వైఎస్సార్‌సీపీ ప్రత్తిపాడు అభ్యర్థికి త్రుటిలో తప్పిన ప్రమాదం | Accident car for YSRCP Prattipadu candidate | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ప్రత్తిపాడు అభ్యర్థికి వరుపుల సుబ్బారావుకు త్రుటిలో తప్పిన ప్రమాదం

Published Fri, May 24 2024 4:11 AM | Last Updated on Fri, May 24 2024 6:50 AM

Accident car for YSRCP Prattipadu candidate

గేదెలు అడ్డు రావడంతో ఢీకొన్న రెండు కార్లు

పిఠాపురం/ఏలేశ్వరం: కాకినాడ జిల్లా పిఠాపురం రాపర్తి సెంటర్‌ వద్ద 216 జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్‌సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బా­రావుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. 

బెండపూడి నుంచి వస్తున్న ఒక కారు రాపర్తి సెంటర్‌ వద్దకు వచ్చేసరికి గేదెలు అడ్డంగా వచ్చాయి. దీంతో ఆ కారు డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేక్‌ వేశాడు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న వరుపుల సుబ్బారావు కారు ముందున్న కారును బలంగా ఢీకొంది. రెండు కార్లూ దెబ్బతిన్నాయి. ఘటన జరిగిన వెంటనే వరుపుల సుబ్బారావు ఉన్న కారులో ఎయిర్‌ బ్యాగ్స్‌ తెరుచుకున్నాయి. దీంతో ఆయన సురక్షితంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు. 

అనంతరం సుబ్బారావు మరో కారులో కాకినాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి నుంచి స్వగ్రామమైన ఏలేశ్వరం మండలం, లింగంపర్తి చేరుకున్నారు. కాగా, ఈ ప్రమాదంలో ముందున్న కారులో ఉన్న వారికి కూడా ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement