ఎమ్మెల్యే కొడుకుపై రేప్ కేసు | rape case files on mla varupula subbarao son raja babu | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కొడుకుపై రేప్ కేసు

Published Fri, Sep 23 2016 12:08 PM | Last Updated on Sat, Jul 28 2018 8:40 PM

ఎమ్మెల్యే  కొడుకుపై రేప్ కేసు - Sakshi

ఎమ్మెల్యే కొడుకుపై రేప్ కేసు

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి చెందిన నాయకుల వారసుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కొడుకు అత్యాచారం కేసులో ఇరుక్కున్నాడు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు కుమారుడుపై పోలీసు కేసు నమోదు అయింది.

తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ సుబ్బారావు కుమారుడు రాజాబాబుపై సర్పవరం పోలీసులకు ఓ గిరిజన యువతి ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు రేప్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అలాగే క్రైం నెంబర్ 323/16 కింద కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. వైద్య పరీక్షల కోసం గిరిజన యువతిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

మరోవైపు ఎమ్మెల్యే తనయుడిని కేసు నుంచి బయటపడేసేందుకు తెర వెనుక మంత్రాంగం నడుస్తున్నట్టు బాధితురాలి తరపువారు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement