలు లెక్కిస్తున్నారంటూ అక్కడే కార్యాలయం ఎదుట ఆర్అండ్బీ రహదారిలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ముప్పైఏళ్లుగా పార్టీ జెండాను భుజాన పెట్టుకుని పార్టీకోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన చిట్టిబాబును, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఫొటోలపై మాసికను అంటించిడం తమను ఎంతగానో బాధించిందని, ఈ విషయంలో ఎవరి ఒత్తిడి వల్ల ఇలా చేశారో ఎంపీడీఓ చెప్పాలని వారంతా పట్టుబట్టారు. గత రెండేళ్లుగా ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల పంపిణీలో సమాన ప్రాధాన్యత ఇవ్వకుండా తీవ్ర వ్యత్యాసం చూపుతున్నారని, అయినా భరిస్తున్నామని, కాని తమ నాయకుల ఫొటోలపై మాసికలు వేయటం ఉద్దేశ్యపూర్వకంగా ఎమ్మెల్యే, ఆయన అనుచరుల అండతోపూ ఎంపీడీఓ ఈ చర్యలకు పూనుకున్నారని మండిపడ్డారు. దీంతో విషయం తెలుసుకున్న టీడీపీ నాయకుడు పర్వత చిట్టిబాబు సోదరుడు పర్వత రాజుబాబు, టీడీపీ నాయకులు బద్ది రామారావు తదితరులు వచ్చి ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఈ మేరకు ఎంపీడీఓ ఆందోళనకారుల వద్దకు వచ్చి బేనర్ ఏర్పాటులో ఏమైనా పొరపాట్లు జరిగితే సిబ్బంది లోపంతో జరిగింది తప్ప ఎలాంటి రాజకీయ ఒత్తిడిలు లేవని చెప్పుకొచ్చారు. -
జంప్ జిలానీలకు ఝలక్
సాక్షి ప్రతినిధి, కాకినాడ : జంప్ జిలానీలకు ఝలక్ ఇచ్చే రాజకీయాలు టీడీపీలో ఊపందుకున్నాయి. ముందొచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొమ్ములే మిన్న అన్నట్టుగా పార్టీ ఫిరాయించిన నేతలకే అధిష్టానం పెద్దపీట వేయడంతో సీనియర్లు వ్యూహం మార్చుతున్నారు. స్థానికంగా దెబ్బకొడితే దారికొస్తారని ఫిరాయింపు నేతలకు ప్రత్యామ్నాయంగా పావులు కదుపుతున్నారు. ఆధిపత్యానికి భంగం కలిగే పరిణామాలు చోటుచేసుకోవడంతోపాటు అస్థిత్వం కోల్పోయి ప్రమాదంలో ఉన్నామని గ్రహించిన యనమల రామకృష్ణుడు తన రాజకీయ చతురతకు పదునుపెడుతున్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుపై తొలి బాణం వదులుతున్నారు. ఫిరాయింపు నేతల రాకతో ప్రతికూల పరిస్థితులు ఫిరాయింపు నేతలొచ్చాక సీనియర్ నేత, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడినే లక్ష్యంగా టీడీపీలో వ్యూహాలు ఊపందుకున్నాయి. అందుకు తగ్గట్టుగానే టీడీపీ యువనేత లోకేష్‌బాబు డైరెక్షన్లో యనమల హవా తగ్గించే యత్నాలు ప్రారంభమయ్యాయి. ఒక్కొక్కటీ కార్యరూపం దాల్చాయి. యనమల అడ్డుకట్ట వేసినప్పటికీ జ్యోతుల నవీన్‌కు జెడ్పీ చైర్మన్ పీఠం కట్టబెట్టారు. అన్నవరం దేవస్థానం ఈఓ నియామకం విషయం ఏమైందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కాకినాడ మేయర్ విషయంలోనూ తన మాట చెల్లుబాటు కాలేదు. చివరకు కాకినాడ డీఎస్పీ పోస్టు నియామకంలో కూడా యనమలకు ప్రాధాన్యతలేకుండా పోయింది. తొండంగి మండలంలో నడుస్తున్న అక్రమ హేచరీల విషయంలో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. మేల్కొన్న యనమల... ఇప్పుడీ పరిణామాలే యనమలను రెచ్చగొట్టేలా చేస్తున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇలాగే వదిలేస్తే తన అస్థిత్వంకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భావించిన యనమల ఫిరాయింపు నేతలకు చెక్ పెట్టేందుకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. దానిలో భాగంగానే పక్కనే ఉన్న ప్రత్తిపాడు నియోజకవర్గంపై గురిపెట్టారు. తనను దెబ్బకొట్టే రాజకీయాలు చేస్తున్న వారిలో ఒకరైన వరుపుల సుబ్బారావును లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే యాదవ సామాజిక వర్గ నేతలతో మంతనాలు జరుపుతూ ప్రత్యామ్నాయ రాజకీయాలకు తెరలేపారు. రంగంలోకి తమ్ముడు –అంతర్గతంగా రగలిపోతున్న వరుపుల అన్న ఆదేశాలతో తమ్ముడు కృష్ణుడు బరిలోకి దిగారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల యాదవుల ఐక్యత పేరుతో సభలు, సమావేశాలు పెడుతున్నారు. ఇప్పటికే శంఖవరం మండలం కత్తిపూడి సమీపంలో ఇటీవల యనమల కృష్ణుడి సారథ్యంలో జిల్లా యాదవ మహాసభను నిర్వహించడం, దానికి ఆయన కుటుంబ సభ్యులే ప్రాతినిధ్యం వహించడం పాఠకులకు విదితమే. ఈ సభకు నియోజకవర్గం నలుమూలల్లోని తమ వర్గానికి చెందిన వారందర్నీ రప్పించారు. ఆ తర్వాత రౌతులపూడి మండలంలో యాదవ ప్రాబల్యం ఉన్న ఎస్.అగ్రహారం, గిడజాం, లచ్చిరెడ్డిపాలెం, రౌతులపూడి, శృంగవరం గ్రామాల్లో కృష్ణాష్టమి, దుర్గాష్టమి వేడుకల పేరుతో యనమల కృష్ణుడు విస్తృత పర్యటనలు చేయడం మరింత చర్చనీయాంశమైంది. అంతేకాకుండా అదే కులానికి చెందిన శంఖవరం మండల టీడీపీ అధ్యక్షుడు బద్ది రామారావును అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. శంఖవరం, రౌతులపూడి మండలాల్లో యనమల రామకృష్ణుడు ఎక్కడ పర్యటించినా తనే వెన్నంటి ఉండి నడిపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా వరుపుల ఏమీ అనలేని పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గంలో చోటుచేసుకున్న ప్రత్యామ్నాయ రాజకీయాలతో అంతర్గతంగా రగలిపోతున్నట్టు తెలుస్తోంది. -
ఎమ్మెల్యే కొడుకుపై రేప్ కేసు
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి చెందిన నాయకుల వారసుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కొడుకు అత్యాచారం కేసులో ఇరుక్కున్నాడు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు కుమారుడుపై పోలీసు కేసు నమోదు అయింది. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ సుబ్బారావు కుమారుడు రాజాబాబుపై సర్పవరం పోలీసులకు ఓ గిరిజన యువతి ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు రేప్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అలాగే క్రైం నెంబర్ 323/16 కింద కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. వైద్య పరీక్షల కోసం గిరిజన యువతిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మరోవైపు ఎమ్మెల్యే తనయుడిని కేసు నుంచి బయటపడేసేందుకు తెర వెనుక మంత్రాంగం నడుస్తున్నట్టు బాధితురాలి తరపువారు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
గండేపల్లి బాధితులకు వైఎస్ఆర్ సీపీ ఆర్థికసాయం
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం యూజేపురంలో గండేపల్లి ప్రమాద బాధితులకు వైఎస్ఆర్ సీపీ ఆర్థికసాయం అందించింది. మృతుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున, గాయపడిన వారికి రూ.5 వేల చొప్పున వైఎస్ఆర్ సీపీ నేత జ్యోతుల నెహ్రూ వారికి చెక్కులు అందజేశారు. జ్యోతులనెహ్రూతో పాటు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు కూడా ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
బైక్ ర్యాలీలతో సమైక్య హోరు
సాక్షి, కాకినాడ : సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా బైక్ ర్యాలీలతో పార్టీ శ్రేణులు హోరెత్తించారు. పార్టీ జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి ఆధ్వర్యంలో అమలాపురం హైస్కూల్ సెంటర్ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ పట్టణ పురవీధుల మీదుగా సాగింది. బస్టాండ్ సెంటర్, నల్ల వంతెన, ఎర్ర వంతెనల మీదుగా గడియార స్తంభం సెంటర్ వరకూ ఈ ర్యాలీ సాగింది. జెడ్పీ మాజీ చైర్మన్ చెల్లుబోయిన వేణు ఆధ్వర్యంలో కాకినాడ గొడారిగుంట నుంచి ప్రారంభమైన బైక్‌ర్యాలీ ఎన్ఎఫ్సీఎల్ రోడ్, ఎస్. అచ్యుతాపురం, ప్రతాప్‌నగర్, స్వామినగర్, ఇంద్రపాలెం, చీడిగ మీదుగా కొవ్వాడ వరకూ సాగింది. అక్కడ నుంచి గంగనాపల్లి, స్వామినగర్‌లలో వేణు ఆధ్వర్యంలో గడపగడపకూ వైఎస్సార్ సీపీ సమైక్య నినాదం పాదయాత్ర చేపట్టారు. రిటైర్డు డీఐజీ నాగేశ్వరరావు, పార్టీ నాయకులు కర్రి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలం లింగంపర్తి నుంచి ప్రారంభమైన బైక్‌ర్యాలీ ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాల పరిధిలోని గ్రామాల మీదుగా సాగింది. మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో పిఠాపురం పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ పిఠాపురం పట్టణ పురవీధులు, మండల పరిధిలోని గ్రామాల మీదుగా సాగింది. కేంద్ర కమిటీ సభ్యుడు గంపల వెంకట రమణతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ తనయుడు జ్యోతుల నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో కిర్లంపూడి మండలం బూరుగుపూడి నుంచి బైక్‌లపై పార్టీ శ్రేణులు మండల పరిధిలోని గ్రామాల మీదుగా ర్యాలీ నిర్వహించారు. రాజమండ్రి నగర కో- ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో కోటగుమ్మం సెంటర్ నుంచి బైక్ ర్యాలీ ప్రారంభించారు. అక్కడ నుంచి మెయిన్ రోడ్డు మీదుగా కోటిపల్లి బస్టాండ్ వరకూ ర్యాలీ సాగింది. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ నాయకులు బొడ్డు వెంకట రమణ చౌదరి, ట్రేడ్ యూనియన్ కార్యదర్శి టీకే విశ్వేశ్వరరెడ్డి, సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని తదితరులు పాల్గొన్నారు. పార్టీ కో-ఆర్డినేటర్ గుత్తుల సాయి ఆధ్వర్యంలో ముమ్మిడివరం కాసివాని తూము నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ అనాతవరం వరకు సాగింది. పార్టీ కార్యాలయం ఎదుట 216 జాతీయ రహదారిపై గంగిరెద్దులతో ఊరేగింపు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. పార్టీ కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు ఆధ్వర్యంలో పెద్దాపురం నుంచి సామర్లకోట వరకూ బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్దాపురం, సామర్లకోట పట్టణ కన్వీనర్లు పేర్నిడి ఈశ్వరరావు, గుణ్ణం రాజబ్బాయిలు పాల్గొన్నారు. కో-ఆర్డినేటర్ రెడ్డి వీర వెంకట సత్య ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన బైక్ ర్యాలీ మండపేట నుంచి మండలంలోని పలు గ్రామాల మీదుగా సాగింది. ద్వారపూడి వంతెనపై రాస్తారోకో నిర్వహించారు. కిసాన్‌సెల్ జిల్లా కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కో ఆర్డినేటర్ దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో తుని పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణ పురవీధుల మీదుగా సాగింది. పార్టీ జిల్లా వైద్య విభాగం కన్వీనర్ డాక్టర్ యనమదల మురళీకృష్ణ ఆధ్వర్యంలో కాజులూరు మండలం కుయ్యేరు నుంచి గొల్లపాలెం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధికార ప్రతినిధి గొల్లపల్లి డేవిడ్ రాజు ఆధ్వర్యంలో కొత్తపేట నుంచి ఏనుగుల మహల్ వరకూ జరిగిన బైక్ ర్యాలీలో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు రెడ్డి చంటి, ముసునూరి వేంకటేశ్వరరావులతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలో బొమ్మూరు నుంచి బైకు ర్యాలీ ప్రారంభించిన పార్టీ శ్రేణులు మోరంపూడి, హుకుంపేట, శాటిలైట్ సిటీ డీ-బ్లాక్ మీదుగా సాగింది. శివకోడు నుంచి రాజోలు సెంటర్ వరకు పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు.